బెంగళూర్ : పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజ్ విద్యార్థిని అమూల్య లినా బెయిల్ దరఖాస్తును బెంగళూర్ కోర్టు తోసిపుచ్చింది. ఆమెను విడుదల చేస్తే ఇదే తరహా నేరాలకు పాల్పడే అవకాశంతో పాటు పారిపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. ఫిబ్రవరి 20న బెంగళూర్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో ఆమె పాకిస్తాన్ జిందాబాద్ అని నినదించారు. కాగా ఈ నినాదం చేసిన వెంటనే ఆమె వ్యాఖ్యలను ఓవైసీ ఖండించారు. తామంతా భారత్ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు.
ఈ నినాదం చేసిన వెంటనే ఆమెను పలువురు కిందకు తీసుకువెళుతుండగా, మైక్రోఫోన్‌ను లాక్కునే ముందు ఆమె హిందుస్తాన్ జిందాబాద్ అని, లాంగ్‌లివ్ ఇండియా అని నినదించారు.ర్యాలీలో అలజడి రేపిన అమూల్యపై బెంగళూర్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. కాగా ఆమె బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా అమూల్య ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు నివేదించారు. కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఆమె బెయిల్ పిటిషన్‌లో జాప్యం నెలకొంది. చదవండి : మిస్డ్ కాల్‌తో పరిచయం ఆపై..
Comments
Please login to add a commentAdd a comment