Amulya
-
సీరియల్స్‌లో చీరకట్టు.. ఇన్‌స్టాలో ఈ కన్నడ బ్యూటీని ఇలా చూస్తే ఏమైపోతారో..! (ఫోటోలు)
-
హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. డైరెక్టర్ కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ చిత్రసీమకు చెందిన ప్రముఖ యువ దర్శకుడు దీపక్ ఆరస్ కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. డైరెక్టర్ ఆకస్మిక మరణం శాండల్‌వుడ్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. దర్శకుడి మరణవార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన చెల్లెలు, నటి అమూల్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ కుటుంబంలో తీవ్ర విషాదంలో ఉందని ఎమోషనలైంది.కాగా.. దర్శకుడు దీపక్ ఆరస్ మనసాలజీ (2012), షుగర్ ఫ్యాక్టరీ (2023) లాంటి చిత్రాలతో ఫేమస్ అయ్యారు. అతని తొలిచిత్రం మనసాలజీతోనే విజయం అందుకున్నారు. 2023లో విడుదలైన షుగర్ ఫ్యాక్టరీ అనే కామెడీ ఎంటర్టైనర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇందులో డార్లింగ్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. కాగా..ఇప్పటికే దీపక్ ఆరస్కు పెళ్లి కాగా.. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన చెల్లెలు అమూల్య కన్నడలో హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంది. -
బుల్లితెర నటికి వేధింపులు.. వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు!
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. స్టార్ నటీమణులు సైతం ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. తాజాగా మరో నటి క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన సంఘటన జరిగింది. ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని అసభ్యకరమై సందేశాలు పంపించారని కన్నడ నటి అమూల్య గౌడ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారుతనను ఆడిషన్‌కు పిలిచి లైంగిక వేధింపులకు గురి చేసిన సూర్యపై పోలీసులకు నటి ఫిర్యాదు చేసింది . సినిమా పేరుతో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై అతన్ని నిలదీస్తే వెళ్లి పోలీసుకు చెప్పుకోమంటూ దారుణంగా మాట్లాడారని నటి తెలిపింది. కాస్టింగ్ డైరెక్టర్ అంటూ పరిచయం చేసుకుని వేధింపులకు గురి చేశాడంటూ వెల్లడించింది. కాగా.. అమూల్య కన్నడతో పాటు తెలుగు సీరియల్స్‌లోనూ నటిస్తోంది. కన్నడ బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. -
ప్రతి సినిమాకు అదే అసలైన బలం : విశ్వక్ సేన్
‘చరిత్ర సృష్టించే సినిమాలకు బడ్జెట్ ఇంత ఉండాలనే అవసరం లేదని ‘పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి, బలగం, మసూద, ఫలక్‌నుమా దాస్’ వంటి ఎన్నో చిత్రాలు నిరూపించాయి. సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టామనేది చూస్తుంటారు చాలామంది. కానీ ఆ చిత్రంలో పనిచేస్తున్న వాళ్లు ఎంత ప్రతిభావంతులు అనేది చూస్తే అదే సినిమాకు అసలైన బలం. ‘రామన్న యూత్’ చిత్రానికి అలాంటి మ్యాజిక్ జరగాలి.ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. అభయ్ నవీన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. అమూల్య రెడ్డి హీరోయిన్గా చేశారు. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడకకి విశ్వక్ సేన్, నటులు ప్రియదర్శి, తిరువీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో తిర్వీర్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు నాతో కలిసి ఆటోలో తిరిగిన అభయ్ నవీన్ ఇప్పుడు ఇలా సినిమా చేశాడని అంటే ఆనందంగా ఉంది. డబ్ స్మాష్ ద్వారా చాలా వీడియోలు చేసేవాడు. కలిసి సినిమాలో నటించాం. అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చిన అభయ్..ఇప్పుడు డైరెక్టర్ అయి మా ఫ్రెండ్స్ కు అవకాశాలు ఇవ్వడం సంతోషంగా ఉంది’ అన్నారు. ‘నేను సినిమా చూశాను. చాలా ఫన్ ఫీలయ్యా, అలాగే కొన్ని చోట్ల సర్ ప్రైజ్ అయ్యాను. రామన్న యూత్ సినిమాలో ఒక జీవితం ఉంటుంది’ అని హీరో ప్రియదర్శి అన్నారు. ‘‘ప్రేక్షకులకు చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అనేది తెలియదు. మంచి కథ ఉంటే ఆ చిత్రాన్ని తప్పకుండా చూస్తారు. ‘రామన్న యూత్’ని థియేటర్ లో చూసి ప్రోత్సహించాలి’’ అన్నారు అభయ్ నవీన్. -
అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది
‘‘కొత్త కొత్త ఆలోచనలతో యువ ప్రతిభావంతులు చిత్రపరిశ్రమకి రావాలి.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. మనం చూసిన ఓ ఊరి కథతో రూపొందిన ‘రామన్న యూత్’ సినిమా సక్సెస్ కావాలి’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. నవీన్ బేతిగంటి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. అమూల్య రెడ్డి హీరోయిన్. ఫైర్ ప్లై ఆర్ట్స్‌పై రజినీ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా కాన్సెప్ట్ ట్రైలర్‌ను శేఖర్ కమ్ముల విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘తన కోసం కష్టపడిన వారిని ఆ నాయకుడు నిర్లక్ష్యం చేస్తే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు? అనే మంచి కథని తీసుకున్నప్పుడే నవీన్ సక్సెస్ అయ్యాడు’’ అన్నారు. ‘‘రాజకీయాల్లో కింది స్థాయిలో తిరిగే ఒక యువకుడి కథే ఈ చిత్రం. ఆరు ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది’’ అన్నారు నవీన్. నటులు శ్రీకాంత్ అయ్యంగార్, అనిల్ గీల పాల్గొన్నారు. -
అమూల్య ప్రతిభ
నల్లమల అడవుల్లో ఓ కుగ్రామం దోమలపెంట. ఆ ఊరిలో పుట్టిన అమ్మాయి ఇమ్మడి అమూల్య. యూఎస్‌లో అడుగుపెట్టబోతోంది... విద్యార్థిగా కాదు! యంగ్ ఉమెన్ లీడర్షిప్ ప్రతినిధిగా...!! యూఎస్ కాన్సులేట్ ఎంపికలో విజేతగా!! ‘స్టడీ ఆఫ్ ద యూఎస్ ఇన్స్టిట్యూట్స్ 2022’ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది మన తెలుగుమ్మాయి అమూల్య. ఆమె సొంతూరు మహబూబ్ నగర్ జిల్లాలోని దోమలపెంట. నల్లమల అడవుల్లో అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామం అది. ఇప్పుడు హైదరాబాద్‌లోని ‘రాజ బహద్దూర్ వెంకట రామారెడ్డి ఉమెన్స్ కాలేజ్’లో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్‌లో రెండవ సంవత్సరం చదువుతోంది. కాలేజ్‌లోని ఎన్ఎస్ఎస్, క్విల్స్ క్లబ్, ఐక్యూ ఏస్ క్లబ్, ఎస్‌యూసి క్లబ్‌లలో మెంబర్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలలో చురుగ్గా ఉండేది. నల్గొండలో స్కూల్ రోజుల నుంచి కూడా అమూల్య వక్తృత్వం, వ్యాసరచనలలో ప్రైజ్‌లు అందుకుంది. ఇవన్నీ ఆమెను సామాజికాంశాల మీద నిర్వహించే ర్యాలీల్లో ముందు వరుసలో నిలబెట్టాయి. వీటికి తోడుగా ఆమె తన ఊరి స్కూల్ కోసం, ఆడపిల్లల చదువు గురించి స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమాలు కూడా తోడయ్యాయి. అమూల్య తన ఊరి కబుర్లు చెబుతూ నానమ్మ ఇమ్మడి సామ్రాజ్యం గారిని ప్రముఖంగా గుర్తు చేసుకుంది. ‘‘మా దోమలపెంటలో ఆడపిల్లలు చదువుకోవడం ఓ విచిత్రం. అలాంటిది మా నానమ్మ తన ఎనిమిది మంది కొడుకులతోపాటు కూతుర్ని కూడా చదివించింది. తాతయ్య పోవడంతో ఇంటి బాధ్యత పూర్తిగా నానమ్మ మీదనే పడింది. ఆమె బర్రెల పాలు అమ్మి అంతమందినీ చదివించింది. ఆడపిల్లలను బడికి పంపించని ఊరిలో, ఇన్ని ఆర్థిక కష్టాల మధ్య మా అత్తమ్మను చదివించడం అంటేనే ఆడపిల్లలు కూడా చదువుకోవాలని ఆమె ఎంత గట్టిగా నమ్మిందో తెలుస్తోంది. ఆ ప్రభావం మా అందరి మీదా ఉంది. పెద్ద నాన్నల నుంచి మా నాన్న చిన్నాన్నలు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్లు తమ ఊరికి, స్కూల్‌కి ఏదో ఒకటి చేయాలని మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. నేను కూడా ఏటా ఆగస్టు 15వ తేదీ, జనవరి 26న దోమలపెంట స్కూల్‌కి వెళ్లి విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, ఇతర స్టేషనరీ ఇస్తుంటాను. స్కూలు ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవడం, అమ్మాయిల ఉన్నత చదువులు ఎంత అవసరం అనే విషయాల మీద మాట్లాడేదాన్ని. నాన్న వాళ్లు మాత్రం ప్రగతిపథం అనే చారిటీతో స్కూల్‌కి వాటర్ ఫిల్టర్, ఫ్యాన్లు ఇచ్చేవాళ్లు. ఇవన్నీ నేను ఇష్టంగా చేస్తుంటాను. కొన్నేళ్ల కిందట మా ఊరిలో వీథి పక్కన పడి ఉన్న ఓ అమ్మాయిని ఓ ముసలావిడ దగ్గరకు తీసి పెంచింది. ఆ అమ్మాయి ఇప్పుడు టెన్త్ చదువుతోంది. కరోనా ఆన్లైన్ క్లాసుల సమయంలో తనకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాం. మంచి స్టూడెంట్ అని అప్పుడు తెలిసింది. టెన్త్ తర్వాత ఆ అమ్మాయి కాలేజ్ ఎడ్యుకేషన్ బాధ్యత కూడా మా కుటుంబమే తీసుకుంది. ‘మనం మనకోసం చేసుకున్న పని కంటే సమాజం కోసం చేసిన పనిలో ఎక్కువ సంతృప్తి దొరుకుతుంది’ అని నమ్ముతాను. యూఎస్ కాన్సులేట్ నన్ను ఎంపిక చేయడానికి ఇవన్నీ దోహదం చేశాయి. దశల వారీగా వడపోత మా కాలేజ్ వాళ్లు కొందరు విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి ముగ్గురిని ఎంపిక చేసి ఆ ముగ్గురినీ హైదరాబాద్‌లో ఉన్న యూఎస్ కాన్సులేట్‌కి పంపించారు. వాళ్లను కాన్సులేట్ వాళ్లు మళ్లీ ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ కాన్సులేట్‌లోనే జరుగుతుంది. కానీ కరోనా కారణంగా జూమ్ ఇంటర్వ్యూ చేశారు. దేశంలో అన్ని కాన్సులేట్ల నుంచి ఇంటర్వ్యూ రికార్డులు ఢిల్లీ కాన్సులేట్‌కి పంపిస్తారు. వాళ్లు వాటన్నింటినీ పరిశీలించి ఫైనల్‌గా ముగ్గురిని ఎంపిక చేస్తారు. ‘స్టడీ ఆఫ్ ద యూఎస్ ఇన్స్టిట్యూట్స్(ఎస్యూఎస్ఐ) 2022’కి ఎంపికైన ముగ్గురిలో నాతోపాటు అహ్మదాబాద్ నుంచి ఒకమ్మాయి, చెన్నై నుంచి ఒకమ్మాయి ఉన్నారు. కాన్సులేట్‌కి ఇచ్చిన నివేదికలో ‘నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను’ అనే వివరాలు రాయాలి. అలాగే ఈ ‘ఎస్యూఎస్ఐ ప్రోగ్రామ్‌కి హాజరైన తర్వాత ఆ సమాచారంతో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాను’ అనే విషయాన్ని కూడా చెప్పగలగాలి. అందులో మన భావంతోపాటు ఇంగ్లిష్ ప్రావీణ్యత, లీడర్షిప్ క్వాలిటీలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు’’ అంటూ ఎన్నో అమూల్యమైన విషయాలను వివరించింది అమూల్య. ఆమె జూన్‌నెల 23వ తేదీన యూఎస్ విమానం ఎక్కనుంది. 25వ తేదీ నుంచి యూఎస్, కాన్సాస్ రాష్ట్రంలోని ‘యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్’ లో మొదలయ్యే సమావేశాల్లో పాల్గొననుంది. ఆల్ ది బెస్ట్ అమూల్యా! మాకు గర్వకారణం! యూఎస్ కాన్సులేట్‌కు మేము మా విద్యార్థులను నామినేట్ చేసేటప్పుడు ‘ఆ విద్యార్థినే ఎందుకు నామినేట్ చేస్తున్నాం’ అనే అంశాన్ని సమగ్రంగా వివరించాలి. చదువులో చురుగ్గా ఉండడంతోపాటు సమాజానికి తన వంతు కంట్రిబ్యూషన్ ఇస్తున్న వారిని ఎంపిక చేయాలి. ఫౌండేషన్లు, చారిటీలు, ఎన్జీవోలతో కలిసి పని చేయడం వంటివి ప్రధానంగా ఉంటాయి. అమూల్య ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి. ఆడపిల్లల చదువు పట్ల పెద్దగా ఆసక్తి చూపించని మన భారతీయ గ్రామాల్లో అదొకటి. అలాంటి చోట నుంచి వచ్చిన ఈ అమ్మాయి తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా తనలాంటి ఆడపిల్లలందరూ ఎదగాలని కోరుకునేది. అందుకోసం గ్రామాలకు వెళ్లి ఆడపిల్లలకు ఉన్నత చదువు పట్ల అవగాహనతోపాటు, ‘ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి’ వంటి విషయాల్లో మెళకువలు చెప్తుంటుంది. ఇన్ని అర్హతలు ఉండడం వల్లనే దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది అప్లికేషన్ల నుంచి ఈ అమ్మాయికి అవకాశం వచ్చింది. ఒక చురుకైన అమ్మాయి తన సేవలను మరింత విస్తరింపచేయడంలో మా కాలేజ్ పాత్ర ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. – సంయుక్త, నోడల్ ఆఫీసర్, ఓవర్సీస్ స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ – వాకా మంజులారెడ్డి -
‘అమూల్య కేసు ఎన్ఐఏకి అప్పగించండి’
బెంగళూరు : పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసిన బెంగళూరుకు చెందిన విద్యార్థిని అమూల్య లియోన్(19) కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించాలని కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక సభలో ఫిబ్రవరి 20న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో ఫ్రీడమ్ పార్క్‌లో అమూల్య లియోన్ పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసిన విషయం తెలిసిందే. సభ నిర్వాహకులు ఆమె ప్రసంగాన్ని బలవంతంగా అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. (చైనా వస్తువులను బహిష్కరించండి: శివరాజ్ సింగ్ చౌహాన్) అయితే జూన్ 11న ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమూల్య లియోన్ కేసులో దర్యాప్తు బృందం సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయలేదని న్యాయవాది విశాల్ రఘు పిటిషన్లో దాఖలు చేశారు. అమూల్య లియోన్‌కు ఇచ్చిన బెయిల్‌పై హైకోర్టును సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.(చైనాకు హెచ్చరికలు జారీ చేయండి : సీఎం) -
పాకిస్తాన్‌కు జై కొట్టిన అమూల్యకు బెయిల్
బెంగళూరు: "పాకిస్తాన్ జిందాబాద్" అంటూ దేశ వ్యతిరేక నినాదాలు చేసిన యువతి అమూల్య లియోనాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలల పాటు జైలు జీవితం తర్వాత ఆమె బెయిల్‌పై విడుదల కానుంది. కాగా గురువారం నాటి విచారణలో బెంగళూరు కోర్టు ఆమె బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చిన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరు చేస్తే ఆమె పారిపోవడంతో పాటు మరోసారి ఇదే తరహా నేరాలకు పాల్పడే అవకాశముందని అభిప్రాయపడింది. (ఆమె నోట పాక్ పాట) ఫిబ్రవరి 20న బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొంది. ఇందులో ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్ఈన్ ఓవైజీ కూడా పాల్గొనగా.. అతని సమక్షంలోనే 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినదించింది. దీంతో అమూల్య వ్యాఖ్యలపై నిరసనగా పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. దేశ వ్యతిరేక కార్యకలాపాల కింద బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. (ఆ విద్యార్ధిని బెయిల్ పిటిషన్ కొట్టివేత..) -
అమూల్యకు బెయిల్ నిరాకరణ
బెంగళూర్ : పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజ్ విద్యార్థిని అమూల్య లినా బెయిల్ దరఖాస్తును బెంగళూర్ కోర్టు తోసిపుచ్చింది. ఆమెను విడుదల చేస్తే ఇదే తరహా నేరాలకు పాల్పడే అవకాశంతో పాటు పారిపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. ఫిబ్రవరి 20న బెంగళూర్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో ఆమె పాకిస్తాన్ జిందాబాద్ అని నినదించారు. కాగా ఈ నినాదం చేసిన వెంటనే ఆమె వ్యాఖ్యలను ఓవైసీ ఖండించారు. తామంతా భారత్ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ నినాదం చేసిన వెంటనే ఆమెను పలువురు కిందకు తీసుకువెళుతుండగా, మైక్రోఫోన్‌ను లాక్కునే ముందు ఆమె హిందుస్తాన్ జిందాబాద్ అని, లాంగ్‌లివ్ ఇండియా అని నినదించారు.ర్యాలీలో అలజడి రేపిన అమూల్యపై బెంగళూర్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. కాగా ఆమె బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా అమూల్య ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు నివేదించారు. కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఆమె బెయిల్ పిటిషన్లో జాప్యం నెలకొంది. చదవండి : మిస్డ్ కాల్‌తో పరిచయం ఆపై.. -
అమూల్యకు బెయిల్ ఇవ్వకూడదు
-
నిన్న అమూల్య.. నేడు ఆర్ధ్ర
కర్ణాటక, శివాజీనగర: పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అమూల్య లియోనా నినాదంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి సద్దుమణుగక ముందే మరో యువతి ఫ్రీ కశ్మీర్ అనే కరపత్రాన్ని ప్రదర్శించి ప్రజాగ్రహానికి కారణమైంది. గురువారం ఫ్రీడం పార్కులో అమూల్య వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పలు హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమానికి వచ్చిన ఆర్థ్రా అనే యువతి నిరసనకారుల వెనుక ప్లకార్డును పట్టుకుని నిలబడింది. ఆ ప్లకార్డు పోస్టర్లో ‘ముసల్మాన్, దళిత్ ట్రాన్జ్ ఆదివాసి ముక్త్’ అని రాసి ఉంది. ఆ పోస్టర్‌పై ఆందోళనకారులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిందని పలువురు శ్రీరామ సేన కార్యకర్తలు ఆరోపించారు. ఈ సమయంలోయువతిపై పలువురు దూసుకెళుతుండడంతో పోలీసులు యువతిని రక్షించి ఎస్.జే.పార్కు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనిపై వివరణ ఇచ్చిన సెంట్రల్ విభాగపు డీసీపీ చేతన్‌సింగ్ రాథోడ్, యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయలేదని, ఆమె చేతిలో ముక్తి కాశ్మీర్, ముక్తి ముస్లిం, ముక్త్ దలిత్ అనే ప్లకార్డు ఉంది. ఆ క్షణంలో యువతిపై దాడికి పలువురు యత్నించారన్నారు. ప్రస్తుతం ఆమె తమ అదుపులో ఉందని తెలిపారు. ఈ యువతి వెనుక ఎవరు ఉన్నారు. ఎక్కడ నుంచి వచ్చారనే విషయంపై తనిఖీ చేపడుతామని చేతన్ సింగ్ రాథోడ్ తెలిపారు. గురువారం జరిగిన ఘటనపై ధర్నా నిర్వాహకులైన శ్రీరామ సేనా రాష్ట్ర కార్యదర్శి హరీశ్ మాట్లాడుతూ... గుర్తుతెలియని యువతి ఎక్కడినుంచి వచ్చారని, ఎందుకు వచ్చారని తెలియదు. తమ ముందు నడచుకొంటూ వచ్చి అందరిలో చేరుకొని దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపించారు. తాము ఆమెను విచారించే సందర్భంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆమె మానసిక అస్వస్థతకు గురైన మహిళ అంటూ తీసుకెళ్లారన్నారు. అయితే తాము ఇంతటితో వదలమని, శ్రీరామసేనా రాష్ట్రాధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్‌తో చర్చించి తదుపరి నిర్ధారణ తీసుకొంటామని తెలిపారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయటం సరికాదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఆమె నోట పాక్ పాట
నిరంతరం భారత్‌పై విషంగక్కే శత్రుదేశానికి మద్దతుగా జయధ్వానాలు. అది కూడా చారిత్రక ఫ్రీడంపార్క్‌లో వందలాది మధ్య నినాదాలు. సీఏఏ వ్యతిరేక కార్యకర్త అమూల్య లియోన్ చర్యతో ప్రశాంతత భగ్నమైంది. పోలీసులు తక్షణం ఆమెను నిర్బంధించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో ఈ తరహా సంఘటనలు పెరగడం గమనార్హం. సాక్షి, బెంగళూరు: బెంగళూరు ఫ్రీడంపార్క్‌లో అపచారం చోటుచేసుకుంది. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం జరిగిన ఆందోళనలో అమూల్య లియోన్ అనే యువతి వేదికపై పాకిస్తాన్ జిందాబాద్ అని నినదించడం సంచలనం కలిగించింది. వెంటనే అక్కడున్న పోలీసులు ఆమెను వేదిక మీద నుంచి కిందకు తీసుకొచ్చి సమీపంలోని ఉప్పారపేట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ నుంచి రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. అమూల్య స్వస్థలం చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా శివపుర గ్రామవాసిగా గుర్తించారు. అలాగే అమూల్యను ఆ కార్యక్రమానికి ఎవరు ఆహ్వానించారు.. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాల వెనుక కారణాలేవైనా ఉన్నాయా? ఇలా వివిధ కోణాల్లో విచారణ జరుగుతోంది. సంబంధం లేదు కాగా, అమూల్యకు ఈ కార్యక్రమంతో ఎలాంటి సంబంధం లేదని నిర్వాహకుడు ఇమ్రాన్ పాషా చెప్పారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరూ వ్యాఖ్యలు చేసినా అది నేరమేనన్నారు. ఆమెకు ఆహ్వానమే పంపలేదని, ఆమె వేదికపై ఎలా మాట్లాడిందో అర్థం కాలేదని తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కాగా, అమూల్య వ్యాఖ్యలపై నిరసన భగ్గుమంటోంది. పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. అమూల్య వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం కర్ణాటక రక్షణ వేదిక నిరసన, ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే అమూల్య ఈ వ్యాఖ్యలు చేసినట్లు అంతా భావిస్తున్నారు. ఇది తాను పాల్గొనబోయే మూడో ఆందోళన, ఈ సభలో మాట్లాడబోతున్నట్లు తన ఫేస్బుక్ ఖాతాలో రాసుకొంది. మరోవైపు కొన్నిరోజుల క్రితమే హుబ్లీలో కేఎల్ఈ ఇంజనీరింగ్ కాలేజీ ముగ్గురు ముస్లిం విద్యార్థులు పాకిస్తాన్ జిందాబాద్ అని వ్యాఖ్యలు చేసి అరెస్టు అయిన విషయం తెలిసిందే. -
మామ తరఫున ప్రచారం చేస్తా
యశవంతపుర: రాజరాజేశ్వరినగర జేడీఎస్ అభ్యర్థి రామచంద్రప్ప తరపున ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు నటీ అమూల్య మంగళవారం విలేకర్లకు తెలిపారు. రామచంద్రప్ప స్వయాన తన మామ కావడంతో ఆయన తరఫున ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జేడీఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో జేడీస్ తరపుర ప్రచారం చేయాలనే విషయంపై ఒక నిర్ణయం తోసుకోలేదన్నారు. -
ఆకలి తీర్చే ఆప్తులు
సిటీకి చెందిన అమూల్య డాక్టర్. ఓ రోజు విధులు ముగించుకొని ఇంటికెళ్తుండగా ఆకలితో అలమటిస్తున్న వృద్ధుడిని చూసి చలించిపోయింది. రూ.200 ఇచ్చి ఏమైనా తినమని చెప్పింది. ఇంకా ఇలాంటి వారెందరో ఉన్నారనే ఆలోచన ఆమెను ఆలోచింపజేసింది. అంతే.. స్నేహితులతో కలిసి ఓ గ్రూప్ ఏర్పాటు చేసి రోజుకు 150 మంది ఆకలి తీరుస్తోంది. యూఎస్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అమూల్య నగరంలో ఓ హాస్పిటల్ నిర్వహిస్తోంది. ఆమె సందేశంతో ముందుకొచ్చిన నవనీత్, ఉమ, తేజ, సంస్కృతిలతో కలిసి నగరంలోని ప్రధాన సిగ్నల్ పాయింట్స్ వద్ద ఉండే యాచకులు, దూర ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వచ్చే పేదలకు భోజనం అందిస్తోంది. ఈ బృందం ప్రతి రోజు సుమారు 150 మందికి ఆహార ప్యాకెట్లు అందజేస్తోంది. ఇందుకు రోజుకు రూ.5 వేలు ఖర్చు చేస్తున్నట్లు అమూల్య చెప్పారు. కృష్ణా జిల్లాలోని పెడన సమీపంలోని కప్పలదొడ్డిలో 40 వృద్ధ కుటుంబాలున్నాయని తెలుసుకున్న అమూల్య... ప్రతి నాలుగు నెలలకు అక్కడి వెళ్లి, వారికి కావాల్సినవి అందజేస్తున్నారు. మమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని వారు ఎదురుచూస్తుంటే మాకెంతో ఆనందంగా ఉంటుందన్నారు. అందరి ఆకలి తీర్చాలి.. మేం ప్రస్తుతం కొద్ది మంది ఆకలే తీరుస్తున్నాం. భవిష్యత్తులో మరింత మంది ఆకలి తీర్చాలని అనుకుంటున్నాం. స్నేహితులు కూడా ఖర్చు విషయంలో రాజీ పడట్లేదు. ఎంత ఖర్చయినా అందరి ఆకలి తీర్చాలనేదే మా కోరిక. మాతో మరింత మంది కలిసి రావాలని ఆశిస్తున్నాం.– అమూల్య -
అందుకేనా? ఈ దూకుడు
ఇప్పటికే రమ్య, పూజాగాంధీ, రక్షిత, జయమాల, ఉమాశ్రీ తదితర అనేకమంది సినీ హీరోయిన్లు, నటీమణులు వెండితెరపై తళుకులీనడం పాత విషయమే. బాలనటిగా సినీ రంగంలో అడుగిడి, ఇటీవలే ఒక ఇంటిదైన 24 ఏళ్ల బెంగళూరు అమ్మాయి, అందాలతార అమూల్య రాజకీయాల్లో హిట్ కొట్టాలని చూస్తున్నారా?, లేదా భర్త రాజకీయ జీవితంలో చేదోడువాదోడుగా నిలవాలని నిర్ణయించుకున్నారా? ఆమె ఉత్సాహం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బొమ్మనహళ్లి: ఇప్పటికే కన్నడ సినిమా రంగంలో చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు, వస్తున్నారు. కొంతమంది రాజకీయాల్లో కొనసాగుతుండగా మరికొంతమంది ఇలా వచ్చి అలా వెళ్ళిన వారు కూడా ఉన్నారు. ఇటీవలే రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీచేస్తానని ప్రకటించడంతో అందరి కళ్లు సినీ–రాజకీయాలపై పడ్డాయి. కొంతకాలం కిందటే పెళ్ళి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన కన్నడ ప్రముఖ నటి అమూల్య ఆ తరువాత సినిమాల వైపు చూడలేదు. అయితే ఆ అందగత్తె రాజకీయాల వైపు ఆసక్తిగా ఉన్నట్లు గాంధీనగరలో వినిపిస్తోంది. సోషల్ మీడియాలో హల్చల్ చెలువిన చిత్తార సినిమాతో హీరోయిన్గా పేరుపొందిన అమూల్య ప్రస్తుతం రాజకీయాల్లోకి రాకపోయినా, భర్త జగదీష్‌తో కలిసి అనేక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటోంది. భర్తది రాజకీయ కుటుంబం. ఆయన బీజేపీ నాయకుడన్నది తెలిసిందే. వీరి నివాసం బెంగళూరు ఆర్ఆర్ నగర. అమూల్య తాను పాల్గొంటున్న అన్ని సేవా కార్యక్రమాలను తన ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేస్తోంది. వీటన్నింటినీ చూస్తుంటే అమూల్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుంది అని సన్నిహితులు కొందరు గట్టిగా చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగదీష్ ఏదో ఒకచోట నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే భార్య అమూల్యను అయినా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి. అందుకే దంపతులు ఇద్దరు కలిసి ఇలా రాజకీయ, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు గాంధీనగర పెద్దలు అంటున్నారు. ఒకవేళ భర్త జగదీష్ పోటీ చేసినా ఆయన కోసం, పార్టి కోసం అమూల్య పాటుపడక తప్పదు. అందుకే ఇప్పటినుంచే రాజకీయ, సేవా కార్యక్రమాలతో అనుభవం సంపాదిస్తోంది. -
అమూల్య డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ బ్యాడ్మిం టన్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ జోసెఫ్ పాఠశాలకు చెందిన అమూల్య సత్తా చాటింది. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ టోర్నీలో అమూల్య అండర్–19, అండర్–17 బాలికల సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన అండర్–19 బాలికల సింగిల్స్ ఫైనల్లో అమూల్య 30–12తో ప్రియ (డీపీఎస్)పై, అండర్–17 విభాగంలో 30–24తో సౌమ్య వ్యాస్ (వీజీఎస్)పై విజయం సాధించింది. అండర్–14 బాలికల ఫైనల్లో జి. సంజన (ఒయాసిస్) 30–26తో సౌమ్య వ్యాస్పై, అండర్–10 విభాగంలో షగుణ్ (ఇండస్) 30–26తో సృష్టి (ఇండస్)పై గెలుపొంది విజేతలుగా నిలిచారు. మరోవైపు బాలుర విభాగంలో బి. రాజేశ్, కె. శ్రీనివాస్, శశాంక్, గౌతమ్‌లు టైటిళ్లను గెలుచుకున్నారు. అండర్–19 సిం గిల్స్ ఫైనల్లో బి. రాజేశ్ 30–24తో సిద్ధాంత్ (డీపీఎస్)పై, అండర్–17 కేటగిరీలో కె. శ్రీనివాస్ 30–20తో టి. శ్రీజిత్ (జీవీఎస్)పై, అండర్– 14 విభాగంలో శశాంక్ సాయి (జేహెచ్‌పీఎస్) 30–23తో ఆర్. ధరన్ కుమార్‌పై, అండర్–10 కేటగిరీలో గౌతమ్ (డీపీఎస్) 30–26తో సార్థక్ (ఎపిస్టిమ్ గ్లోబల్ స్కూల్)పై గెలుపొందారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు బి. సాయి ప్రణీత్, బి. సుమీత్ రెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
మాజీ కార్పొరేటర్ కొడుకుతో నటి నిశ్చితార్థం!
కన్నడ గోల్డెన్ క్వీన్‌గా పేరు పొందిన ప్రముఖ నటి, 'చెలువిన చిత్తార' సినిమా హీరోయిన్ అమూల్య త్వరలో వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నది. రాజకీయ నాయకుడు, మాజీ కార్పొరేటర్ జీహెచ్ రామచంద్రన్ కొడుకు జగదీష్ ఆర్ చంద్రతో ఆమె నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. మే నెలలో వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. 23 ఏళ్ల అమూల్య ఇప్పటివరకు 20కిపైగా కన్నడ చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయికగా పేరు సంపాదించుకుంది. తన సహ నటుడు గణేష్ భార్య ద్వారా జగదీశ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం పరిణయానికి దారితీసింది. 2001లో బాలనటిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన అమూల్య అనతికాలంలోనే నటిగానూ తనను తాను నిరూపించుకుంది. కన్నడ హీరో గణేష్ సరసన చెలువిన చిత్తార సినిమాలో నటించిన ఆమె.. చైత్రదా చంద్రమా, నాను నన్న కనసు, శ్రావణి సుబ్రహ్మణ్య, గజకేసరి వంటి చిత్రాలతో విజయాలు అందుకుంది. శ్రావణి సుబ్రహ్మణ్య సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆమెకు ఫిలింఫేర్ అవార్డు లభించింది. -
పాత రూ. 500 నోటుతో బీఎస్ఎన్ఎల్ అమూల్య ప్లాన్
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పాత రూ. 500 నోటుతో బీఎస్ఎన్ఎల్ అమూల్యప్లాన్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు సంస్థ జీఎం పి.శామ్యూల్ జాన్ వెల్లడించారు. ఈ ప్లాన్ తీసుకున్న వారికి రూ. 500 విలువ చేసే టాక్ టైమ్ కూడా ఉచితంగా ఇస్తామని శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్ ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
బర్త్ డే వేడుకలకు నటి దూరం
బొమ్మనహళ్లి (బెంగళూరు): కన్నడ గోల్డెన్ క్వీన్‌గా పేరు పొందిన కన్నడ నటి, చెలువిన చిత్తార హిరోయిన్ అమూల్య బుధవారం 22 సంవత్సరాలు పూర్తి చేసుకోని 23వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కానీ రాష్ట్రంలో కావేరి నీటి కోసం జరుగుతున్న పోరాటాలు, బెంగళూరులో జరిగిన ఘర్షణల నేపథ్యంలో బుధవారం నిర్వహించాల్సిన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుంది. ఈ సందర్భంగా అమూల్య మీడియాతో మాట్లాడుతూ ఏటా తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య జరిగేవన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కావేరి నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగడంతో కన్నడిగులు ఉద్యమిస్తున్నారన్నారు. ఈ దశలో పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకోవడం సబబుగా ఉండదన్నారు. అందుకోసమే జన్మదిన వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు చెప్పారు. -
ఓ ఇంటివాడైన దర్శకుడు..
దర్శకుడు హను రాఘవపూడి ఓ ఇంటివాడయ్యాడు. ఈ సందర్భంగా హీరో నాని ....హనుకు వివాహ శుభాకాంక్షలు తెలిపాడు. నాని తన ట్విట్టర్ ద్వారా ' హనుగాడి వీర ప్రేమ గాథ బిగిన్స్. విషింగ్ యూ ఏ హ్యాపీ బ్లాక్ బూస్టర్ మ్యారీడ్ లైఫ్' అంటూ ట్విట్ చేశాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాధలాంటి సినిమాలతో యూత్‌లో ఫాలోయింగ్ సృష్టించుకున్న దర్శకుడు హను రాఘవపూడి. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అమూల్యతో.. హను వివాహం శుక్రవారం ( 26న) వైభవంగా జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే. హైదరాబాద్ లో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో అమూల్య డాక్టర్‌గా పని చేస్తున్నారు. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడు హను రాఘవపూడి ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత నానీ హీరోగా కృష్ణగాడి వీర ప్రేమగాధలాంటి సినిమాతో యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హను తన తదుపరి చిత్రం హీరో నితిన్‌తో ప్లాన్ చేస్తున్నాడు. అనంతరం అఖిల్‌ను డైరెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే ప్రముఖ దర్శకుడు క్రిష్ కూడా పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. క్రిష్ పెళ్లాడిన రమ్యసాయి కూడా వైద్యురాలే. Hanu gaadi Veera prema Gaadha begins. Wishing u a happy blockbuster married life @hanurpudi pic.twitter.com/2yrSk3dHGm — Nani (@NameisNani) 27 August 2016