
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. స్టార్ నటీమణులు సైతం ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. తాజాగా మరో నటి క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన సంఘటన జరిగింది. ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని అసభ్యకరమై సందేశాలు పంపించారని కన్నడ నటి అమూల్య గౌడ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు
తనను ఆడిషన్‌కు పిలిచి లైంగిక వేధింపులకు గురి చేసిన సూర్యపై పోలీసులకు నటి ఫిర్యాదు చేసింది . సినిమా పేరుతో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై అతన్ని నిలదీస్తే వెళ్లి పోలీసుకు చెప్పుకోమంటూ దారుణంగా మాట్లాడారని నటి తెలిపింది. కాస్టింగ్ డైరెక్టర్ అంటూ పరిచయం చేసుకుని వేధింపులకు గురి చేశాడంటూ వెల్లడించింది. కాగా.. అమూల్య కన్నడతో పాటు తెలుగు సీరియల్స్‌లోనూ నటిస్తోంది. కన్నడ బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది.
Comments
Please login to add a commentAdd a comment