బెంగళూరు : పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసిన బెంగళూరుకు చెందిన విద్యార్థిని అమూల్య లియోన్(19) కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించాలని కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక సభలో ఫిబ్రవరి 20న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో ఫ్రీడమ్ పార్క్‌లో అమూల్య లియోన్ పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేసిన విషయం తెలిసిందే. సభ నిర్వాహకులు ఆమె ప్రసంగాన్ని బలవంతంగా అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. (చైనా వస్తువులను బహిష్కరించండి: శివరాజ్ సింగ్ చౌహాన్)
అయితే జూన్ 11న ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమూల్య లియోన్ కేసులో దర్యాప్తు బృందం సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయలేదని న్యాయవాది విశాల్ రఘు పిటిషన్‌లో దాఖలు చేశారు. అమూల్య లియోన్‌కు ఇచ్చిన బెయిల్‌పై హైకోర్టును సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.(చైనాకు హెచ్చరికలు జారీ చేయండి : సీఎం)
Comments
Please login to add a commentAdd a comment