బెంగళూరు: బెంగళూరులో కుక్కర్ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి వంట సామాను మొత్తం చెల్లాచెదురు అయిపోయింది. ఈ పేలుడులో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడు వెనక ఉగ్రవాద కోణం లేదని పోలీసులు పేర్కొన్నప్పటికీ.. తీవ్రతను పరిశీలించడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం సంఘటనా స్థలానికి రంగంలోకి దిగింది.
బెంగళూరులోని జేపీ నగర్‌లోని ఉడిపి ఉపహారా ఫుడ్‌షాప్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు కుక్కర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సమీర్, మొహిసిన్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరూ ఉత్తర ప్రదేశ్‌కి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
‘‘పేలుడు పదార్థాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాం. ఇది ప్రెషర్ కుక్కర్ పేలుడుగా తేలింది. ఉదయం దర్యాప్తు కోసం అక్కడి సామగ్రిని పరిశీలించాం. అల్లర్లు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. అయితే పేలుడు తీవ్రతను తెలుకునేందుకు ఎన్‌ఐఏ అధికారులు ఘటనాస్థలానికి వచ్చారు’ అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఏడాది మొదట్లో బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో ఐఈడీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment