cooker bomb
-
బెంగళూరులో కుక్కర్ పేలుడు.. రంగంలోకి ఎన్ఐఏ
బెంగళూరు: బెంగళూరులో కుక్కర్ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి వంట సామాను మొత్తం చెల్లాచెదురు అయిపోయింది. ఈ పేలుడులో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడు వెనక ఉగ్రవాద కోణం లేదని పోలీసులు పేర్కొన్నప్పటికీ.. తీవ్రతను పరిశీలించడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం సంఘటనా స్థలానికి రంగంలోకి దిగింది. బెంగళూరులోని జేపీ నగర్‌లోని ఉడిపి ఉపహారా ఫుడ్‌షాప్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు కుక్కర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సమీర్, మొహిసిన్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరూ ఉత్తర ప్రదేశ్‌కి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ‘‘పేలుడు పదార్థాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాం. ఇది ప్రెషర్ కుక్కర్ పేలుడుగా తేలింది. ఉదయం దర్యాప్తు కోసం అక్కడి సామగ్రిని పరిశీలించాం. అల్లర్లు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. అయితే పేలుడు తీవ్రతను తెలుకునేందుకు ఎన్ఐఏ అధికారులు ఘటనాస్థలానికి వచ్చారు’ అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఏడాది మొదట్లో బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో ఐఈడీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు. -
Bengaluru: షారిఖ్‌పై ఉగ్ర ముఠాల గురి?.. రహస్యాలన్నీ చెప్పేస్తాడని భయం
రేవు నగరిలో బాంబు విస్ఫోటం దేశమంతటా చర్చనీయాంశమైంది. ఈ పేలుడులో ప్రాణాలతో దొరికిపోయిన ఉగ్ర అనుమానితుడు షారిఖ్ వద్ద విలువైన సమాచారం పోలీసులకు లభిస్తోంది. బడా ఉగ్రవాదుల నెట్వర్క్ తాళం అతని వద్ద ఉందని ఎన్ఐఏ కూడా విచారిస్తోంది. ఇక షారిఖ్ వల్ల తమకు నష్టమే తప్ప లాభం లేదనుకున్న ఉగ్రవాద ముఠాలు అతన్ని హతమార్చాలని కుట్రలు చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. సాక్షి, బెంగళూరు(యశవంతపుర): మంగళూరు కుక్కర్ బాంబ్ పేలుడు నిందితుడు షారిఖ్‌ను అంతమొందించాలని ఉగ్రవాద ముఠాలు ప్లాన్ వేసినట్లు అనుమానాలు వచ్చాయి. దీంతో సోమవారం నుంచి షారిఖ్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి చుట్టూ భద్రతను మరింత పెంచారు. ఓ ఉగ్రవాద సంస్థ చేసిన పోస్ట్‌లో షారిఖ్‌ను హత్య చేయాలనేలా కొన్ని ఆధారాలు పోలీసులకు చిక్కాయి. స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులు ఈ దాడి చేసే అవకాశం ఉంది. షారిఖ్ వల్ల తమ రహస్యాలన్నీ పోలీసులకు చేరిపోతాయని, అందరూ ఇబ్బందుల్లో పడతామని, కాబట్టి అతన్ని హతమారిస్తే ఈ సమస్య ఇంతటితో అయిపోతుందని ఉగ్రవాదుల ఆలోచనగా పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆస్పత్రి గదుల వద్ద మెటల్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేసి వచ్చి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. షారిఖ్ కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఫోన్లో బాంబుల తయారీ, ఐసిస్, అల్‌ఖైదా వీడియోలు నిందితుడు షారిఖ్ మొబైల్లో 12 వందల వీడియోలు బయట పడ్డాయి. ఇందులో బాంబ్‌ను ఎలా తయారు చేయాలనే వీడియోలతో పాటు ఐసిస్, అల్‌ఖైదా ఉగ్రవాదుల వీడియోలు ఉండటం పోలీసు వర్గాలను ఆందోళన కలిగిస్తోంది. ఇతడు అనేక చోట్ల భారీ మొత్తాల్లో నగదు వ్యవహారం చేశాడు. నాలుగేళ్ల నుంచి బాంబ్ తయారీ కోసం తపించేవాడని, కొన్నిసార్లు ఉన్మాదంగా ప్రవర్తించేవాడని షారిఖ్ కుటుంబసభ్యులు పోలీసులకు వివరించారు. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాలోని తన స్వగ్రామంలో బాంబ్‌ను తయారు చేసి పేల్చిన సంగతి బయట పడింది. చిన్నవయస్సులోనే దారి తప్పి ఇలాంటి ఘటనలకు పాల్పడటంపై గ్రామస్థులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేలుడు రోజున షారిఖ్‌తో పాటు బ్యాగ్ తగిలించుకొని వచ్చిన యువకుడు అదృశ్యమయ్యాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నా జాడ లేదు. వలస కార్మికులపై నిఘా దక్షిణ కన్నడ జిల్లాలో పోలీసులు వలస కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కారి్మకుల వివరాలను సేకరించేపనిలో ఉన్నారు. ఇసుక తరలింపు, రబ్బర్, వక్కతోటలు, సిమెంట్, టైల్స్, గ్రానైట్, హోటల్, బార్లు, ఎస్టేట్లలో పని చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కారి్మకుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: స్వామీజీ తీరప్రాంతంలో అనుమానాస్పదమైన కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తులపై నిఘా పెట్టాలని ఉడుపి పేజావర విశ్వప్రసన్నతీర్థ స్వామి ప్రజలను హెచ్చరించారు. అయన సోమవారం మంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. కుక్కర్ బాంబ్ పేలుడు తరువాత కరావళిలో జరుగుతున్న ఉగ్రవాదుల కార్యకలాపాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానంగా కనిపించేవారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కరావళి ప్రాంతాలలో అనేక జాతర, తిరునాళ్లు జరుగుతున్నాయి. ఇలాంటి రద్దీ ప్రదేశాలలో ఏదైనా జరిగితే పెద్ద ముప్పు ఏర్పడుతుందన్నారు. -
అంగన్వాడీ కేంద్రంలో పేలిన కుక్కర్
శ్రీకాకుళం , లావేరు: మండలంలోని తాళ్లవలస అంగన్వాడీ కేంద్రంలో పెనుప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా కుక్కర్ పేలడంతో కార్యకర్తకు గాయాలయ్యాయి. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఉదయం అంగన్వాడీ కార్యకర్త వెంకటలక్ష్మి కుక్కర్లో పప్పు వండుతుండగా అది అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో కార్యకర్త మొహంతో పాటు మరికొన్ని చోట్ల కాలిపోయింది. వెంటనే ఆమెను గ్రామస్తులు శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కుక్కర్ పేలిన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ..కేంద్రానికి పరుగున వచ్చారు. అయితే పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న మండల పరిషత్ ప్రత్యేకాహ్వానితుడు ముప్పిడి సురేష్, రణస్థలం ఐసీడీఎస్ ప్రాజెక్టు పీవో కె.రూపవతి, ఎంపీడీవో ఎం.కిరణ్‌కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు జి.ఝూన్సీ, పి.కరుణశ్రీ.. అంగన్వాడీ కార్యకర్త వెంకటలక్ష్మిని పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను కోరారు. -
నెల్లూరు బాంబు పేలుడు అల్ ఉమా పనే?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం జరిగిన బాంబు పేలుడు అల్ ఉమా ఉగ్రవాద సంస్థ పనేనా? పోలీసు వర్గాల్లో ఈ అభిప్రాయం వినిపిస్తోంది. చిత్తూరు, కేరళలోని కొల్లం, పుదుచ్చేరి కోర్టుల ప్రాంగణాల్లో ఇటీవలి కాలంలో జరిగిన బాంబు పేలుళ్లకు ఇది కొనసాగింపనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ను భయభ్రాంతులు చేయడానికే ఈ చర్యకు పాల్ప డి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చిత్తూరు, కొల్లం, పుదుచ్చేరి కోర్టుల ఆవరణాల్లో బాంబు పేలుళ్లు జరిగిన తీరు, అందులో వాడిన పేలుడు పదార్థాలు, వాటిని పేల్చిన తీరు గురించి ప్రత్యేక బృందం వివరాలు సేకరించింది. ఈ పేలుళ్లకు నెల్లూరు పేలుడుకు దగ్గరి పోలికలు ఉండటంతో ఈ విధ్వంసం కూడా అల్ఉమా ఉగ్రవాద సంస్థ పనే అయిఉండొచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. డీఎస్పీ, ఇద్దరు సీఐలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం దర్యాప్తు సాగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఆధారాలు సేకరించడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్, జాతీయ నేరపరిశోధన సంస్థలు రంగంలోకి దిగాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం మంగళవారం నెల్లూరుకు చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించింది. స్థానిక అధికారులతో సమావేశమై వారి వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించింది. -
కోర్టు ఆవరణలో పేలుడు
-
కోర్టు ఆవరణలో పేలుడు
కోర్టు ఆవరణలో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టుల సముదాయం వద్ద జరిగింది. కోర్టు ప్రహరీ సమీపంలో ఉన్న చెత్తకుండీలో కుక్కర్ బాంబు పేలింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో అందరూ పరుగులు తీశారు. పేలుడు ధాటికి కోర్టు అద్దాలు కూడా పగిలాయి. అయితే అప్పటికే భోజన విరామ సమయం కావడం, న్యాయవాదులు అంతా బయటకు రావడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు తగలలేదు. క్యాంటీన్‌కు సమీపంలో ఈ పేలుడు సంభవించింది. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సముదాయంలో ఐదు కోర్టులు ఉంటాయి. వీటిలో ఏదో ఒక కోర్టుకు తీసుకొచ్చే నిందితులను తప్పించడానికి ఇలాంటి ప్రయత్నం జరిగిందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే బాంబు పేలిన ప్రదేశం కోర్టుకు చాలా దూరంలో ఉండటం, బయట ఒక చెత్తకుండీలో పెట్టడంతో అసలు దీని టార్గెట్ ఏమై ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.