

'గుండెనిండా గుడి గంటలు' సీరియల్‌కి తెలుగులో చాలామంది అభిమానులు ఉన్నారు.

ఈ సీరియల్‌కు అంతమంచి గుర్తింపు రావడం వెనుక ప్రధాన కారణం అమూల్య గౌడ అనే చెప్పొచ్చు.

స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్‌లో మీనా పాత్రలో ఆమె మెప్పించింది.

‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్‌లో చీర, కట్టుబొట్టుతో కనిపించే ఈ బ్యూటీని ఇన్‌స్టా ఫాలో అవుతున్న కుర్రాళ్ల గుండెల్ని గిలిగింతలుపెడుతోంది.

కన్నడలో చాలా ఏళ్లుగా సీరియల్స్ చేస్తున్న ఈ బ్యూటీ.. తెలుగులో కార్తీకదీపంతో ఎంట్రీ ఇచ్చింది.

అన్నీ అనుకూలిస్తే ఏదోరోజు తెలుగు బిగ్‌బాస్‌లో కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఈ బ్యూటీకి ఉంది.

సీరియల్స్ కోసం తన పాత్ర మేరకు చీర కట్టులో కనిపించే అమూల్య.. నిజ జీవితంలో చాలా మాడరన్ లుక్‌లో ఉంటుంది.



కన్నడ బిగ్‌బాస్9లో తన గ్లామర్‌తో అక్కడి యూత్‌ను ఆకట్టుకుంది.

ఇన్‌స్టాలో ఆమె ఫోటోలు చూసిన ప్రేక్షకులు నోరెళ్లబెడుతున్నారని చెప్పవచ్చు.













