మాజీ కార్పొరేటర్‌ కొడుకుతో నటి నిశ్చితార్థం! | actress gets engaged to ex corporator son | Sakshi
Sakshi News home page

మాజీ కార్పొరేటర్‌ కొడుకుతో నటి నిశ్చితార్థం!

Published Tue, Mar 7 2017 3:31 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

మాజీ కార్పొరేటర్‌ కొడుకుతో నటి నిశ్చితార్థం!

మాజీ కార్పొరేటర్‌ కొడుకుతో నటి నిశ్చితార్థం!

కన్నడ గోల్డెన్‌ క్వీన్‌గా పేరు పొందిన ప్రముఖ నటి, 'చెలువిన చిత్తార' సినిమా హీరోయిన్‌ అమూల్య త్వరలో వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నది. రాజకీయ నాయకుడు, మాజీ కార్పొరేటర్‌ జీహెచ్‌ రామచంద్రన్‌ కొడుకు జగదీష్‌ ఆర్‌ చంద్రతో ఆమె నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. మే నెలలో వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది.

23 ఏళ్ల అమూల్య ఇప్పటివరకు 20కిపైగా కన్నడ చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయికగా పేరు సంపాదించుకుంది. తన సహ నటుడు గణేష్‌ భార్య ద్వారా జగదీశ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం పరిణయానికి దారితీసింది. 2001లో బాలనటిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన అమూల్య అనతికాలంలోనే నటిగానూ తనను తాను నిరూపించుకుంది. కన్నడ హీరో గణేష్‌ సరసన చెలువిన చిత్తార సినిమాలో నటించిన ఆమె.. చైత్రదా చంద్రమా, నాను నన్న కనసు, శ్రావణి సుబ్రహ్మణ్య, గజకేసరి వంటి చిత్రాలతో విజయాలు అందుకుంది. శ్రావణి సుబ్రహ్మణ్య సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆమెకు ఫిలింఫేర్‌ అవార్డు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement