Kannada film actor
-
నటుడు చిరంజీవి సర్జా కన్నుమూత
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హీరో చిరంజీవి సర్జా (39) గుండెపోటుతో కన్నుమూశారు. ‘యాక్షన్ కింగ్’ అర్జున్‌కు మేనల్లుడు, మరో కన్నడ నటుడు ధ్రువ్ సర్జాకు సోదరుడు చిరంజీవి సర్జా. ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి సర్జా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆయన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ చిరంజీవి సర్జా మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. భార్య మేషునా రాజ్‌తో చిరంజీవి సర్జా గత మూడు, నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని వైద్యులు తెలిపారు. మృతదేహం నుంచి కరోనా పరీక్షల కోసం నమూనాలను సేకరించారు. 1980 అక్టోబరు 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి సర్జా కెరీర్ తొలినాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. ఆ తర్వాత నటుడిగా మారి 2009లో ‘వాయుపుత్ర’ అనే చిత్రంతో హీరోగా కెరీర్‌ను ప్రారంభించారు. ‘ఆకే’, ‘సింగా’, ‘సంహారా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన చిరంజీవి సర్జా యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు ఆయన 19 సినిమాల్లో హీరోగా నటించారు. గత ఏడాది చిరంజీవి సర్జా నటించిన నాలుగు సినిమాలు (సింగా, ఖాకీ, ఆద్యా, శివార్జున) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాగే ఆయన హీరోగా కమిటైన నాలుగు సినిమాల్లో ఒక చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా, మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. 2018 మే 2న నటి మేఘనా రాజ్‌ను వివాహమాడారు చిరంజీవి సర్జా. భర్త మరణంతో తీవ్రశోకంలో మునిగిపోయారు మేఘనా రాజ్. పలువురు సినీ ప్రముఖులు చిరంజీవి సర్జా మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. సోమవారం ఉదయం చిరంజీవి సర్జా స్వగ్రామం తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా జక్కేనహళ్లిలో అంత్యక్రియలు జరుగుతాయి. -
హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం
బెంగుళూరు: కన్నడ చిత్రసీమంలో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జా (39) గుండెపోటుతో ఆదివారం హఠాన్మరణం చెందారు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఈయన మేనల్లుడు. జూన్ 6న చిరంజీవి సర్జాకు శ్వాసకోస సమస్య రావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆయన వయసు తక్కువే కావడంతో ఇది హృదయ సంబంధ వ్యాధి అని ఎవరూ అనుకోలేదు. కానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన చిరంజీవికి తీవ్రమైన ఛాతీ నొప్పి కూడా వచ్చినట్టు తెలిసింది. దాంతో ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చిరంజీవి సర్జా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఆకే, సింగా, సంహారా వంటి విజయవంతమైన సినిమాల్లో హీరోగా నటించారు. చిరంజీవికి నటి మేఘనా రాజ్‌తో 2018లో వివాహం జరిగింది. ఇక ఆయన సోదరుడు ధ్రువ సర్జా కూడా సినిమా ఇండస్ట్రీలోనే నటుడిగా ఉన్నారు. భర్త ఆకస్మిక మృతితో మేఘనా రాజ్ కుప్పకూలిపోయింది. అభిమానులు, సినీ ప్రముఖులు హీరో మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. సర్జా– మేఘన జంట -
మాజీ కార్పొరేటర్ కొడుకుతో నటి నిశ్చితార్థం!
కన్నడ గోల్డెన్ క్వీన్‌గా పేరు పొందిన ప్రముఖ నటి, 'చెలువిన చిత్తార' సినిమా హీరోయిన్ అమూల్య త్వరలో వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నది. రాజకీయ నాయకుడు, మాజీ కార్పొరేటర్ జీహెచ్ రామచంద్రన్ కొడుకు జగదీష్ ఆర్ చంద్రతో ఆమె నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. మే నెలలో వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. 23 ఏళ్ల అమూల్య ఇప్పటివరకు 20కిపైగా కన్నడ చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయికగా పేరు సంపాదించుకుంది. తన సహ నటుడు గణేష్ భార్య ద్వారా జగదీశ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం పరిణయానికి దారితీసింది. 2001లో బాలనటిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన అమూల్య అనతికాలంలోనే నటిగానూ తనను తాను నిరూపించుకుంది. కన్నడ హీరో గణేష్ సరసన చెలువిన చిత్తార సినిమాలో నటించిన ఆమె.. చైత్రదా చంద్రమా, నాను నన్న కనసు, శ్రావణి సుబ్రహ్మణ్య, గజకేసరి వంటి చిత్రాలతో విజయాలు అందుకుంది. శ్రావణి సుబ్రహ్మణ్య సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆమెకు ఫిలింఫేర్ అవార్డు లభించింది. -
కోర్టుకు హాజరైన ప్రముఖ నటి
బొమ్మనహల్లి(కర్ణాటక): చెక్కు బౌన్స్ కేసులో ప్రముఖ నటి పూజా గాంధీ శుక్రవారం ఇక్కడి 16వ ఏసీఎంఎం కోర్టుకు హాజరయ్యారు. కొద్ది నెలల క్రితం స్వీయ నిర్మాణంలో ఆమె ‘ముత్తులక్ష్మి’ సినిమా ప్రారంభించారు. ఈ సినిమా కోసం ఫైనాన్స్ వ్యాపారి విజయ్ కుమార్ నుంచి 4 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత రూ. 4 కోట్లకు చెక్కు ఇచ్చారు. అయితే ఈ చెక్కు బౌన్స్ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. గతంలో పలుమార్లు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన కోర్టు శుక్రవారం తండ్రి పవన్ గాంధీతో కలిసి తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆమె న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. కన్నడ, తమిళం, బెంగాలీ, హిందీ, మలయాళం సినిమాల్లో పూజా గాంధీ నటించారు. 2012లో రాజకీయ ప్రవేశం చేశారు. మొదట్లో జేడీఎస్ చేరిన ఆమె తర్వాత కేజేపీలోకి మారారు. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాయచూరు నుంచి బీఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.