బర్త్ డే వేడుకలకు నటి దూరం | Kannada Actress Amulya distance to birthday celebrations for ka | Sakshi
Sakshi News home page

బర్త్ డే వేడుకలకు నటి దూరం

Sep 15 2016 9:34 AM | Updated on Sep 27 2018 8:27 PM

బర్త్ డే వేడుకలకు నటి దూరం - Sakshi

బర్త్ డే వేడుకలకు నటి దూరం

కన్నడ గోల్డెన్‌ క్వీన్‌గా పేరు పొందిన కన్నడ నటి, చెలువిన చిత్తార హిరోయిన్‌ అమూల్య బుధవారం 22 సంవత్సరాలు పూర్తి చేసుకోని 23వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

బొమ్మనహళ్లి (బెంగళూరు): కన్నడ గోల్డెన్‌ క్వీన్‌గా పేరు పొందిన కన్నడ నటి, చెలువిన చిత్తార హిరోయిన్‌ అమూల్య బుధవారం 22 సంవత్సరాలు పూర్తి చేసుకోని 23వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కానీ రాష్ట్రంలో కావేరి నీటి కోసం జరుగుతున్న పోరాటాలు, బెంగళూరులో జరిగిన ఘర్షణల నేపథ్యంలో బుధవారం నిర్వహించాల్సిన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుంది.

ఈ సందర్భంగా అమూల్య మీడియాతో మాట్లాడుతూ  ఏటా తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య జరిగేవన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కావేరి నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగడంతో కన్నడిగులు ఉద్యమిస్తున్నారన్నారు. ఈ దశలో పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకోవడం సబబుగా ఉండదన్నారు. అందుకోసమే జన్మదిన వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement