
ఓ ఇంటివాడైన దర్శకుడు..
దర్శకుడు హను రాఘవపూడి ఓ ఇంటివాడయ్యాడు. ఈ సందర్భంగా హీరో నాని ....హనుకు వివాహ శుభాకాంక్షలు తెలిపాడు. నాని తన ట్విట్టర్ ద్వారా ' హనుగాడి వీర ప్రేమ గాథ బిగిన్స్. విషింగ్ యూ ఏ హ్యాపీ బ్లాక్ బూస్టర్ మ్యారీడ్ లైఫ్' అంటూ ట్విట్ చేశాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాధలాంటి సినిమాలతో యూత్లో ఫాలోయింగ్ సృష్టించుకున్న దర్శకుడు హను రాఘవపూడి. హైదరాబాద్కు చెందిన డాక్టర్ అమూల్యతో.. హను వివాహం శుక్రవారం ( 26న) వైభవంగా జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే. హైదరాబాద్ లో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో అమూల్య డాక్టర్గా పని చేస్తున్నారు.
అందాల రాక్షసి సినిమాతో దర్శకుడు హను రాఘవపూడి ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత నానీ హీరోగా కృష్ణగాడి వీర ప్రేమగాధలాంటి సినిమాతో యూత్లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హను తన తదుపరి చిత్రం హీరో నితిన్తో ప్లాన్ చేస్తున్నాడు. అనంతరం అఖిల్ను డైరెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే ప్రముఖ దర్శకుడు క్రిష్ కూడా పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. క్రిష్ పెళ్లాడిన రమ్యసాయి కూడా వైద్యురాలే.
Hanu gaadi Veera prema Gaadha begins.
— Nani (@NameisNani) 27 August 2016
Wishing u a happy blockbuster married life @hanurpudi pic.twitter.com/2yrSk3dHGm