అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది | Ramanna Youth Movie Trailer Launch by Sekhar Kammula | Sakshi
Sakshi News home page

అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది

Published Mon, Nov 21 2022 4:21 AM | Last Updated on Mon, Nov 21 2022 4:21 AM

Ramanna Youth Movie Trailer Launch by Sekhar Kammula - Sakshi

శివ, శేఖర్‌ కమ్ముల, నవీన్, అమూల్య

‘‘కొత్త కొత్త ఆలోచనలతో యువ ప్రతిభావంతులు చిత్రపరిశ్రమకి రావాలి.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. మనం చూసిన ఓ ఊరి కథతో రూపొందిన ‘రామన్న యూత్‌’ సినిమా సక్సెస్‌ కావాలి’’ అని దర్శకుడు శేఖర్‌ కమ్ముల అన్నారు. నవీన్‌ బేతిగంటి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్‌’. అమూల్య రెడ్డి హీరోయిన్‌. ఫైర్‌ ప్లై ఆర్ట్స్‌పై రజినీ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

ఈ సినిమా కాన్సెప్ట్‌ ట్రైలర్‌ను శేఖర్‌ కమ్ముల విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘తన కోసం కష్టపడిన వారిని ఆ నాయకుడు నిర్లక్ష్యం చేస్తే వాళ్లు ఎలా రియాక్ట్‌ అవుతారు? అనే మంచి కథని తీసుకున్నప్పుడే నవీన్‌ సక్సెస్‌ అయ్యాడు’’ అన్నారు. ‘‘రాజకీయాల్లో కింది స్థాయిలో తిరిగే ఒక యువకుడి కథే ఈ చిత్రం. ఆరు ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది’’ అన్నారు నవీన్‌. నటులు శ్రీకాంత్‌ అయ్యంగార్, అనిల్‌ గీల పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement