Shekhar Kammula
-
ఇన్నేళ్ల కెరీర్లో ఎక్కడా రాజీపడలేదు: శేఖర్ కమ్ముల
‘‘కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి, సినిమాల పరిధి పెరిగింది. ఇప్పుడంతా పాన్ ఇండియా అంటున్నారు. మాది పాన్ ఇండియా మూవీ అని ప్రకటించుకుంటే సరిపోదు. ప్రేక్షకుల మైండ్ సెట్ గమనించాలి. కథ పరంగా మన నేటివిటీకి తగినట్లు సరైన సినిమా తీస్తే తప్పకుండా పాన్ ఇండియా స్థాయికి చేరుతుంది’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ మూవీ 2007లో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఆ సినిమాను నేడు రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల చిత్ర పరిశ్రమలోకి వచ్చి 25 ఏళ్లవుతోంది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని శేఖర్ కమ్ముల పంచుకున్న విశేషాలు. ► చిత్ర పరిశ్రమలో 25 సంవత్సరాల ప్రయాణంలో నేను నిలబడడం చూస్తే చాలా గర్వంగా ఉంది. నా తొలి చిత్రం ‘డాలర్ డ్రీమ్స్’ (2000) నుంచి ‘లవ్ స్టోరీ’ (2021) సినిమా వరకూ ఇన్నేళ్ల కెరీర్లో ఎక్కడా రాజీ పడకుండా నా విలువలకు తగినట్లు సినిమా తీయడం గొప్పగా అనిపిస్తోంది. నేను ఏ సినిమా చేసినా విలువలు, సిద్ధాంతాలతో తీయాలని, చెడు చెప్పకూడదు అనే ఆలోచనతోనే తీశాను. పేరు, డబ్బు కోసం చిత్ర పరిశ్రమకి రాలేదు. అలాంటి ఆలోచనతో సినిమాలూ తీయలేదు.. అదే నాకు గర్వంగా ఉంది. ఇప్పుడు సినిమా రంగంలో పోకడ చాలా హార్‡్షగా ఉంది. ► ‘హ్యాపీ డేస్’ సినిమా చేస్తున్నప్పుడు నా గ్రాడ్యుయేషన్ పూర్తయి పదేళ్లయింది. అప్పటి పరిస్థితుల రీత్యా ఆ మూవీకి స్టూడెంట్ బ్యాక్‌గ్రౌండ్ చక్కగా కుదిరింది. అయితే నేడు టెక్నాలజీ మారింది. ప్రతి స్టూడెంట్ చేతిలో మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి. కోవిడ్, గ్లోబలైజేషన్ వంటి పరిస్థితుల తర్వాత ఆలోచనా విధానం మారింది. సాంకేతిక పరంగా ఇప్పుడు విద్యార్థులు ఎవరి లోకంలో వారు ఉన్నారు. ‘హ్యాపీ డేస్’ సినిమా విడుదలై ఇన్నేళ్లయినా చాలా ఫ్రెష్‌గా ఉంది. రీ రిలీజ్ కూడా యూత్‌కు ఓ పండగలా ఉంటుందని అనిపించింది. ‘హ్యాపీ డేస్’కి సీక్వెల్ తీయాలనిపించింది.. కానీ, కథ కుదరలేదు. ► ఇన్నేళ్ల నా ప్రయాణంలో పది చిత్రాలు చేశాను. అయితే నా ప్రయాణం నిదానంగా సాగుతోందనుకోవడం లేదు. నేను ఏ సినిమా చేసినా ఈ కథ అవసరమా? అని ఆలోచించి చేస్తాను. నేను సినిమా చేసే పద్ధతి, నా సినిమాలే మాట్లాడతాయి. కాపీ కొట్టే కథలు నేను చేయను. కంటెంట్ పరంగా బాగా, సూటిగా చె΄్పాలనుకుంటాను. మనసులో ఓ ఆలోచన రావడానికి, అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుంది. అలా కాకుండా వెంట వెంటనే సినిమాలు చేయాలనుకోను. ► నా తొలి చిత్రం ‘డాలర్ డ్రీమ్స్’కి జాతీయ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత నంది అవార్డులతో పాటు మరికొన్ని అవార్డులు కూడా అందుకున్నాను. అయితే మళ్లీ జాతీయ అవార్డు అందుకోవాలనే ఆలోచన లేదు. నేను రాజీపడకుండా సినిమా తీస్తున్నాను.. అందుకే సంతోషంగా ఉన్నాను. నా చిత్రాలకు ప్రేక్షకులు ఇచ్చే అవార్డే గొప్పది. ఒక్కో ఏడాది జాతీయ స్థాయిలో మనకంటే మంచి సినిమాలు వస్తుంటాయి.. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని అవార్డుకి ఎంపిక చేస్తారు. అయితే మంచి కంటెంట్ తీసుకుని ముందుకెళ్లడమే మన పని. ► నా కెరీర్లో తొలిసారి నాగార్జున, ధనష్ వంటి స్టార్ హీరోలతో ‘కుబేర’ అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాను. ఈ కథకు వారిద్దరూ సరిపోతారనిపించి చేస్తున్నాను.. అంతేకానీ, పెద్ద ్రపాజెక్ట్, బిగ్ స్కేల్లో సినిమా చేయాలనే ఆలోచనతో కాదు. వారిద్దరితో పని చేయడం గొప్ప అనుభూతి. నిర్మాత, దర్శకుడికి మధ్య స్వేచ్ఛ, నమ్మకం అనేది ఉండాలి. అది ఏషియన్ మూవీస్ బేనర్లో నాకెక్కువగా ఉంది. ‘లీడర్’ సినిమాకి సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉంది. కానీ సమయం కుదరడం లేదు. చేస్తే మాత్రం తప్పకుండా రానాతోనే చేస్తాను. -
గోవాను టార్గెట్ చేసిన ధనుష్, నాగార్జున
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘డీఎన్ఎస్’(వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముంబై మాఫియా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తిరుపతి పరిసరప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణను, గోవాలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్. ధనుష్, నాగార్జున పాల్గొనగా కీలక సన్నివేశాలను తీశారు. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్‌లోప్రారంభం కానుందని తెలిసింది. ధనుష్, నాగార్జున పాల్గొనే ఈ షెడ్యూల్లోనే హీరోయిన్ రష్మికా మందన్నా కూడా జాయిన్ అవుతారట. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
గోవాలో మాఫియా
ధనుష్ హీరోగా దర్శకుడు శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముంబై నేపథ్యంతో మాఫియా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ తిరుపతిలో ప్రారంభమైంది. కాగా ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ గోవాలో జరగనున్నట్లు తెలిసింది. దాదాపు రెండు వారాలపాటు సాగే ఈ షెడ్యూల్లో ధనుష్, నాగార్జున కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తారట దర్శకులు శేఖర్ కమ్ముల. ఈ షెడ్యూల్లోనే రష్మికా మందన్నా కూడా జాయిన్ అవుతారట. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
శేఖర్ కమ్ములతో మూడో సినిమా ప్లాన్ చేస్తున్న ఆ మేకర్స్
డైరెక్టర్ శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ కలయికలో మూడో సినిమా ప్రకటన వచ్చింది. శ్రీ నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గతంలో వీరి కలయికలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా వచ్చిన ‘లవ్ స్టోరీ’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. రెండో సినిమాగా ధనుష్, నాగార్జునలతో ఓ మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతోంది. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ తమ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ‘‘శేఖర్ కమ్ములతో తీయబోయే మూడో చిత్రం లార్జర్ దెన్ లైఫ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హై బడ్జెట్, టాప్ క్లాస్ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ మూవీ రూపొందనుంది. ధనుష్, నాగార్జునలతో శేఖర్ కమ్ముల తీస్తున్న మూవీ చిత్రీకరణ పూర్తయ్యాక ఈ మూవీ సెట్స్‌పైకి వెళుతుంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్. -
కొత్త ప్రపంచాన్ని సృష్టించారు
‘‘సర్కారు నౌకరి’ సినిమా ట్రైలర్ బాగుంది. ఈ మూవీ ద్వారా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. గాయని సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భావన హీరోయి¯Œ . ఆర్కే టెలీషోపై కె.రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదలకానుంది. ఈ మూవీ ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘వెంకటేశ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్‌లను హీరోలుగా పరిచయం చేశాను.. వారంతా ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు. ‘సర్కారు నౌకరి’ తో పరిచయమవుతున్న ఆకాష్ కూడా వారిలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఆకాష్ ΄ాడగలిగినా నటనపై ఎక్కువ ఆసక్తి ఉండటంతో హీరోగా పరిచయవుతున్నాడు’’ అన్నారు సునీత. ‘‘నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం’’ అన్నారు గంగనమోని శేఖర్. ‘‘నాకు తొలి అవకాశాన్ని ఇచ్చిన రాఘవేంద్రరావుగారికి ధన్యవాదాలు’’ అన్నారు ఆకాష్. -
డబ్బు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా.. ఎందుకు?
పైసా మే పరమాత్మ అంటారు. ఒక్క చిన్న మార్పు. ఇప్పుడు ‘పైసా మే సినిమా’ అనాలి. ఎందుకంటే రిలీజ్ తర్వాత సాధించే పైసా వసూల్ కోసం పైసల చుట్టూ కథలు అల్లి కొన్ని సినిమాలు తీస్తున్నారు. ‘పైసా మే సినిమా’... అంటూ పైసల మీద తీస్తున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. వినోదం.. సందేశం వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రాలు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’. భార్యాభర్తల అనుబంధాలతో అల్లుకున్న ‘ఎఫ్ 2’ అయినా.. వారసత్వం నేపథ్యంతో సాగిన ‘ఎఫ్ 3’ అయినా.. ఈ రెండు సినిమాల్లో అంతర్లీనంగా ఉన్న ప్రధానాంశం డబ్బుతో కూడుకున్న అవసరాలేనని ప్రేక్షకులకు అనిపిస్తుంది. ‘ఎఫ్ 3’లో అయితే జీవితంలో డబ్బు చాలా ముఖ్యమంటూ ‘లబ్ డబ్.. లబ్ డబ్.. డబ్బూ..’ అనే పాట కూడా ఉంది. ఈ చిత్రం ఎండింగ్లో ‘ఎఫ్ 4’ ఉంటుందన్నట్లుగా పేర్కొన్నారు. వచ్చే ఏడాది ‘ఎఫ్ 4’ సినిమా ఆరంభం కానుందట. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ల మాదిరిగానే ‘ఎఫ్ 4’ ప్రధాన కథాంశం డబ్బే అయ్యుంటుందని ఊహించవచ్చు. ఖరీదైన భవనాలు.. నోట్ల కట్టలు దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించే చిత్రాలు వినోదంతో పాటు సందేశాత్మకంగానూ ఉంటాయి. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందనున్న తాజా సినిమాలో ధనుష్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ఒకవైపు అత్యంత ఖరీదైన భవనాలు, మరోవైపు మురికి వాడలు.. మధ్యలో నోట్ల కట్టలు కనిపిస్తుంటాయి. సో.. ఈ సినిమా ప్రధాన కథాంశం డబ్బు నేపథ్యంలో ఉంటుందని, సమాజంలో నెలకొన్న అసమానతల కోణంలో కథనం సాగుతుందని ఊహింవచ్చు. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. జూదం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా పీరియాడికల్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ పాన్ ఇండియన్ సినిమాకు ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్, టైటిల్‌ని బట్టి ‘మట్కా’ కథ అంతా డబ్బు చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ‘మట్కా’ను తెరకెక్కిస్తున్నట్లు, వైజాగ్ నేపథ్యంలో 1958 – 1982 టైమ్ పీరియడ్‌లో ఈ సినిమా కథనం ఉంటుందన్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సామాన్యుడి కథ నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథగా రూపొందనున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించనున్న సినిమా ఇది. ‘లక్కీ భాస్కర్’ టైటిల్‌ను గమనిస్తే టైటిల్లో డాలర్ సింబల్ స్పష్టంగా కనిపిస్తుంది. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన వ్యక్తి కథ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. సో..‘లక్కీ భాస్కర్’ కథలోని ప్రధానాంశం డబ్బే అని తెలుస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డాలర్ కుమార్ ‘బిగ్ బాస్’ షో ఫేమ్ వీజే సన్నీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’. ఏ ట్విస్టెడ్ ఫ్యామిలీ స్టోరీ అనేది ఉపశీర్షిక. హ్రితికా శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంజయ్ శేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డాలర్ కుమార్ అనే పాత్రలో నటిస్తున్నారు వీజే సన్నీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌లో డబ్బు కనిపిస్తుండటం ‘సౌండ్ పార్టీ’ ప్రధాన కథాంశం డబ్బేఅని స్పష్టం చేస్తోంది. డబ్బే ప్రధానాంశంగా సాగే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
ధనుష్‌కి జోడీగా...
హీరో ధనుష్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మికా మందన్నని ఖరారు చేశారు మేకర్స్. శ్రీ నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్), అమిగోస్ క్రియేషన్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా రష్మిక మందన్న తన ఆనందాన్ని పంచుకుంటూ– ‘‘చాలా ఎగ్జయిటెడ్‌గా ఉంది. ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను’’ అంటూ ‘డీ 51’ ఫొటో ఫ్రేమ్‌ని షేర్ చేశారు. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలి నారంగ్. -
ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో ‘డీ 51’
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీర్వాదంతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. కాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నారాయణ్ దాస్ కె. నారంగ్ జయంతి సందర్భంగా గురువారం ‘డీ 51’ చిత్రం అప్డేట్ ఇచ్చారు. ‘‘డీ 51’లో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ధనుష్‌ని చూపించే పర్ఫెక్ట్ కథను శేఖర్ కమ్ముల సిద్ధం చేశారు’’ అన్నారు నిర్మాతలు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకి సమర్పణ: సోనాలీ నారంగ్. -
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల సినిమా షురూ
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మూడు భాషల్లో తెరకెక్కనున్న సినిమా షురూ అయింది. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘‘తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మించి, విడుదల చేస్తాం. వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు మా సినిమా కోసం పని చేయనున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలి నారంగ్. -
అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది
‘‘కొత్త కొత్త ఆలోచనలతో యువ ప్రతిభావంతులు చిత్రపరిశ్రమకి రావాలి.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. మనం చూసిన ఓ ఊరి కథతో రూపొందిన ‘రామన్న యూత్’ సినిమా సక్సెస్ కావాలి’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. నవీన్ బేతిగంటి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. అమూల్య రెడ్డి హీరోయిన్. ఫైర్ ప్లై ఆర్ట్స్‌పై రజినీ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా కాన్సెప్ట్ ట్రైలర్‌ను శేఖర్ కమ్ముల విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘తన కోసం కష్టపడిన వారిని ఆ నాయకుడు నిర్లక్ష్యం చేస్తే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు? అనే మంచి కథని తీసుకున్నప్పుడే నవీన్ సక్సెస్ అయ్యాడు’’ అన్నారు. ‘‘రాజకీయాల్లో కింది స్థాయిలో తిరిగే ఒక యువకుడి కథే ఈ చిత్రం. ఆరు ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది’’ అన్నారు నవీన్. నటులు శ్రీకాంత్ అయ్యంగార్, అనిల్ గీల పాల్గొన్నారు. -
శేఖర్ కమ్ములకు ఎన్ని ‘నంది’ అవార్డులో తెలుసా?
ఎపుడొచ్చామన్నది కాదు.. హిట్ కొట్టామా లేమా అనేది సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్టయిల్. కొత్త వాళ్లతో ప్రయోగాలు.. చాలా కూల్‌గా , అంతే డీప్‌గా ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోవడం ఆయన శైలి. సిల్వర్ స్క్రీన్‌పై ఫీల్ గుడ్ మూవీలకు కేరాఫ్ అడ్రస్. ఆనంద్, గోదావరి, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ.. జానర్ ఏదైనా అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తాడు శేఖర్ కమ్ముల. ఫిబ్రవరి 4 మిస్టర్ కూల్ డైరెక్టర్ శేఖర్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ స్టోరీ.. Happy Birthday Shekhar Kammula: ‘డాలర్ డ్రీమ్స్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శేఖర్ కమ్ముల 1972 ఫిబ్రవరి 4న జన్మించారు. తొలి సినిమాతోనే ఫస్ట్ సినిమాతోనే పలు అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు.అచ్చతెలుగు తియ్యదనం, విలువలకు ప్రాధాన్యత ఇస్తూ తెలుగు సినిమాకు వన్నెలద్దిన అతికొద్దిమందిలో శేఖర్ కమ్ముల ఒకరు. సిల్వర్ స్క్రీన్ పై తన దర్శక ప్రతిభతో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే ఐనా తనదైన స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో మంచి కాఫీ లాంటిమూవీల నుంచి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆనంద్, గోదావరి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా, లవ్‌స్టోరీ లాంటి సినిమాలను భారీ విజయాలను సాధించాయి. అటు మిడిల్ క్లాస్ వారైనా ఇటు యూత్ ప్రేక్షకులైనా ఫిదా అవ్వాల్సిందే. సకుటుంబ సపరివారం సమేతంగా థియేటర్ల ముందు జనం క్యూ కట్టాల్సిందే. తనకేసొంతమైన టేకింగ్‌తో ఏకంగా ఆరు నంది అవార్డులను సొంతం చేసుకున్నాడు. దటీజ్ దర్శక లీడర్ శేఖర్ కమ్ముల. అంతేకాదు ప్రముఖ దర్శకుడు బాపు, విశ్వనాథ్ తరువాత హీరోయిన్ను అందంగా, ఆత్మవిశ్వాసంగా ప్రొజెక్ట్ చేసిన ఘనత శేఖర్‌దే అని కచ్చితంగా చెప్పవచ్చు. అందంగా లేనా అంటూ తనదైన మేకింగ్ స్టైల్‌తో అదరగొట్టేస్తాడు. పాపికొండల అందాలు, ఉప్పొంగే గోదావారితో పాటు హీరోయిన్ కమలినీ ముఖర్జీని తనదైన శైలిలో అందంగా చూపించాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా కమర్షియల్‌గా గ్రాండ్ సక్సెస్ కాలేపోయిప్పటికీ బెస్ట్ దర్శకుడుగా నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఆ తరువాత అందరూ కొత్త నటులతో చేసిన హ్యాపీడేస్‌తో సూపర్ డూపర్ హిట్కొట్టాడు.ఫిల్మ్ ఫేర్ అవార్డును కైవసం చేసుకుంది ఈ సినిమా ద్వారా పరిచయం అయిన నటులు స్టార్స్‌గా ఎదిగారు. అవకాయ్ బిర్యాని మూవీ కూడా పెద్దగా విజయం సాధించలేదు. పాలిటికల్ జానర్లో దగ్గుబాటి రానాను హీరోగా పరిచయం చేసిన మూవీ లీడర్. ఈ మూవీ విమర్శలకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. బెస్ట్ స్టోరీ రైటర్‌గా ఈ సినిమాకు శేఖర్ కమ్ముల నంది అవార్డు అందుకున్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్’, అలాగే కహానీ సినిమాకు రీమేక్‌గా తెలుగులో నయనతార కథానాయికగా వచ్చిన ‘అనామిక’ కూడా నిరాశపర్చాయి. ఆ తర్వాత వరుణ్ తేజ్, సాయిపల్లవి జోడీగా వచ్చిన ‘ఫిదా’ మూవీ ఆడియన్స్‌ను ఫిదా చేసింది. తెలంగాణ, అమెరికా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్నందుకుంది. ఇక తాజాగా నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమా హిట్టా ఫట్టా అనేది తనకు తెలిసిపోతుందని ఒక సందర్భంలో శేఖర్ కమ్ముల చెప్పారు. తన కథల్ని పెద్ద హీరోలు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే తనకు కథని నేరేట్ చేయడం రాదు. తాను స్టోరీ చెప్తుంటే వినేవాళ్లకి ఆవలింతలు వస్తాయని చమత్కరించారు హ్యాపీడేస్ సినిమా ట్రెండ్ సెట్టర్ అని బల్లగుద్ది మరీ చెప్పాను. అలాగే పాలిటిక్స్ సినిమాల్లో లీడర్ నిలబడుతుందన్నా. బట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ దెబ్బతీసిందంటూ తన అనుభవాలను గతంలో గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే. -
అలా సిద్ధమయ్యాకే సినిమా చేస్తా: హీరో శర్వానంద్
Sharvanand Interesting Comments In Lakshya Pre Release Function: యంగ్ హీరో నాగశౌర్య, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం 'లక్ష్య'. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ సినిమా డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. క్రీడా నేపథ్యంతో వస్తోన్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం (డిసెంబర్ 5) జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్, దర్శకుడు శేఖర్ కమ్ముల, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపించద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శర్వానంద్ 'క్రీడా నేపథ్యంతో సినిమా చేయడానికి, తీయడానికి చాలా ధైర్యం కావాలి. ఈ జోనర్లో వచ్చిన సినిమాలు ఎక్కువగా విజయాల్నే అందుకున్నాయి. ఇలాంటివి చేస్తున్నప్పుడు నటుడికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. నాగశౌర్య పడిన కష్టం కనిపిస్తోంది. నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక నాగశౌర్యలా సిక్స్‌ప్యాక్‌తో సిద్ధమయ్యాకే మరో సినిమా చేస్తా. అఖండ విజయం సీజన్‌కు మంచి సంకేతం. నాగశౌర్యకు మరిన్ని విజయాలు రావాలి. బాలీవుడ్‌కు కూడా వెళ్లిపోవాలి.' అని తెలిపారు. లక్ష్య సినిమా చేస్తూ ఎంతో నేర్చుకున్న అని హీరో నాగశౌర్య అన్నారు. ఏ సమస్య వచ్చినా సరే నిర్మాతలు తనకోసం నిలబడ్డారని తెలిపారు. ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయని దర్శకుడు శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. ఆర్చరీ అనేది ప్రేక్షకులకు కొత్త, అందులోనే విజయం ఉందన్నారు. భారతీయ క్రీడా సినిమాల్లో నిలిచిపోయే మరో చిత్రం 'లక్ష్య' కావాలని కోరుకుంటున్నా అని పుల్లెల గోపించంద్ అన్నారు. 'నా తొలి సినిమా సుబ్రమణ్యపురం. తర్వాత సునీల్ నారంగ్ నన్ను పిలిచి ఈ అవకాశమిచ్చారు. ఏడున్నర గంటలు కథ విని ఈ సినిమా చేశారు నాగశౌర్య. సినిమా అనేది కళారూపం. దానికి ఆక్సిజన్ థియేటర్ వ్యవస్థ. ఆ ఆక్సిజన్ అందజేసే వ్యక్తి నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్.' అని లక్ష్య చిత్రం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చైతూ, శేఖర్‌పై ప్రశంసలు కురిపించిన నాగార్జున
‘‘దేశంలో కోవిడ్ మరణాలు తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. భారత ప్రభుత్వం కానీ, ప్రత్యేకించి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు, తెలంగాణ సీఎం కేసీఆర్‌గారు మంచి నిర్ణయాలు తీసుకుని కరోనా నివారణకు చర్యలు తీసుకున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీపై కరోనా ప్రభావం కాస్త ఎక్కువ ఉంది. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో థియేటర్లు తెరవలేదు. తెలంగాణలో 100 శాతం, ఆంధ్రాలో అక్కడి పరిస్థితులను బట్టి 50 శాతం థియేటర్లు తెరిశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడూ మమ్మల్ని మంచి చూపే చూశాయి’’ అన్నారు నాగార్జున. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మ్యాజికల్ సక్సెస్ మీట్ ఆఫ్ లవ్ స్టోరీ’లో నాగార్జున మాట్లాడుతూ –‘‘కొన్ని వారాల క్రితం విడుదలైన ఓ హిందీ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు నాలుగు కోట్లు షేర్ వస్తే.. ‘లవ్‌స్టోరీ’కి ఏడు కోట్లు వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు కోటి నమస్కారాలు. శేఖర్ సెన్సిటివ్ డైరెక్టర్.. కానీ అదొక్కటే సరిపోదు. దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో బ్యాలెన్స్ చేసి తీయాలి.. శేఖర్ అది నేర్చుకున్నాడు. చైతన్యను చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఈ సినిమా చూశాక ఇంకా సంతోషమేసింది. యాక్టర్ అండ్ స్టార్.. ఇవి రెండూ డిఫరెంట్ పదాలు. చైతూను ఒక స్టార్ యాక్టర్‌గా తయారు చేశాడు శేఖర్. చైతూ.. బాగా నటించావ్. ఈ సినిమా చూసి నేను నవ్వేలా, ఏడ్చేలా చేశావ్. ‘ప్రేమనగర్’ రిలీజ్ టైమ్‌లో తుఫాన్, సైక్లోన్ అన్నీ ఉన్నా నాన్నగారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇప్పుడు తుఫాన్, కోవిడ్, సైక్లోన్‌తో పోరాడి ‘లవ్‌స్టోరీ’ గొప్ప విజయాన్ని సాధించింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా సక్సెస్ కావడం టాలీవుడ్‌కు శుభపరిణామం’’ అన్నారు నారాయణ్‌దాస్ నారంగ్. ‘‘ఈ సినిమా కోసం మూడేళ్లుగా నాతో పాటు ప్రయాణం చేసిన యూనిట్‌కి థ్యాంక్స్. ఇండస్ట్రీకి చిరంజీవిగారు ఎలా పెద్దగా నిలబడ్డారో మా సినిమాకి కూడా అలాగే నిలబడ్డారు.. ఆయన రాకతో మా సినిమాకి మాంచి కిక్ వచ్చింది’’ అన్నారు శేఖర్ కమ్ముల. నాగచైతన్య మాట్లాడుతూ –‘‘ఆడియన్స్ వస్తారా? రారా? అనే టైమ్‌లో వారు థియేటర్స్‌కు వచ్చి మా సినిమాను ఆదరించారు. శేఖర్గారి కంటెంట్ పవర్ ఏంటో సెప్టెంబరు 24న తెలిసింది. సినిమా స్టార్ట్ చేశాక శేఖర్‌గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోని వారి నిజాయతీ చూసి ఈ సినిమా కోసం ఎంతైనా కష్టపడొచ్చని ఫిక్సైపోయాను’’ అన్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ –‘‘మా తాతగారు ‘అన్నమయ్య’ చూస్తున్నప్పుడు.. ఆత్మ దేవునితో ఐక్యమయ్యే సీన్‌ని ఏడుస్తూ.. దండం పెడుతూ చూసేవారు. ఆయన యాక్ట్ చేస్తున్నారు తాతయ్యా అనేదాన్ని. నేను ఇండస్ట్రీ వచ్చాక అర్థం అయ్యింది.. ఒక పాత్రను మనం చేస్తే అది నిలిచిపోయేలా చేయాలని నాకు నేర్పిన మీకు (నాగార్జున) థ్యాంక్స్. ‘లవ్‌స్టోరీ’కి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో అని థియేటర్స్‌కి వెళ్లా. వారి రియాక్షన్ చూసి కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు. సురేశ్ బాబు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కర భట్ల, పవన్ సీహెచ్, మంగ్లీ, రోల్ రైడా, ఈశ్వరీ రావు తదితరులు పాల్గొన్నారు. -
లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్‌కి అతిథిగా సుకుమార్?
కరోనా సెకండ్ వేవ్ అనంతరం విడుదలై మంచి విజయం సాధించింది ‘లవ్‌స్టోరీ’. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికాలో సైతం రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. ఇందులో భాగంగా మంగళవారం (సెప్టెంబర్ 28న) మ్యాజికల్ సక్సెస్ మీట్‌ను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో జరిగే ఈ కార్య్రమానికి హీరో నాగార్జునతోపాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారని తెలుస్తోంది. అయితే విడుదలకు ముందే ఎంతో బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. కాగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ రూ. 50 కోట్ల మార్క్ దగ్గర ఉన్నట్లు సమాచారం. కాగా సుకుమార్, నాగచైతన్య కలిసి ‘100% లవ్’ మూవీ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. చదవండి: చైతూకి గేమ్ చేంజర్..ఆమెకు ఎముకలు ఉన్నాయా'? -
అందుకే ఈ సినిమా హిట్టవ్వాలనుకుంటున్నా!
‘‘లవ్‌స్టోరీ’ సినిమాపై యూనిట్ అంతా చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తి స్థాయిలో థియేటర్లకు రావడం లేదు. వారందర్నీ మా సినిమా థియేటర్లకు రప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నాగచైతన్య. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ►కరోనా లాక్డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీ బాగా ఇబ్బందుల్లో పడింది. మళ్లీ మునుపటి రోజులు రావాలని, పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాను. ‘లవ్‌స్టోరీ’ సినిమా మా కోసం కాకున్నా చిత్రపరిశ్రమకు మంచి బూస్ట్ ఇచ్చేందుకు అయినా హిట్ కావాలనుకుంటున్నాను. ‘లవ్‌స్టోరీ’లో తెలంగాణ యాస కోసం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాం.. డబ్బింగ్ చెప్పే టైమ్‌కు లాక్డౌన్ వచ్చింది. దీంతో ఈ యాస మరింత స్పష్టంగా నేర్చుకునేందుకు వీలు దొరికింది. ►శేఖర్ కమ్ములగారిలో సినిమా పట్ల నిజాయతీ, అంకితభావం నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. ఆయనతో పని చేసేవారికి ఎంతో ఉపయోగం. శేఖర్గారి చిత్రాల్లో రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. సమాజానికి, వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రాలంటే నాకూ ఆసక్తే. కమర్షియల్ సినిమాల్లో ఎవరైనా పెద్ద సందేశం ఇస్తారు. కానీ లింగ వివక్ష, కుల వివక్ష వంటి సమస్యలను చూపించడం గొప్ప విషయం. వాటిని ఈ సినిమాలో చూపించారు. ‘మజిలీ’ సినిమాతో నాకు కొంచెం సంతృప్తి దొరికింది.. ‘లవ్‌స్టోరీ’ చిత్రం పూర్తి స్థాయి సంతృప్తి ఇచ్చింది. మహిళలకు సంబంధించిన ఓ సెన్సిటివ్ ఇష్యూను శేఖర్‌గారు ఈ చిత్రంలో పల్లవి అనే పాత్ర ద్వారా చెప్పారు. ఆయనతో పని చేసిన తర్వాత నటుడిగా, వ్యక్తిగా ఎదిగాను. అందుకే ఆయనతో ఎప్పుడూ ప్రయాణం చేయాలనిపిస్తోంది. ►ప్రేక్షకుల ఆలోచనా విధానం మారింది.. వాస్తవానికి దగ్గరగా ఉన్న సినిమాలను బాగా ఆదరిస్తున్నారనే విషయాన్ని నేను, సుకుమార్‌గారు మాట్లాడుకున్నాం. ఆయన కూడా ‘రంగస్థలం’ నుంచి ఇదే తరహాలో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. ప్యాన్ ఇండియా మార్కెట్ గురించి నాకు తెలియదు. ప్యాన్ ఇండియా కోసం స్క్రిప్ట్ రాస్తే ప్రాంతీయ విషయాలు మిస్ అవుతాం. ►ఆమిర్ ఖాన్‌గారితో ‘లాల్‌సింగ్ చద్దా’ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం 45 రోజులు ఆయనతో చేసిన ప్రయాణం నాకు చాలా ప్లస్ అయింది. ఇండస్ట్రీకొచ్చిన ఈ 12ఏళ్లలో నేర్చుకున్నదాని కంటే ఎక్కువే నేర్చుకున్నాను. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘థ్యాంక్యూ’ చిత్రం పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అలాగే ‘బంగార్రాజు’లో నటిస్తున్నాను. శేఖర్గారి గత చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు ఎక్కువ పేరొచ్చింది. కానీ ‘లవ్‌స్టోరీ’లో సాయిపల్లవితో పాటు నా పాత్రకు కూడా సమాన ప్రాధాన్యం ఉంది. ఇద్దరికీ మంచి పేరొస్తుంది. సాయిపల్లవి మంచి నటి, డ్యాన్సర్. డ్యాన్స్ విషయంలో నేను చాలా టేక్స్ తీసుకున్నాను. సాంగ్ షూట్ అంటే నాకు గతంలో భయంగా ఉండేది. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా నుంచి శేఖర్ మాస్టర్, నా కాంబినేషన్ బాగా వర్కవుట్ అవుతోంది. ‘లవ్‌స్టోరీ’ చిత్రంలోనూ నాతో మంచి స్టెప్పులు వేయించారాయన. -
సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు
‘‘కరోనా సమయంలో ఏదైనా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయమంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఓ బటన్ నొక్కి, దాని గురించి విష్ చెబితే అయిపోతుంది. అయితే ఇలా వచ్చి కళాభిమానుల్ని, ప్రేక్షకుల్ని కలుసుకుంటూ ఈ క్లాప్స్ వింటూ ఆ సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు’’ అని హీరో చిరంజీవి అన్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరి’. కె. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘లవ్ స్టోరీ అన్ ప్లగ్డ్’ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ–‘‘నారాయణ్ దాస్‌గారితో 1980 నుంచి నాకు మంచి సంబంధాలున్నాయి. వారి అబ్బాయి సునీల్ నారంగ్ తండ్రికి మించిన తనయుడయ్యాడు. ‘లవ్ స్టోరీ’ అనగానే చాలా ఆసక్తి కలిగింది.. ఎందుకంటే ప్రేమకథా చిత్రాలు చూసి చాలా రోజులైంది. నా మిత్రుడు నాగార్జున కొడుకు నాగచైతన్య వెరీ కూల్ బాయ్. యంగ్‌స్టర్స్ అంతా ఎగసి పడుతుంటారు.. కానీ ఎప్పుడూ కంపోజ్డ్గా ఉంటాడు చైతన్య. కూల్ ఫాదర్‌కి (నాగా ర్జున) కూల్ సన్ నాగచైతన్య. తను నిలకడగా వెళుతుంటాడు.. అది ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. నా మిత్రుడు ఆమిర్‌ఖాన్, నాగచైతన్య నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. సాయిపల్లవిని తొలిసారి మా వరుణ్ తేజ్ ‘ఫిదా’చిత్రంలో చూశాను. ఆ సినిమా రిలీజ్ అయ్యాక వరుణ్ వచ్చి, ‘డాడీ.. డ్యాన్స్ ఎలా చేశాను నేను’ అన్నాడు. ‘సారీ రా.. నేను నిన్ను చూడలేదు.. సాయిపల్లవిని మాత్రమే చూశా’ అన్నాను. నా సినిమాలో చెల్లెలి పాత్ర కోసం సాయిపల్లవిని అడిగారు.. అయితే తను కుదరదు అంది.. నేను కూడా అదే కోరుకున్నా. ఎందుకంటే అంత మంచి డ్యాన్సర్‌తో నేను డ్యాన్స్ చేయాలనుకుంటాను కానీ ‘చెల్లెమ్మా’ అని పిలవగలనా?.. పిలవలేను. నా పక్కన రొమాంటిక్ హీరోయిన్గా చేయగలిగితే ఓకే. శేఖర్ కమ్ముల ఎవరి వద్దా పనిచేయకపోయినా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. ‘లవ్ స్టోరీ’ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో నో డౌట్’’ అన్నారు. హీరో ఆమిర్‌ఖాన్ మాట్లాడుతూ – ‘‘లవ్ స్టోరీ’ ట్రైలర్ చూసి, బాగుందని చైతూకు(నాగచైతన్య) మెసేజ్ చేశా. నా ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రంలో తను నటించారు. నా సినిమా సెట్స్‌లో చైతన్యను ఫస్ట్‌టైమ్ చూసినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉన్న ఫీలింగ్ కలిగింది. చైతూ చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, సంస్కారవంతుడు. ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని థియేటర్స్‌లోనే చూస్తాను. ముంబయ్‌లో థియేటర్స్‌లో స్క్రీనింగ్‌కు ఇబ్బందులు ఉంటే అధికారుల అనుమతితో ప్రత్యేక స్క్రీనింగ్‌లో అయినా చూస్తాను’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ–‘‘లవ్ స్టోరీ’ ట్రైలర్ చూస్తుంటే నాగ చైతన్య, సాయి పల్లవి బాగా నటించారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలు విడుదల చేసేందుకు చాలా మంది నిర్మాతలు భయపడతున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. తమ సినిమాను థియేటర్లోనే విడుదల చేసేందుకు ముందుకొచ్చిన ‘లవ్ స్టోరీ’ నిర్మాతలకు అభినందనలు. ఇండస్ట్రీపై ఆధారపడి ఎంతో మంది కార్మికులు జీవిస్తున్నారు. వాళ్లు బాగుండాలంటే సినిమా అన్ని సెక్టా ర్లలో పుంజుకోవాలి’’ అన్నారు. ‘‘ఈ వేడుకకి వచ్చిన చిరంజీవి, ఆమిర్ ఖాన్‌గార్లకు థ్యాంక్స్. నాగచైనత్య, సాయిపల్లవి, శేఖర్ కమ్ములతో పాటు మా ‘లవ్ స్టోరీ’ చిత్ర యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు కె. నారాయణ్ దాస్ నారంగ్. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మీరు(చిరంజీవి) నాకు ఆన్‌స్క్రీన్ మెగాస్టార్. ఆఫ్ స్క్రీన్ మెగా హ్యూమన్ బీయింగ్. కరోనా కష్టకాలంలో మీరు ఇండస్ట్రీకి సపోర్ట్ చేసిన తీరు స్ఫూర్తిదాయకం. ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ చూసి, అభినందించి ఈ వేడుకకు వస్తానని ఆమిర్ఖాన్గారు వచ్చారు. ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా కోసం 45 రోజులు షూటింగ్లో పాల్గొన్నాను. ఆ సమయంలో ఆమిర్‌గారి నుంచి నేను నేర్చుకున్న విషయాలు నాకు జీవితాంతం ఉపయోగపడతాయి. ‘లవ్ స్టోరీ’ లో ఇంతలా పెర్ఫార్మ్ చేశానంటే అందుకు కారణం శేఖర్ కమ్ములగారే. సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నందుకు మా నిర్మాతలకు ధన్యవాదాలు. యాభైఏళ్ల క్రితం తాతగారి (అక్కినేని నాగేశ్వరరావు) ‘ప్రేమ్‌నగర్’ సినిమా విడుదలైన తేదీనే ‘లవ్‌స్టోరీ’ వస్తోంది.. అన్నీ రాసిపెట్టినట్లుగా అనిపిస్తోంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు శరత్ మరార్, భరత్ నారంగ్, అభిషేక్ అగర్వాల్, కెమెరామెన్ విజయ్ సి.కుమార్, సంగీత దర్శకుడు పవన్ సి.హెచ్, ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్, పాటల రచయితలు భాస్కర భట్ల, సురేంద్ర, ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా, నటి ఈశ్వరీ రావు తదితరులు పాల్గొన్నారు. ‘‘కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమ సక్సెస్ రేట్ మహా అయితే 20శాతం. ఈమాత్రం దానికే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుందనుకుంటారు. కానీ, కష్టాలు పడేవారు, సాధక బాధకాలు అనుభవించే వారు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షల మంది ఉన్నారు. ఇలాంటి వారంతా కలిస్తేనే ఇండస్ట్రీ తప్ప ఓ నలుగురైదుగురు హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కలిస్తే కాదు. కరోనా సమయంలో షూటింగ్స్ ఆగిపోవడంతో కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది ప్రత్యక్షంగా చూశాం. ఏ విపత్తు వచ్చినా సాయానికి ముందుండేది మా సినిమా ఇండస్ట్రీనే అని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజున సంక్షోభంలో పడిపోయింది.. సినిమా నిర్మాణం ఖర్చు పెరిగిపోయింది.. ఈ వేదికగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను మా విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ – చిరంజీవి -
ధనుష్ తెలుగు సినిమా.. అప్పుడే షూటింగ్ స్టార్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో ఓ డైరెక్ట్ ఫిల్మ్ చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్నారు. నారాయణదాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబరులో ఆరంభించాలనుకుంటున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నారని తెలిసింది. -
‘లవ్‌స్టోరీ’ వాయిదాపై చిత్ర యూనిట్ క్లారిటీ
‘లవ్‌స్టోరీ’లో కన్ఫ్యూజన్ ఏం లేదంటున్నారు నాగచైతన్య. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయాలనుకున్నారు. అయితే ‘లవ్‌స్టోరీ’ ఏప్రిల్ 16న విడుదల కావడం లేదనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో మొదలైంది. ఈ విషయంపై చిత్రబృందంæస్పందించింది. ‘‘విడుదల విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ముందు చెప్పినట్లుగానే ఏప్రిల్ 16న విడుదల చేస్తాం. మా ఈ అందమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతం అందించారు. -
ఏవో ఏవో కలలే...
‘ఏవో ఏవో కలలే, ఎన్నో ఎన్నో తెరలే, అన్నీ దాటి మనసే ఎగిరిందే...’ అంటూ ఆడి పాడారు నాగచైతన్య, సాయిపల్లవి. ఈ ఇద్దరూ జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్ స్టోరి’. కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘ఏవో ఏవో కలలే..’ అంటూ సాగే పాటను హీరో మహేశ్‌బాబు ట్విట్టర్ ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ స్వరపరచిన ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. జోనితా గాంధీ, నకుల్ అభ్యంకర్ పాడారు. ‘‘భాస్కరభట్లతో పరిచయం ఎప్పటికీ మర్చిపోలేనిదిగా ఉంది. ఈ పాటను అద్భుతంగా రాసినందుకు థ్యాంక్స్’’ అని శేఖర్ కమ్ముల ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి.కుమార్, సహ నిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వర రావు. -
సారంగదరియా: ఆ క్రెడిట్, డబ్బులు కోమలికే!
‘లవ్ స్టోరీ’ చిత్రంలోని ‘సారంగ దరియా..’ అనే పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. అయితే ఈ పాటపై వివాదాలు కూడా నెలకొన్నాయి. ‘‘సారంగ దరియా..’ అనే పాటను నేనే వెలుగులోకి తీసుకొచ్చాను.. ‘లవ్ స్టోరీ’ సినిమాలో ఆ పాట నాతో పాడిస్తామని చెప్పి, పాడించలేదు’ అంటూ గాయని కోమలి మీడియాతో చెప్పిన మాటలు వివాదంగా మారాయి. దీనిపై ‘లవ్ స్టోరీ’ చిత్రదర్శకుడు శేఖర్ కమ్ముల ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘చాలా ఏళ్ల కిందట ‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో శిరీష అనే అమ్మాయి పాడిన ‘సారంగ దరియా’ పాట నా మనసులో తిరుగుతూనే ఉంది. ‘లవ్ స్టోరీ’కి తగ్గట్టు ‘సారంగ దరియా’ పాట రాయాలని సుద్దాల అశోక్ తేజగారిని కలిశా. ఆయన ఆ పాట పల్లవి తీసుకుని, ప్రత్యేకంగా చరణాలు రాశారు. ఆ పాటని శిరీషతో పాడిద్దామనుకున్నాం. అయితే పాటను తొలుత వెలుగులోకి తీసుకొచ్చిన కోమలితో పాడిద్దామని సుద్దాలగారు అన్నారు. వరంగల్ నుంచి ఆమెని రమ్మని కోరాం.. జలుబు, దగ్గు ఉండటం వల్ల రాలేను అన్నారు. అప్పటికే చెన్నై నుంచి సంగీత దర్శకుడు రికార్డింగ్ కోసం వచ్చి ఉండటంతో మంగ్లీతో పాడించాం. ఆ పాట క్రెడిట్‌తో పాటు డబ్బులు ఇస్తామని కోమలికి చెబితే సరేనన్నారు. పాట రిలీజ్ తర్వాత టీవీల్లో వచ్చిన కోమలి చర్చలు నేను చూడలేదు. ఈ పాట క్రెడిట్ తప్పకుండా ఆమెకి ఇవ్వడంతో పాటు మేము ఇస్తామన్న డబ్బులూ ఇస్తాం. ఆడియో వేడుకలో తనతో పాట పాడిస్తా’’ అన్నారు శేఖర్ కమ్ముల. -
ప్రేమకథ ముగిసింది
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్ స్టోరి’. ఆహ్లాదకరమైన ప్రేమకథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన పాటతో ఈ సినిమా పూర్తయింది. షూటింగ్ చివరి రోజు గుమ్మడికాయ కొట్టిన సందర్భంగా శేఖర్ కమ్ముల, సాయి పల్లవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి. కుమార్ ఫొటోలు దిగారు. ‘‘రియలిస్టిక్ ప్రేమకథగా రూపొందిన చిత్రమిది. శేఖర్ కమ్ముల శైలిలో ఆహ్లాదకరంగా ఉంటుంది. పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశాం. థియేటర్లు తెరుచుకుని ప్రేక్షకుల సందడి మొదలు కాగానే ‘లవ్ స్టోరి’ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: పవన్ సి.హెచ్, సహ నిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వర రావు. -
గురి తప్పదు
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. నాగశౌర్య నటిస్తోన్న 20వ చిత్రమిది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు శేఖర్ కమ్ముల సోమవారం విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం నాగశౌర్య ఎంతో శ్రమించి సిక్స్ ప్యాక్‌లోకి మారడం చూసి ఆశ్చర్యమేసింది. ‘ఛలో, ఓ బేబి, అశ్వథ్థామ’ వంటి చిత్రాలతో అలరించిన శౌర్య ఇప్పుడు మరింత మాస్ లుక్‌లోకి మారడం శుభ పరిణామం. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. సిక్స్ ప్యాక్ దేహంతో గురి తప్పదనే నమ్మకంతో విల్లు ఎక్కుపెట్టిన నాగశౌర్య ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వస్తోందని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
అదే బేనర్లో...
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ నారంగ్ నిర్మిస్తున్నారు. 15 రోజుల చిత్రీకరణ మినహా ఈ సినిమా దాదాపు పూర్తయింది. షూటింగ్స్ అనుమతి రాగానే ఆ పార్ట్‌ను పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అయితే శేఖర్ కమ్ముల తదుపరి చిత్రం కూడా నారాయణ్ దాస్ నారంగ్ నిర్మాణంలోనే ఉంటుందని ప్రకటించారు. ‘లవ్‌స్టోరీ’ ప్రయాణం నచ్చడంతో మరో సినిమా కోసం ఈ డైరెక్టర్–ప్రొడ్యూసర్ కాంబి నేషన్ కలిసిందని సమాచారం. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నారని కూడా తెలిసింది. -
చైతూ-సాయిపల్లవిల ‘లవ్ స్టోరి’
‘ఫిదా’సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ‘వెంకీ మామ’తో హిట్ అందుకున్న నాగచైతన్య, ‘ఫిదా’తో అందరి మనసులను దోచుకున్న సాయి పల్లవిలు ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలై చేసిన నాగచైతన్య ఫస్ట్ లుక్కు విశేష స్పందన వస్తోంది. పక్కా శేఖర్ కమ్ముల స్టైల్లో రూపొందుకుంటున్న ఈ చిత్రంపై టాలీవుడ్ భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి. తాజాగా సంక్రాంతి కానుకగా శేఖర్ కమ్ముల టీం సినీ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ.. దానికి సంబంధించిన పోస్ట్‌ర్‌ను విడుదల చేసింది. అందరూ భావించినట్టే ఈ చిత్రానికి ‘లవ్ స్టోరి’అనే టైటిల్‌నే చిత్ర బృందం ఖరారు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. పక్కా ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నారాయణ్‌దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే సమ్మర్లో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. There isn’t a better title to reflect the essence of this movie! #LoveStory it is❤️@sekharkammula @Sai_Pallavi92 #SreeVenkateswaraCinemasLLP #AmigosCreations @adityamusic#NC19 pic.twitter.com/oZAypqIlpZ — chaitanya akkineni (@chay_akkineni) January 14, 2020 -
ఏం జరిగినా మన మంచికే: సాయిపల్లవి
నటి సాయిపల్లవి ఆలోచనలు, ఆచరణలు కాస్త భిన్నంగా ఉంటాయని చెప్పవచ్చు. డాక్టరు కావలసింది. అనుకోకుండా యాక్టర్ అయ్యిందీ చిన్నది. మలయాళంలో ప్రేమమ్ చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ సహజ నటి ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ అంటూ నటిగా తన పరిధిని పెంచుకుంది. అయితే మాలీవుడ్ తరువాత టాలీవుడ్ ఆదరించినంతగా కోలీవుడ్ సాయిపల్లవిని అక్కున చేర్చుకోలేకపోయింది. కారణాలేమైనా సాయిపల్లవి నటించిన మూడు తమిళ సినిమాలు ఆశించిన విజయాలను అందకోలేదు. వాటిలో ధనుష్‌కు జంటగా నటించిన మారి–2 చిత్రం కాస్త బెటర్. ఇక్కడ పరిచయం అయిన దయా చిత్రం పూర్తిగా నిరాశపరచగా, ఇక స్టార్ హీరో సూర్యతో నటించిన ఎన్జీకే చిత్రం సాయిపల్లవి కెరీర్‌కు ఏ మాత్రం ప్లస్ అవలేదు. అంతే కోలీవుడ్‌లో మరో అవకాశం లేదు. ఇక తెలుగులో హిట్స్ ఉన్నాయి, చాన్స్‌లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ అమ్మడికి చాలా పాఠాలు నేర్పినట్టున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటి సాయిపల్లవి పేర్కొంటూ జీవితంలో అనుకున్నది జరగకపోతేనో, చేసిన పనికి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడో నిరాశకు గురవడం సహజం అని అంది. అయితే అలాంటి వాటిని తాను వేరే కోణంలో చూస్తానని చెప్పింది. ఏదైనా జరగాలని రాసి పెట్టి ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరంది. అందుకే అలాంటి సమస్యలు ఎదురైతే అందులోంచి కొత్త విషయాలను నేర్చుకోవాలని పేర్కొంది. అంతేగానీ ఆశించింది జరగలేదే అని నిరుత్సాహపడకూడదని అంది. ఏం జరిగినా మన మంచికే అని భావించడం తనకు చదువుకునే రోజుల నుంచే అలవాటైందని చెప్పింది. ఆ అలవాటు ఇప్పుడు ఈ రంగంలో హెల్ప్ అవుతోందని చెప్పింది. ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే మనం పాఠం నేర్చుకోవడానికే అది జరిగిందని భావిస్తానని అంది. అన్నట్లు ఈ భామ ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశాన్ని తోసిపుచ్చిందట. ఆ ప్రకటనలో నటించినందుకుగానూ ఏడాదికి అక్షరాలా కోటి రూపాయలు పారితోషకాన్ని ముట్ట చెబుతామన్నా, నిరాకరించిందట. అంతేకాదు గతంలో కూడా రూ. 2 కోట్లు పారితోషకాన్ని ఇస్తామని ఓ ఫేస్ క్రీమ్ సంస్థ ఆఫర్ ఇచ్చినా సారీ అనేసిన విషయం తెలిసిందే. సహ నటీమణులు చాలా మంది వాణిజ్య ప్రకటనలో నటించి సంపాదించుకుంటుంటే సాయిపల్లవి ఎందుకో ఆ రంగంలో విముఖత చూపిస్తోంది. ఇక డబ్బు కోసం ఏదిపడితే ఆది చేయనని గతంలోనే తేల్చిచెప్పేసింది. ‘ఎంత సంపాదించినా రాత్రి ఇంటికి వెళ్లి నేను తినేది మూడు చపాతీలే. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ తింటామా? సంతోషంగా, ఆత్మసంతృప్తితో జీవిస్తే చాలు. నా విలువలు చంపుకుని పని చేయడం నాకు నచ్చదు. అందుకే ఇటీవలే కొన్ని యాడ్స్‌ను రిజెక్ట్ చేశాను’అని సాయిపల్లవి పేర్కొంది. ప్రస్తుతం పల్లవి తెలుగులో మంచి అవకాశాలతో దూసుకపోతోంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న `విరాటపర్వం' చిత్రంలో ఈమె హీరోయిన్గా నటిస్తుంది. దీనితో పాటు నాగ చైతన్య హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రంలో కూడా ఈ రౌడీ బేబీ నటిస్తోంది. మరి కమిట్మెంట్ కోసం కోట్లు వదలుకుంటున్న ఈ బ్యూటీ రానున్న కాలంలో కూడా ఇదే మాట పై ఉంటుందేమో చూడాలి.