ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘డీఎన్‌ఎస్’(వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముంబై మాఫియా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తిరుపతి పరిసరప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణను, గోవాలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్.
ధనుష్, నాగార్జున పాల్గొనగా కీలక సన్నివేశాలను తీశారు. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్‌లోప్రారంభం కానుందని తెలిసింది. ధనుష్, నాగార్జున పాల్గొనే ఈ షెడ్యూల్‌లోనే హీరోయిన్ రష్మికా మందన్నా కూడా జాయిన్ అవుతారట. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment