
అక్కినేని వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగచైతన్య. జోష్ సినిమాతో తెరంగేట్రం చేసి ఏమాయ చేసావే, 100% లవ్, ఒక లైలా కోసం, ప్రేమమ్ చిత్రాలతో లవర్ బాయ్‌గా యూత్‌ను.. దడ, బెజవాడ, అటోనగర్ సూర్య చిత్రాలతో మాస్ ఫ్యాన్స్‌ను.. మనం, రారండోయ్ వేడుక చూద్దాం, తడాఖా, శైలజారెడ్డి అల్లుడు వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట అయ్యాడు ఈ అక్కినేని వారి అబ్బాయి. సినిమా సినిమాకు వేరియేషన్‌చూపిస్తూ అన్ని రకాల అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న నాగచైతన్య ఈ రోజు 33వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు, అక్కినేని ఫ్యాన్స్ నాగచైతన్యకు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.
ఇక తన భర్త నాగచైతన్యకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ సమంత హార్ట్ టచింగ్ పోస్ట్ చేసింది. ‘ చైతూకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ సంతోషం కోసం రోజూ ప్రార్ధనలు చేస్తున్నాను. వృత్తి పరంగా, వ్యక్తిత్వంలో రోజురోజుకు ఎదుగుతున్నావ్. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా, ధైర్యంగా ఉంటుంది. మన ఇద్దరి మధ్య బంధం చాలా దృఢమైనదని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఐలవ్ యూ డార్లింగ్’ అని పేర్కొంటూ వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాలో సమంత పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇక నాగచైతన్య బర్త్‌డే కానుకగా అతడు నటిస్తున్న తన 19వ చిత్ర పోస్టర్, వీడియో టీజర్‌ను మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇంకా ఈ సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా చైతు బర్త్‌డే కానుకగా విడుదలైన టీజర్‌లో ఈ సినిమాలో అతడి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు. ఈ సినిమాలో మద్యతరగతి కుటుంబానికి చెందిన వాడిగా కనిపించునున్నాడు. ఇక ఈ టీజర్‌ను నిశితంగా పరిశీలిస్తే శేఖర్ కమ్ముల టేకింగ్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ క్లాస్ డైరెక్టర్ మార్క్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ దాస్ నారంగ్, పీ రామ్ మోహన్‌రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీహెచ్ పవన్ సంగీతమందిస్తున్నాడు.
Welcome to the world of #NC19.
— chaitanya akkineni (@chay_akkineni) November 23, 2019
A world that feels like home for me ..Simple and Beautiful .. thank you @sekharkammula
https://t.co/JQJpMWvqX6@Sai_Pallavi92 #SreeVenkateswaraCinemasLLP #AmigosCreations @adityamusic pic.twitter.com/kTulXe8W7I
ప్రస్తుతం నాగ చైతన్య రియల్ లైఫ్ మామ వెంకటేష్‌తో కలిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. బాబీ దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక శర్వానంద్‌తో కలిసి స్యామ్ ‘96’చిత్రంలో నటిస్తోంది. తమిళనాట విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment