ముఖం చాటేసిన నయనతార!
ముఖం చాటేసిన నయనతార!
Published Wed, Apr 23 2014 12:15 PM | Last Updated on Sat, Sep 2 2017 6:25 AM
దక్షిణాది తార నయనతార అనామిక ఆడియో కార్యక్రమానికి ముఖం చాటేసింది. చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి రావాలని చేసిన విజ్ఞప్తికి నయనతార నో చెప్పడంతో దర్శకుడు శేఖర్ కమ్ముల కొంత నిరుత్సాహానికి గురయ్యారు. గత చిత్రాల ఆడియో విడుదల కార్యక్రమాలకు నయనతార హాజరకాకపోవడం, ఇతర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై తెలుగు చిత్ర నిర్మాతలు, దర్శకులు కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో 'అనామిక' రాకపోవడంపై వేదికపైన శేఖర్ కమ్ముల కొంత నిరాశను వ్యక్తం చేశారు.
నయనతార కారణంగానే 'అనామిక' షూటింగ్ పూర్తి చేసుకోవడంలో ఆలస్యమైందనే మీడియాలో కూడా మీడియాలో వచ్చింది. వాస్తవానికి ఏప్రిల్ 16 తేదిన 'అనామిక' ఆడియో కార్యక్రమం జరగాల్సి ఉంది. కాని నయనతార కారణంగా ఆడియో విడుదల కార్యక్రమం వాయిదా వేశారు. మే 1 తేదిన విడుదల కానున్న అనామిక చిత్ర ప్రమోషన్ కు నయనతార హాజరుకాకపోతే శేఖర్ కమ్ముల ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
హిందీలో ఘనవిజయం సాధించిన కహానీ చిత్ర ఆధారంగా అనామిక రూపొందుతోంది. బాలీవుడ్ తార విద్యాబాలన్ నటించిన పాత్రను నయనతార పోషించింది. కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్దమైంది.
Advertisement
Advertisement