Anamika
-
అంబరాన మహాకుంభ సంబరం
ఆకాశం అంటే అనంతం... అనంతమైన భక్తి కూడా ఆకాశం లాంటిదే. తనలోని అనంతమైన భక్తిని ఆకాశ వేదికగా చాటింది ఇరవై నాలుగు సంవత్సరాల అనామికాశర్మ...ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన స్కైడైవర్ అనామికా శర్మ బ్యాంకాక్ మీదుగా 13 వేల అడుగుల ఎత్తులో మహాకుంభ్ అధికారిక జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించింది. అనామిక డేరింగ్ ఫీట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. విమానం ఎక్కే ముందు ఆత్మవిశ్వాసంతో మహాకుంభ్ జెండాను అనామిక పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో ఉన్నాయి. అనామిక విమానం నుండి దూకడం, జెండా ఎగరవేస్తూ ‘మహాకుంభ్ 2025’కు ప్రపంచానికి స్వాగతం పలికే దృశ్యాలు, బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే కుంభమేళ న్ట అబ్బురపరుస్తాయి.‘ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహాకుంభ్ 2025కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆహ్వానిస్తున్నాను’ అని అనామిక శర్మ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోనే చూస్తూ నెటిజనులు అనామికను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.వాటిలో కొన్ని...‘అపూర్వ సాహసం, భక్తిభావం మేళవించిన దృశ్యం’‘మన సంస్కృతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు’‘ఇది స్టంట్ కాదు. ప్రపంచానికి అందించిన శక్తిమంతమైన సందేశం’అనామిక తండ్రి మాజీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తండ్రి ఒడిలో సాహసాల ఓనమాలు నేర్చుకున్న అనామికకు ధైర్యంగా ముందుకు దూసుకెళ్లడమే తెలుసు. తాజా ఫీట్‌తో తన సాహసాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది.పవిత్ర క్షేత్రమైన ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనామిక మన సంస్కృతి, సంప్రదాయాలను వింటూ పెరిగింది. ‘మన సంస్కృతిలోని గొప్పదనం ఏమిటంటే, ఒక మంచి పని కోసం అందరూ ముందుకు వస్తారు. నేనేమిటి? నా స్థాయి ఏమిటి అని ఎప్పుడూ ఆలోచించరు. రామాయణంలో ఉడుత కథ దీనికి ఉదాహరణ. భరతమాత బిడ్డను అని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను’ అంటుంది అనామిక.భవిష్యత్‌లో మరెన్నో సాహసాలు చేయడానికి సిద్ధం అవుతున్న అనామిక ట్రైన్డ్ స్కూబా డైవర్ కూడా. మన దేశంలో ‘స్కై సి లైసెన్స్’ ఉన్న యంగెస్ట్ ఫీమెల్ స్కైడైవర్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.‘వీడియోను చూసి చాలామంది... మీకు భయంగా అనిపించలేదా అని అడిగారు. నిజం చెప్పాలంటే భక్తి భావంతో నాకు భయం కలగలేదు. ఒకటికి పదిసార్లు మనసులో మేరా భారత్ మహాన్ అనుకున్నాను’ అంటోంది అనామిక. -
‘భాషా’..! ఒక్క ప్రశ్న కాదు.. వందైనా ఓకే!
కేవలం 250 మంది మాట్లాడే భాష పేరు చెప్పగలరా? దాని నిర్మాణం ఏమిటి? ఎలా మాట్లాడుతారు, ఎలా రాస్తారో చెప్పగలరా? కొన్ని గంటల్లోనే ఆ భాషను అనువదించగలరా? ‘కష్టం’ అనేవాళ్లే ఎక్కువ. కాని కొందరు ఇష్టంగా ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్లోకి అడుగుపెట్టి తమ సత్తా చాటుతున్నారు. మన దేశం తరఫున ఈ పోటీలో పాల్గొన్న లక్ష్మీ, అనిమికా దత్తాలు పతకాలు గెలుచుకున్నారు...ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు, భాషాశాస్త్ర నిపుణులను ఒకచోట చేర్చే అంతర్జాతీయ పోటీ. 2003లో ఇది మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల వ్యాకరణం, నిర్మాణం, సంస్కృతి, చరిత్రను విశ్లేషించడానికి, పజిల్స్‌ను సాల్వ్ చేయడం ద్వారా భాష సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఈ పోటీ అవకాశం కల్పిస్తుంది. సృజనాత్మకత, ఊహాశక్తిని మెరుగుపరచడానికి ఈ పోటీ ఉపకరిస్తుంది. భవిష్యత్తు భాషాశాస్త్ర నిపుణులను తయారుచేస్తుంది.‘భాష లేదా భాషాశాస్త్రంపై లోతైన పరిజ్ఞానం అవసరం లేదు. అత్యంత సవాలుతో కూడిన సమస్యలకు కూడా తార్కిక సామర్థ్యంతో, ఓపికతో పరిష్కారం కనుక్కోవచ్చు’ అంటుంది ఐవోఎల్. పోటీలో పాల్గొన్న వారికి ఇన్‌ఫుట్స్ ఇస్తారు. వాటి ఆధారంగా పజిల్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది.ఈ సంవత్సరం ‘ఐవోఎల్’కు బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ పోటీలో 38 దేశాల నుంచి 51 టీమ్‌లు పాల్గొన్నాయి. బ్రెజిల్ రాజధాని బ్రజిలియాలో జరిగిన 2024 ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్(ఐవోఎల్)లో మన దేశానికి చెందిన అనిమికా దత్తా ధర్, శ్రీలక్ష్మీ వెంకట్రామన్, ఫరాజ్ సిద్దిఖీ, అనన్య అగర్వాల్‌లు అద్బుత ప్రతిభాసామర్థ్యాలను ప్రదర్శించారు.‘ఐవోఎల్ వెబ్సైట్లో గత ఒలింపియాడ్‌లో వచ్చిన ్రపాబ్లమ్స్ను సాల్వ్ చేస్తూ ్రపాక్టీస్ చేశాను’ అంటుంది పద్నాలుగు సంవత్సరాల శ్రీలక్ష్మీ. బెంగళూరులోని జైగోపాల్ రాష్ట్రీయ విద్యాకేంద్రలో చదువుతున్న శ్రీలక్ష్మీ ఐఐటీ కాన్పూర్ విద్యార్థి ఫరాజ్ సిద్దిఖీతో కలిసి కాంస్య పతకం సాధించింది. పదిహేడు సంవత్సరాల అనిమికా దత్తా ఈ ఒలింపియాడ్‌లో రజత పతకం గెలుచుకుంది. అనిమిక చెన్నై మ్యాథమెటికల్ ఇనిస్టిట్యూట్ విద్యార్ధి. తృటిలో పతకం చేజార్చుకున్న అనన్య పతకం సొంతం చేసుకోకపోయినా బోలెడు ప్రశంసలు అందుకుంది.ఈ ఒలింపియాడ్‌లో పాల్గొన్న మన బృందానికి మైండ్–బ్లోయింగ్ వర్డ్ పజిల్స్ సవాలు విసిరాయి. ఇచ్చిన వ్యవధి ఆరు గంటలు. కొరియాక్(రష్యా), హడ్జా(టాంజానియా), కొమ్టో(పపువా న్యూ గినియా), దావ్ (బ్రెజిల్), యానువ్యవా(ఆస్ట్రేలియా)లాంటి మారుమూల భాషలకు సంబంధించిన పజిల్స్ ఇచ్చారు. ‘భాష నుంచి చారిత్రక సందర్భాలను నిర్వచించవచ్చు’ అంటున్న అనిమిక పపువా న్యూ గినియాకు చెందిన ఎన్డు భాషతో పాటు చారిత్రక విషయాల గురించి కూడా మాట్లాడగలదు. భాషాశాస్త్రం లోతుపాతుల గురించి పెద్దగా తెలియని అనిమిక ఆ శాస్తంపై ఆసక్తి పెంచుకోవడానికి పజిల్స్ కారణం.‘లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్‌లో పాల్గొనడం వల్ల కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచించే నైపుణ్యం పెరుగుతుంది’ అంటుంది శ్రీలక్ష్మి. ‘నా సాంస్కృతిక నేపథ్యమే నాకు స్ఫూర్తి’ అంటుంది అనన్య అగర్వాల్. ‘ఐవోఎల్’ బ్రెయిన్టీజర్ ఫీచర్లు సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉంటాయి. ఆ సంస్కృతి తెలియకపోతే పజిల్స్ పరిష్కరించడం కష్టం. ఉదాహరణకు ఈ సంవత్సరం ఫ్యామిలీ ట్రీ ఇచ్చారు. ఫరెమ్ ప్రజల గురించి తెలియకపోతే ఆ సమస్య పరిష్కరించలేము. ఫరెమ్ అనేవాళ్లు కొమ్జో భాష మాట్లాడే ప్రజలు. వివాహనికి సంబంధించిన వీరి ఆచారవ్యవహారాలు ఆసక్తిగా ఉంటాయి. ‘ఒకటి కంటే ఎక్కువ భాషల్లో ప్రవేశం అనేది సూక్ష్మస్థాయిలో విశ్లేషణకు, సృజనాత్మకంగా ఆలోచించడానికి ఉపకరిస్తుంది’ అనే విషయాన్ని ‘ఐవోఎల్’ పోటీలు చెప్పకనే చెబుతున్నాయి. బహు భాషలపై ఆసక్తి పెంచుకోవడానికి ప్రేరణను ఇస్తున్నాయి.మరింత సులువుగా...ఒక భాషకు సంబంధించిన వాక్యనిర్మాణం, వ్యాకరణం, ధ్వనులు... మొదలైన వాటిపై భాషాశాస్త్రం పనిచేస్తుంది. భాషాశాస్త్రానికి సంబంధించిన ఆసక్తి ఊపందుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రధాన కారణం. జీపీటి–4, క్లాడ్, జెమినిలాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) ఇందుకు ఉదాహరణ. మనిషి ఇచ్చే ఇన్పుట్స్, కమాండ్స్‌కు మెషిన్ అర్థం చేసుకోవడానికి మధ్య అంతరాన్ని పూడ్చడానికి నేచురల్ లాంగ్వేజ్ ్రపాసెసింగ్ సిస్టమ్స్ (ఎన్ఎల్పీ) అవసరం. ఎక్కువ సంఖ్యలో భాషాశాస్త్రవేత్తలు ‘ఎన్ఎల్పీ’ రిసెర్చ్‌లో భాగం అయితే సహజత్వ ప్రక్రియ మరింత సులువు అవుతుంది.ఇవి చదవండి: ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..! -
యువకుడి జీవితం ఆధారంగా వస్తోన్న 'పరాక్రమం'‘
బండి సరోజ్ కుమార్, అనామిక, కిరీటి, మోహన్ సేనాపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం "పరాక్రమం". బీఎస్కే మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ... 'నేను ఒక నటుడిగా , దర్శకుడిగా మీలో కొంత మందికి తెలిసే ఉండొచ్చు. "కళ నాది. వెల మీది" అనే కాన్సెప్ట్‌తో ఓటీటీల్లో రిలీజ్ చేసిన "నిర్బంధం, మాంగల్యం" లాంటి సినిమాలతో ప్రేక్షకుల అభిమానం లభించింది. వారి అభిమానంతో ఇప్పుడు నేను నా సొంత నిర్మాణ సంస్థ ద్వారా వెండితెరకు రాబోతున్నా. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పరాక్రమం చిత్రం నిర్మించబోతున్నా. ' అని అన్నారు. గోదావరి జిల్లాలోని "లంపకలోవ" గ్రామంలో పుట్టిన "లోవరాజు" అనే యువకుడి జీవితంలో ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సరోజ్ కుమార్ తెలిపారు. -
Strandja Memorial Boxing Tournament 2023: భారత బాక్సర్లకు రజతాలు
సోపియా: స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు అనామిక, అనుపమ, గోవింద్ కుమార్ సహాని రజత పతకాలు సాధించారు. మహిళల 50 కేజీల ఫైనల్లో జాతీయ చాంపియన్ అనామిక 1–4తో చైనాకు చెందిన హు మెయి చేతిలో ఓడింది. పురుషుల 48 కేజీల తుదిపోరులో గోవింద్ కుమార్ 1–4తో షోదియోర్జన్ మెలికుజీవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల 81 కేజీల ఫైనల్లో అనుపమ 0–5తో ఆస్ట్రేలియన్ బాక్సర్ ఎమ్మా సూ గ్రీన్ట్రి చేతిలో ఓడిపోయింది. ఈ టోరీ్నలో భారత్ మొత్తం ఎనిమిది పతకాలు సాధించింది. ఇందులో మూడు రజతాలు కాగా... ఐదు కాంస్య పతకాలున్నాయి. పురుషుల కేటగిరీలో బిశ్వామిత్ర చొంగ్తమ్ (51 కేజీలు), సచిన్ (54 కేజీలు), మహిళల విభాగంలో కలైవాణి (48 కేజీలు), శ్రుతి యాదవ్ (70 కేజీలు), మోనిక (ప్లస్ 81 కేజీలు) కాంస్యాలు గెలిచారు. -
‘పసిడి’కి పంచ్ దూరంలో...
జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (50 కేజీలు) పసిడి పతకానికి విజయం దూరంలో నిలిచింది. భోపాల్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో నిఖత్ 5–0తో శివిందర్ కౌర్ (ఆలిండియా పోలీస్)పై ఘనవిజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో అనామిక (రైల్వేస్)తో నిఖత్ తలపడుతుంది. 75 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (అస్సాం) కూడా ఫైనల్ చేరింది. -
Skydiver: అతి పిన్న వయస్కురాలిగా రికార్డు.. ఎవరీ అనామిక శర్మ?
ఇండియాలో స్కై–డైవింగ్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలిగా వార్తల్లో నిలిచింది 21 ఏళ్ల అనామిక శర్మ. ఇంజినీరింగ్ చదువుతున్న అనామిక ఈ యేడాది దుబాయ్ డ్రాప్ జోన్ నుండి ‘ఎ’ కేటగిరీ ప్రొఫెషనల్ యునైటెడ్ స్టేట్స్ పారాచూట్ అసోసియేషన్ నుంచి లైసెన్స్ పొందింది. తొలిసారి పదివేల అడుగుల ఎత్తు నుంచి దూకినప్పుడు అనామిక వయసు కేవలం 11 ఏళ్లు. ఆ తర్వాత 42 జంప్‌లు సాధించిన ఘనత ఆమెది. పది రకాల పారాచూట్లు, ఆరు వేర్వేరు ఎయిర్క్రాఫ్ట్స్ను సమర్ధవంతంగా నడపగలిగింది. ఈ యువ సాధకురాలు మాట్లాడుతూ – ‘గాలిలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉన్న అనుభూతి, నేలను తాకగానే ఆనందం, ఉల్లాసం కలుగుతుంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం చాలా కష్టం’ అని వివరిస్తుంది. ఏకైక తండ్రీకూతుళ్లు అనామిక తండ్రి కూడా ప్రొఫెషనల్ స్కై–డైవర్. దీంతో దేశంలోనే వృత్తిరీత్యా స్కై డైవర్స్‌గా నిలిచిన ఏకైక తండ్రీకూతుళ్లుగా వీరిద్దరూ వార్తలో నిలిచారు. శిక్షణ కోసం అనామిక 2021లో మాస్కోకు, ఈ యేడాది జనవరిలో దుబాయ్‌కి వెళ్లింది. అతి పిన్న వయస్కురాలు.. ఇప్పటి వరకు దేశంలో నలుగురు మహిళా స్కై–డైవర్ లైసెన్స్‌ను పొందారు. బెంగళూరులో బీటెక్ చదువుతున్న అనామిక దేశంలో ఐదవ మహిళా ప్రొఫెషనల్ స్కై–డైవర్ లైసెన్స్ ఘనతను సాధించిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. ప్రభుత్వం త్వరలో జాతీయ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీని తీసుకురానుందనే విషయాన్ని చెబుతూ, సవాలుతో కూడిన ఈ రంగంలోకి అమ్మాయిలు రావడానికి ప్రేరణనూ, విదేశీయులకు గట్టి పోటీనీ ఇస్తోంది అనామిక. చదవండి: ఎంత మంచి మనసమ్మా నీది.. తమ్ముడికి పెళ్లి చేసి.. తల్లి కోసం తను మాత్రం.. -
దహన సంస్కారాలు కట్టెలతో కాదు పిడకలతో
న్యూఢిల్లీ: సాధారణంగా చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేయాలంటే కట్టెలు వినియోగిస్తారు. కానీ ఇకపై ఢిల్లీలో కట్టెల బదులు ఆవు పేడతో చేసిన పిడకలు వినియోగించనున్నారు. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇది అమలు చేయనున్నట్లు మేయర్ అనామిక ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. శ్మశానవాటికల్లో అంత్యక్రియలకు వాడే కట్టెల స్థానంలో ఆవుపేడతో చేసిన పిడకలను వినియోగించాలని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. శ్మశానవాటికల్లో దహన సంస్కారాలకు ఆవుపేడతో చేసిన పిడకలను వాడాలని నిర్ణయించినట్లు మేయర్ తెలిపారు. ఆవుపేడతో చేసిన పిడకలతో మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. ఇప్పటికే ఆవుపేడతో చేసిన పిడకలను శ్మశానవాటికల వద్ద సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. దీనికి పలు సామాజిక సంస్థల నుంచి మద్దతు లభిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. పిడకలతో దహన సంస్కారాలు సంప్రదాయమని.. దీంతోపాటు ఖర్చు తక్కువ ఉండడంతో పేదలకు ప్రయోజనకరమని మేయర్ అనామిక వివరించారు. బీజేపీ పాలిత కార్పొరేషన్ కావడంతో ఇలాంటి నిర్ణయం తీసకోవడంతో ప్రతిపక్షాలతో పాటు ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం అమలుచేసింది. గంగానది కలుషితం కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసేలా 2018లో దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలను వినియోగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పిడకలతో దహనం చేస్తే దోషం ఉండదని పండితులు చెబుతున్నారు. నాగపూర్, జైపూర్, రోహతక్, జలగావ్, ఇండోర్, రాయ్‌పూర్, రూర్కెలాల్లో కూడా ఆవుపేడతో తయారుచేసిన పిడకలతోనే దహన సంస్కారాలు చేస్తున్నారు. -
‘అనామిక’పై అశోక్ నిర్లక్ష్యపు సమాధానం..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఫెయిలవడంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనామిక విషయంలో ఇంటర్ బోర్డు ఇంకా నిర్లక్ష్యం వీడటం లేదు. తాము చేసిన తప్పును ఒప్పుకో కుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థుల జవాబు పత్రాలు, మార్కులపై మంగళ వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బోర్డు కార్యదర్శి అశోక్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శ నం. ఆత్మహత్య చేసుకున్న అనామిక మార్కుల విషయంలో నెలకొన్న గందరగోళంపై విలేక రులు అడిగిన ప్రశ్నలకు ఆయన పొంతనలేని సమాధా నాలు చెప్పారు. అనామికకు జవాబుపత్రంలో 21 మార్కులు వస్తే 48 మార్కులు వచ్చినట్లు వెబ్సైట్లో ఎలా పొందుపరిచారని విలేకరులు ప్రశ్నించగా అశోక్ చిరాకుపడ్డారు. (అశోకా.. ఏంటీ లీల!) ‘వెబ్సైట్లో ఇచ్చినవి పరిగణనలోకి తీసుకోం. జవాబు పత్రాల్లో ఉన్న మార్కులనే పరిగణనలోకి తీసుకుంటాం. ఆ మార్కులే ఫైనల్. జవాబుపత్రాల మూల్యాంకనం గాలిలో చేయరు. ఆ జవాబు పత్రాలు నేను కరెక్షన్ చేయను. నాకు ఎలాంటి సంబంధంలేదు’ అంటూ విచిత్రమైన సమాధానం చెప్పారు. తప్పు ఎక్కడ, ఎలా జరిగిందో చెప్పకుండా తప్పించుకునే సమాధానం ఇచ్చారు. అనామిక విషయంలో బోర్డు తప్పే చేయనట్లు ఆయన మాట్లాడడం గమనార్హం. ఏ విద్యార్థి అయినా తమ ఫలితాలను ముందుగా వెబ్సైట్లో ఇచ్చే మెమోలోనే చూసుకుంటారు. అలా అనామికకు మొదట 20 మార్కులు వేశారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నా ఆమె జవాబు పత్రాన్ని రీ వెరిఫికేషన్ చేసి 21 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. చివరకు మరోసారి ఫెయిల్ అయిన విద్యార్థులందరి జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేసిన సమయంలో అనామికకు 48 మార్కులు వచ్చినట్లు వెబ్సైట్లో పొందుపరిచారు. దీంతో గందరగోళం నెలకొంది. దానిపై బోర్డు స్పష్టౖ మెన వివరణ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. మరోవై పు ఓఎంఆర్ షీట్లలో బోర్డు తప్పుగా ముద్రించే పొరపాట్లను విద్యార్థులు సరిచూసుకొని ఇన్విజిలే టర్లకు చెప్పి సరిచేయించుకోవాలని, లేదంటే అందు లోని తప్పులకు విద్యార్థులదే బాధ్యత అంటూ వారిని ఆందోళన పడేసే చర్యలకు బోర్డు దిగింది. బాధ్యులపై చర్యలు.. మూల్యాంకనంలో పొరపాట్లకు బా«ధ్యులైన లెక్చరర్లపై చర్యలు చేపడతామని అశోక్ పేర్కొన్నారు. అలాగే తొలుత ఫెయిలై, ఆ తర్వాత రీ వెరిఫికేషన్‌లో పాసైన విద్యార్థుల జవాబుపత్రాలు మొదట మూల్యాంకనం చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రీ వెరిఫికేషన్‌లో 1,155 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. ఈ లెక్కన గమనిస్తే లెక్చరర్లపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రీ వెరిఫికేషన్‌లో ఐదు లేదా అంతకన్నా మార్కులు పెరిగిన పేపర్లను మూల్యాంకనం చేసిన లెక్చరర్లకు రూ. 5 వేల జరిమానాతోపాటు మూల్యాంకన విధుల నుంచి మూడేళ్లు డీబార్ చేయనున్నట్లు అశోక్ తెలిపారు. గత నెల విడుదల చేసిన రీ వెరిఫికేషన్ ఫలితాల్లో 1,137 మంది విద్యార్థులు పాసైనట్లు బోర్డు ప్రకటించింది. వారం తిరిగే సరికి ఆ సంఖ్య మారిపోయింది. ఉత్తీర్ణుల సంఖ్య 1,155కి చేరింది. అంటే మరో 18 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంకా 800 మంది ఫలితాల ప్రాసెసింగ్ ఇంకా పూర్తి కాలేదు. వారిలో ఎంత మంది ఉత్తీర్ణులు అవుతారో వేచి చూడాల్సిందే. -
ఇంటర్ బోర్డు నిర్వాకానికి అనామిక బలి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల విడుదలలో తీవ్ర తప్పిదాలు జరిగాయని రీవెరిఫికేషన్ ఫలితాలు వెలువడిన అనంతరం స్పష్టమవుతోంది. ఫలితాల్లో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం బయటపడింది. ఏప్రిల్ 18న విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షలు బాగానే రాసినా.. ఫెయిల్ అయినామన్న బాధతో ప్రాణాలు తీసుకున్నారు. మొదట విడుదలైన ఫలితాల్లో అనామిక అనే విద్యార్థిని ఫెయిల్ అయినట్లు రావడంతో క్షణీకావేశంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా విడుదలైన రీవెరిఫికేషన్ ఫలితాల్లో ఆమె పాస్ అయినట్లు రిజల్ట్ వచ్చింది. మొదటి ఫలితాల్లో 20 మార్కులని చెప్పగా.. రీవెరిఫికేషన్లో 48 మార్కులు వచ్చినట్లు బోర్డు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ తప్పిదం కారణంగా తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లీదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బోర్డుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై శనివారం మక్దుంభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్చుతరావు మాట్లాడుతూ.. విద్యార్థుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి ఐపీసీ సెక్షన్ 304 (ఏ) ప్రకారం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌ను కోర్డు చెప్పక మందే అరెస్ట్ చేయాలని అన్నారు. -
100 కోట్లు, మూడేళ్ల కూతుర్ని వదులుకుని..
సాక్షి, భోపాల్ : డబ్బుంటేనే తమ సమస్యలు తీరుతాయి అనుకునేవారు కొందరు. కోట్ల ఆస్తిని వదిలేసినా ఏ సమస్యా లేకుండా జీవించవచ్చునని నమ్మేవారు మరికొందరు. మధ్యప్రదేశ్‌కు చెందిన దంపతులు రెండో కోవకే చెందుతారు. కానీ జైన్ వర్గానికి చెందిన భార్యాభర్తలు తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. మధ్యప్రదేశ్ లోని నీమచ్ కు సుమీత్ రాథోడ్(35), అనామిక(34) లకు రూ.100 కోట్లకు పైగా ఆస్తి ఉంది. వీరికి మూడేళ్ల పాప సంతానం. అయితే వీరు వందకోట్ల ఆస్తితో పాటు తమ మూడేళ్ల చిన్నారిని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కారణం కొన్ని రోజుల్లో వీరు సన్యాసం స్వీకరించనున్నారు. గుజరాత్ లోని సూరత్‌కు చెందిన సుధామార్గి ఆచార్య రామ్‌లాల్ మహరాజ్ కింద వీరు శిష్యులుగా ఉండనున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. సెప్టెంబర్ 23న ఇందుకు తాము తొలి అడుగు వేయనున్నట్లు సుమీత్ దంపతులు చెబుతున్నారు. మూడేళ్ల కూతురు ఐభ్య పరిస్థితి ఏమౌతుందో ఆలోచించుకోవాలని, ఆధ్యాత్మికత వైపునకు వెళ్లాలనుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని బంధువులతో పాటు వీరి స్నేహితులు, స్థానికులు చెప్పిచూసినా లాభం లేకపోయింది. 100 కోట్ల ఆస్తిని, మూడేళ్ల పాపను వద్దనుకుని.. మీరు ఏం పనిచేస్తున్నారో అర్థమవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ వ్యాపారి, సిమెంట్ ఫ్యాక్టరీల అధినేత అయిన సుమీత్ తండ్రి రాజేంద్ర సింగ్ రాథోడ్ వీరి నిర్ణయానికి మద్ధతు తెలిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గత ఆగస్టు 22న సుమీత్ తాను ఆధ్యాత్మికత దిశగా వెళ్తున్నానని చెప్పగా భార్య అనామిక తాను కూడా వెంట ఉంటానని భర్త దారినే ఎంచుకున్నారు. -
సోలో లైఫే సో బెటర్
దక్షిణాదిలో ఏ కథానాయకికీ లేనంత క్రేజ్‌ను నటి నయనతార సొంతం చేసుకున్నారు. వ్యక్తిగతంగా గానీ, నటనా పరంగా గానీ ఆమె ఒక సంచలనం. ఎంట్రీ, రీఎంట్రీలకు అతీతం అనిపించుకుంటున్న స్టార్ హీరోయిన్ నయన్. ఒక పక్క హీరోలతో ప్రేమ, పాటలు అంటూ రొమాన్స్ చేస్తూనే మరో పక్క స్త్రీ ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తూ దేనికైనా రెడీ అని సవాల్ చేస్తున్నట్లుగా ఉన్నారు. నయనతార ఇంతకు ముందు అనామిక, మాయ తదితర హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలలో నటించారు. వాటిలో అనామిక నిరాశ పరచినా, మాయ నిర్మాతకు, బయ్యర్లకు యమ దుడ్డును అందించింది. కాగా ముచ్చటగా మూడోసారి సింగిల్ హ్యాండ్‌తో చిత్రాన్ని లాగడానికి సిద్ధం అవుతున్నారు. నయన్ నటిస్తున్న తాజా చిత్రం దోరా. హారర్, థ్రిల్లర్ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. విషయం ఏమిటంటే ఇంతకు ముందు నయనతార నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలలో చిన్న పాత్ర అయినా ఆమెకు జంటగా హీరో పాత్రలు ఉన్నాయి. అలాంటిది దోరా చిత్రంలో నయన్‌కు లవరే ఉండరట. అసలు రొమాన్స్ కూడా ఉండదట. ఇది హత్యా ఉదంతంతో ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగే కథా చిత్రం అని తెలిసింది. పోలీస్ అధికారి పాత్రలో హరీష్ ఉత్తమన్, విలన్‌గా బెంగళూర్‌కు చెందిన సులిలే నటిస్తున్నా దోరా చిత్రాన్ని నయన్ సోలోగానే భయపెట్టడానికి సిద్ధం అవుతున్నారన్న మాట. వివేక్-వెర్విన్ల ద్వయం సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి దాస్ రామసామి దర్శకత్వం వహిస్తున్నారు.దర్శకుడు సర్గుణం నిర్మిస్తున్న దోరా చిత్రం చెన్నై పరిసర ప్రాంతాలలోనే చిత్రీకరణ జరుపుకుంటోంది. సెప్టెంబర్ 20 కల్లా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుందని సమాచారం. -
ముచ్చటగా మూడోసారి
కొవ్వొత్తి వెలుగులో నయనతార అందం భలే ఉంది కదూ. ‘రాక్షసుడు’లోని స్టిల్ ఇది. ‘అనామిక’, ‘రాజా రాణి’ చిత్రాల తర్వాత నయనతార తెలుగు తెరపై కనిపించలేదు. చాలా విరామం తర్వాత ఈ శుక్రవారం తెలుగు తెరను పలకరించనున్నారామె. గతంలో సూర్య సరసన ‘గజిని’, ‘ఘటికుడు’ చిత్రాల్లో నటించారు నయనతార. వీరి కాంబినేషన్లో మూడో సినిమా - ‘రాక్షసుడు’. తమిళంలో ‘మాస్’గా రూపొందిన ఈ చిత్రాన్ని కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి తెలుగులోకి అనువదిం చారు. తమిళనాట విజయ పథంలో ఉన్న నవతరం దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సారి కూడా హిట్ ఇస్తారేమో చూడాలి. -
నిర్మాతలకు నయన షాక్
అనూహ్య సంఘటనలకు ఎవరైనా షాక్‌కు గురవుతారు. సంచలన నటి నయనతార కూడా చిత్ర దర్శక నిర్మాతలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మొన్నటి వరకు షూటింగ్లో ఇబ్బందులకు గురి చేసి ఆ తరువాత చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిర్మాతల ఆగ్రహానికి గురైన నయనతార తాజా ప్రవర్తన వారికి దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. నయనతార నటించిన తాజా చిత్రం నీ ఎంగే ఎన్ అన్భే. తెలుగులో అనామిక పేరుతో రూపొందిన ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈయనను నయనతార ఇబ్బందులకు గురి చేసింది ఈ చిత్రానికే. తమిళం, తెలుగులో జరిగిన ఏ ఒక్క ప్రచార కార్యక్రమంలోనూ నయనతార పాల్గొనలేదు. దీంతో చిత్ర దర్శక నిర్మాతలు ఆమెపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అయ్యారని సమాచారం. ఆడియో ఆవిష్కరణ లాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనని హీరోయిన్లపై చర్యలు తీసుకుంటామని తమిళ నిర్మాతల మండలి ఇప్పటికే హెచ్చరించింది. దీంతో నయనతార నీ ఎంగే ఎన్ అన్భే చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఆకులు కాలిన తరువాత చేతులు పట్టుకున్నట్లు చిత్ర విడుదల సమయంలో ఆమె ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాననడంతో దర్శక నిర్మాతలు నిట్టూర్చారు. దీంతో నయనతార తానే చొరవ తీసుకుని మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలిస్తూ నీ ఎంగే ఎన్ అన్భే చిత్రానికి ప్రచారం చేస్తున్నారు. చిత్రం కోసం చాలా కష్టపడినట్లు, చిత్రం బాగా వచ్చినట్లు ప్రచారం ఊదరగొట్టడంతో చిత్ర దర్శక, నిర్మాతలు నిజంగానే షాక్ అవుతున్నారట. నయనతారా మజాకా? మరి. -
సినిమా రివ్యూ: అనామిక
నటీనటులు: నయనతార, హర్షవర్ధన్ రాణే, వైభవ్, పశుపతి, నరేశ్ ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ కెమెరా: విజయ్ సి. కుమార్ పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి సంగీతం: కీరవాణి దర్శకత్వం: శేఖర్ కమ్ముల ప్లస్ పాయింట్స్: నయనతార క్లైమాక్స్ కెమెరా మైనస్ పాయింట్స్: తొలిభాగం ఫీల్ లేకపోవడం థ్రిల్లర్ సినిమాకు తగ్గ స్క్రీన్ ప్లే లేకపోవడం యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల తన టేస్ట్ కు దూరంగా బాలీవుడ్ లో విజయవంతమైన 'కహానీ' చిత్రాన్ని రీమేక్ గా 'అనామిక' చిత్రాన్ని రూపొందించారు. కహానీ చిత్రం ద్వారా విమర్శకుల ప్రశంసలందుకున్న విద్యాబాలన్ పాత్రను తెలుగు, తమిళంలో నయనతార పోషించింది. కహానీ చిత్రానికి కొన్ని మార్పులు వేసి రూపొందించిన అనామిక చిత్రం మే 1 తేది గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఆదరణ లభించిన 'కహానీ' చిత్రం మాదిరిగానే అనామిక తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథ గురించి తెలుసుకుందాం! కథ: అమెరికాలో అనామిక (నయనతార) ఓ సాఫ్ట్ వేర్ ప్రొఫేషనల్. తప్పిపోయిన తన భర్త అజయ్ శాస్త్రి (హర్షవర్ధన్ రాణే) ఆచూకీ తెలుసుకునేందుకు హైదరాబాద్ చేరుకున్న అనామిక పాతబస్తీలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది. అయితే అజయ్ శాస్త్రి కిడ్నాప్ గురయ్యాడనే విషయాన్ని అనామిక తెలుసుకుంటుంది. తన భర్తను ఆచూకీ తెలుసుకోవడానికి అనామిక కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? చివరకు అజయ్ శాస్త్రిని కలుసుకుందా? అజయ్ శాస్త్రిని కలుసుకున్నఅనామిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనే ప్రశ్నలకు జవాబే ఈ చిత్రం. నటీనటుల పెర్పార్మెన్స్: అనామికగా నయనతార పాత్రే ఈ చిత్రంలో కీలకం. కెరీర్ లో నయనతార మరో విభిన్నమైన పాత్రను పోషించారు. తనకు అందివచ్చిన అనామిక పాత్రను పోషించడంలో నయన సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. తన భర్త కోసం వెతుక్కుంటూ వచ్చి, ఇబ్బందులకు గురయ్యే మహిళపై సానుభూతి సహజంగానే ఉంటుంది. అయితే ఆ సానుభూతిని ప్రేక్షకుల్లో నయనతార కలిగించలేకపోయింది. ఓవరాల్ గా నయనతార మంచి ఫెర్ఫార్మెన్స్ నే అందించింది. కథలో బాగంగా వచ్చే ఇన్స్ పెక్టర్ సారధి (వైభవ్ రెడ్డి), హోంమంత్రి (నరేశ్), దర్యాప్తు అధికారి (పశుపతి) లాంటి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. వారి పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు. హర్షవర్ధన్ పాత్ర గురించి చెప్పుకోవాల్సినంతగా లేదు. సాంకేతిక నిపుణుల పనితీరు: థ్రిలర్ నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోరు కు అత్యంత ప్రాదాన్యత ఉంటుంది. నటీనటుల ఎమోషన్స్, పరిస్థితులను తగినట్టుగా కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు 'అనామిక'కు అదనపు ఆకర్షణగా నిలిచింది. పాటలు ఈ చిత్రంలో ఎక్కువ స్కోప్ లేకపోవడంతో ఒకటి, రెండింటితో సరిపెట్టారు. ఎడిటింగ్ పై దర్శకులు మరింత దృష్టి పెట్టాల్సిందనిపించింది. విజయ్ కుమార్ పనితీరు బాగుంది. ఇక 'కహానీ' రీమేక్ అనగానే అనేక రకాలైన పోలికలు ఉండటం సహాజం. కహానీలో విద్యాబాలన్ గర్బవతి. గర్భవతిగా ఉన్న ఓ యువతి భర్త కోసం వెతుక్కుంటూ వచ్చిందనే కథలోనే సానుభూతి క్రియేట్ అవుతుంది. అయితే ఓ యువతి కష్టాల్లో ఉందనే అంశమే ఆ పాత్రపై సానుభూతి కలిగిస్తుందనే భావనతో నయనతారను ప్రెగ్నెంట్ గా చూపించకూడదని శేఖర్ కమ్ముల నిర్ణయం తీసుకున్నారు. అయితే విద్యాబాలన్ పాత్రపై కలిగే సానుభూతిని తెరమీద అనామిక పాత్రకు కల్పించడంలో దర్శకులు కొంత సఫలం కాలేదనే చెప్పవచ్చు. తొలిభాగం కథను చాలా నెమ్మదిగా నడిపించిన శేఖర్ కమ్ముల.. క్లైమాక్స్ లో విజృంభించాడనే చెప్పవచ్చు. థ్రిల్లర్ సినిమాలో ఉండే పక్కా స్క్రీన్ ప్లే, ఇంట్రస్ట్ కలిగించే సన్నివేశాలు.. ఏం జరుగబోతుందనే టెన్సన్ ను కలిగించడంలో దర్శకుడు కొంత తడబాటుకు గురయ్యాడు. కొన్ని పాత్రల విషయంలో అనేక సందేహాలను రేకేత్తించారు. అలాంటి సందేహాలను నివృత్తి చేసుకునే బాధ్యతను దర్శకుడు ప్రేక్షకుడికే వదిలివేయడం ఓ మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో కొన్ని లోపాలున్నా, కహానీ రేంజ్ లో సానుభూతి సంపాదించుకోలేకపోయినా... అనామిక ఓ మోస్తారుగా ఆకట్టుకునేలా ఉందని చెప్పవచ్చు. ట్యాగ్: అనామిక 'స్పీచ్ లెస్' -
నయనతార ఆ మాట నిర్మొహమాటంగా చెప్పేసింది..!
శేఖర్ కమ్ములకు సినీ ఓనమాలు నేర్పింది అమెరికా. కానీ... ఆయన సినిమాల్లో అక్కడి ధోరణే కనిపించదు. అచ్చ తెలుగుదనం కనిపిస్తుంది. సమాజంపై ప్రేమ... వ్యవస్థను మార్చాలనే తపన కనిపిస్తుంది. అందుకే... ఈ తరం దర్శకుల్లో శేఖర్‌ది ఓ ప్రత్యేకమైన సంతకం. హిందీ ‘కహానీ’కి రీమేక్‌గా ఆయన తీసిన ‘అనామిక’ మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శేఖర్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక భేటీ. తొలి రీమేక్ అనుభవం ఎలా ఉంది? కొత్తగా ఉంది. అయితే... తీసే విషయంలో నా అభిమతానికి భిన్నంగా వెళ్లాల్సి వచ్చింది. మామూలుగా నా సినిమాల్ని నేనే రాసుకుంటాను. కానీ... ఈ సినిమా విషయంలో తొలిసారిగా మరో వ్యక్తి సహకారం తీసుకోవాల్సి వచ్చింది. ఆయనే యండమూరి వీరేంద్రనాథ్. ‘కహానీ’ ఇతివృత్తం మాత్రమే తీసుకొని సాధ్యమైనంతవరకూ కథలో, కథనంలో మార్పు చేశాం. సినిమా అంతా నా బాణీలోనే ఉంటుంది. ఇప్పటివరకూ నా దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నింటినీ నా బిడ్డలుగా భావించాను. ఈ సినిమా మాత్రం నా దత్తపుత్రిక. అన్ని మంచి సినిమాలున్నా... ‘కహానీ’పైనే దృష్టి పెట్టారేం? ‘కహానీ’ సినిమాను అసలు నేను చూడలేదు. ఈ సినిమా నిర్మాతలు ‘కహానీ’ హక్కులు తీసుకొని.. దాన్ని నాతో తీయాలనుకున్నారు. వాళ్ల కోసమే ‘కహానీ’ చూశాను. నచ్చింది. అయితే... మన సినిమాల్లో ఉండాల్సిన అంశాలేవీ ఈ కథలో లేవు. పైగా హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. ఇలాంటి సినిమా చేయడం రిస్కేమో అనిపించింది. అలాంటి సమయంలో ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగింది. స్త్రీ సమస్యల నేపథ్యంలో ఓ సినిమా తీయాలనే ఆలోచన అప్పుడే కలిగింది నాకు. నా దగ్గర అలాంటి కథలేం లేవు. అప్పటికే ‘కహానీ’ ప్రపోజల్ నా ముందుండడంతో... ఇది కూడా ఓ స్త్రీ పోరాటం నేపథ్యమే కాబట్టి ప్రస్తుత సమయంలో ఇలాంటి సినిమాలు చేయడం అవసరం అనిపించి ఒప్పుకున్నాను. ఈ సినిమాలో నయనతారను గర్భవతిగా కాకుండా మామూలుగానే చూపించారు. కథ రీత్యా అది రిస్కేమో? స్త్రీ శక్తిని చూపించాలనే తలంపుతో ఇంత కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు, ఆమె సమాజాన్ని చీటింగ్ చేస్తున్నట్టు చూపించడం సమంజసం కాదు అనిపించింది. స్వచ్ఛంగా, నిజాయితీగా తాను ఎందుకు పోరాటం చేయకూడదు అనిపించింది. అది కష్టమైనా, కథలో చిన్న మార్పు చేశాం. ‘కహానీ’ చూడని వారికే కాదు, చూసిన వారికీ కొత్తగా అనిపిస్తుంది. ఇక ముందు రీమేక్‌లు చేస్తారా? చేయను. మాతృక కంటే సినిమా బాగుండాలి, ఫలానా సన్నివేశం కంటే భిన్నంగా ఉండాలి, నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయాలి... ఇలా ఇన్ని రకాల ఆలోచనలతో నేను సినిమా చేయలేను. నా శైలిలో, నా మనసుకు దగ్గరగా, నా ఆలోచనలకు అనుగుణంగా సినిమాలు తీయడంలో ఉన్నంత హాయి ఈ రీమేక్‌ల వల్ల ఉండదు. అందుకే ఇక చేయను. విద్యాబాలన్‌తో పోల్చి చూస్తే... నయనతార ఎలా చేశారు? విద్యాబాలన్ గొప్ప నటి. ‘కహానీ’లో ఆమె గొప్పగా నటించింది అనడం కంటే... గర్భవతిగా జీవించింది అనాలి. కానీ అదేమీ లేకుండానే ఎమోషన్స్ పలికించడం నిజంగా ఓ సవాలు. ఆ విధంగా చూసుకుంటే నయనతార పాత్రధారణే కష్టమైంది. దాన్ని తాను బాగా చేసిందనే చెప్పాలి. కానీ ఆమె సరిగ్గా సహకరించ లేదనీ, డేట్స్, ప్రమోషన్ విషయంలో ఇబ్బందులకు గురిచేసిందనీ బయట టాక్... సినిమా ప్రమోషన్ విషయంలో దూరంగా ఉండాలనేది ఆమె పాలసీ అనుకుంటా. తమిళంలో కూడా ఆమె ప్రమోషన్లలో పాల్గొనడం తక్కువే. అయితే... హీరో ఉన్న సినిమాలకు ప్రమోషన్‌కి రాకపోయినా ఫర్లేదు. కానీ ఇలాంటి సినిమాకు మాత్రం తప్పకుండా రావాలి. ఈ విషయాన్ని ఆమె ముందుంచితే... అది నా పాలసీ కాదు అని నిర్మొహమాటంగా చెప్పారు. ఆర్టిస్టుగా... నిర్మాతల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ... సినిమా మనది అనుకొని ముందుకెళ్లే వారు కొందరు... సినిమాను ఒక ఉద్యోగంలా చేసేసి డబ్బులు తీసుకొని వెళ్లే పోయేవారు కొందరు. నయనతార రెండో కేటగిరికి చెందిన నటి. తన పాత్ర వరకూ ఎంత కష్టపడాలో అంత కష్టపడుతుంది. సినిమా అయిపోయాక తనకు సంబంధం లేనట్టే ఉంటుంది. చాలామంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చిన మీ ముందు ఒక నటి ఇలా ప్రవర్తిస్తే... మీకెప్పుడూ చిరాకు అనిపించలేదా? కొత్తమ్మాయిని పరిచయం చేస్తే పోయేదే అని ఎప్పుడూ అనిపించలేదా? నేను అనుకున్నవారిలో నయనతారతో పాటు అనుష్క కూడా ఉంది. అలాగే కొత్తమ్మాయితోనూ చేయాలనుకున్నాను. కానీ నిర్మాతలు మాత్రం ఇది ద్విభాషా చిత్రం కాబట్టి, రెండు భాషల్లో పాపులరైన నటి అయితే బావుంటుందని చెప్పారు. తెలుగులో నాపై, తమిళంలో హీరోయిన్‌పై బిజినెస్ అవుతుందని వాళ్ల అభిప్రాయం. అందుకే నయనతారను తీసుకున్నాం. ఈ సినిమా వల్ల నయనతారకే ప్లస్. ఈ విషయంలో నయన అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని పలువురి అభిప్రాయం... హీరోయిన్లపై ఇంత డబ్బు పెట్టి సినిమాలు తీసేవాళ్లే లేరు. కానీ తీశారు. నాకైతే సినిమాను బాగా ప్రమోట్ చేయాలని ఉంది. ఆ ఆలోచన తనకూ ఉండాలిగా. బాలీవుడ్లో విద్యాబాలన్ గర్భిణిగా రోడ్ల వెంట తిరిగారు. మీ తర్వాతి సినిమా? ‘ఆనంద్’ లాంటి మంచి కథ రాశా. ఈ దఫా కొత్తవాళ్లతో కాకుండా యంగ్ స్టార్‌తో చేస్తా. పదేళ్లయ్యింది ‘ఆనంద్’ వచ్చి. ఇప్పటివరకూ ఆరు సినిమాలు తీశారు. ఇది ఏడో సినిమా. ఎందుకింత ఆలస్యం? కథలు తట్టాలి. నాకు డబ్బు ముఖ్యం కాదు. హీరోల డేట్స్ ఉన్నాయి కదా అని గబగబా కథలు తయారు చేసుకోవాలి అనే సినిమా ఈతిబాధలు నాకు లేవు. అవసరం అనిపించినప్పుడు, ఏదైనా చెప్పాలనిపించినప్పుడు ఓ కథ పుట్టుకొస్తుంది. నేను తీసే సినిమాలకు ఆ టైమ్ పడుతుందనుకుంటున్నా. నా సినిమాలు చిన్నవే కానీ, నా పబ్లిసిటీ విషయంలో కానీ, విజయాల విషయంలో కానీ అవి చిన్న సినిమాలు అనిపించవు. నవ్వుకున్నామా, వెళ్లిపోయామా అని కాకుండా సినిమాతో కాసేపు జీవిస్తారు ప్రేక్షకులు. అలా ఉంటాయి నా సినిమాలు. ఆ కథతో వారి జీవితాలు ముడి వేసుకున్న ఫీలింగ్లోకెళ్తారు. అలాంటి సినిమాలు రాయడం అంత తేలిక కాదు. తెలుగు సినిమాను ఉన్నతంగా నిలబెట్టే సామర్థ్యం ఉన్న దర్శకునిగా మిమ్మల్ని చెప్పుకుంటారు. అలాంటి బాధ్యత ఉన్న మీరు నిదానంగా ముందుకెళ్లడం ఎంతవరకు సమంజసం? నిదానం నా బ్యాడ్ హ్యాబిట్. మీరన్నట్లు మంచి సినిమాలు తీయాలని, వేగంగా తీయాలని నాకూ ఉంది. అయితే పలు కారణాల వల్ల కుదరడం లేదు. కార్పొరేట్ కంపెనీలతో టై అప్ అయ్యి... చిత్ర నిర్మాణాలు చేపట్టాలని ఉంది. తద్వారా కొత్త టాలెంట్‌ని పరిచయం చేయాలనుంది. ప్రస్తుతం తీస్తే 40 కోట్ల సినిమాలు తీస్తున్నారు. లేకపోతే... ఒకటి, రెండు కోట్ల ఖర్చుతో బూతు సినిమాలు తీస్తున్నారు. ఈ రెండింటి మధ్య... ఖర్చు తక్కువలో సమాజానికి ఉపయోగపడే, మన వ్యక్తిత్వాలను ఆవిష్కరించి, సంప్రదాయాలను గుర్తు చేసే, మంచి సినిమాలు రావాలి. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో మీకు నచ్చినవి? ‘మల్లెలతీరంలో సిరిమల్లె చెట్టు, మిణుగురులు’. ఈ రెండూ మంచి ప్రయత్నాలు. మన స్టార్ డెరైక్టర్లు కూడా... ఆ చట్రం నుంచి బయట పడి ఎప్పుడో ఒకప్పుడు ఇది నా సంతకం అనదగ్గ మంచి సినిమాలు తీయాలి. ఇప్పుడున్న వారిలో మీకు నచ్చిన దర్శకులు? రాజమౌళి, త్రివిక్రమ్. వాళ్లపై విజయాల ఒత్తిడి ఉంది. దాని వల్లే కేవలం వాణిజ్య చిత్రాలే తీస్తున్నారు. నిజానికి వీరిద్దరూ ఎంతో చేయగలరు. రాజమౌళైతే చేయలేనిది లేదు. ఎప్పుడో ఒకప్పుడు వారి నుంచి ‘ఇది నా నిజమైన సంతక’మనే సినిమా వస్తుందని నా ఆశ. -
షాక్ ఇచ్చిన నయన
నీ ఎంగే ఎన్ అన్భే చిత్ర యూనిట్‌కు ఆ చిత్ర హీరోయిన్ షాక్ మీద షాక్ ఇవ్వడంతో యూనిట్ దిగ్భ్రాంతికి గురయ్యింది. హిందీలో విజయం సాధించిన కహాని చిత్రానికి రీమేక్ నీ ఎంగే ఎన్ అన్భే హిందీ చిత్రంలో విద్యాబాలన్ నటించిన పాత్రను నయనతార పోషించారు. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ చిత్ర యూనిట్ నయనతారపై ఆరోపణలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. తాము నటించిన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోయిన్లు ఇటీవల విధిగా పాల్గొంటున్నారు. అలాంటిది నయనతార మాత్రం ఈ విధానాన్ని పాటించడం లేదు. నీ ఎంగే ఎన్ అన్భే చిత్రం తెలుగులోను అనామిక పేరుతో తెరకెక్కింది. ఈ చిత్రం తమిళ వెర్షన్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆ మధ్య చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి నయనతారను ఆహ్వానించినా ఆమె హాజరుకాలేదు. అదే విధంగా చిత్ర తెలుగు వెర్షన్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి నయనతార దూరంగా ఉన్నారు. దీంతో చిత్ర యూనిట్ ఆమె తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిత్రం విడుదల పది రోజులుండగా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ నయనతార పాల్గొనకపోవడం చిత్ర యూనిట్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ చిత్రం విషయంలో నయనతార తొలి నుంచి ఇబ్బందులకు గురి చేశారని యూనిట్ వర్గాలంటున్నారుు. కహాని చిత్రంలో విద్యాబాలన్ గర్భిణీగా నటించారు. తమిళం, తెలుగు భాషల్లో నయనతార గర్భిణీగా నటించనని చెప్పడంతో ఆమె కోసం చిన్న చిన్న మార్పులు చేయక తప్పలేదని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నారుు. ఇలాంటివే మరికొన్ని సమస్యలను నయనతార సృష్టించారని యూనిట్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
మాది త్రివేణీ సంగమం - సిరివెన్నెల
‘‘ఇలాంటి కథ, నిర్మాతలు, అన్ని సమయాల్లో దొరకరు. అందుకే ‘కహానీ’ తెలుగు రీమేక్ అవకాశం రాగానే వెంటనే ఒప్పుకున్నా. అయితే ‘కహానీ’లోలాగా ‘అనామిక’లో కథానాయికను గర్భవతిగా చూపించం. నాకిది కొత్త తరహా సినిమా. నేనెలా తీసినా కీరవాణి తన నేపథ్య సంగీతంతో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలరని గట్టి నమ్మకం’’ అని శేఖర్ కమ్ముల చెప్పారు. ఆయన దర్శకత్వంలో వయాకామ్ 18-ఐడెంటిటీ మోషన్ పిక్చర్స్ - లాగ్‌లైన్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం ‘అనామిక’. నయనతార, హర్షవర్థన్ రాణే, వైభవ్ ముఖ్యతారలుగా నటించిన ఈ సినిమా పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ‘ప్రసాద్స్’ సంస్థల అధినేత రమేశ్ ప్రసాద్ పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ -‘‘పాటలో ఈ పదాన్ని ఎందుకు వాడారని ప్రశ్నిస్తే కరెక్ట్‌గా చెప్పగలిగే సీతారామశాస్త్రిగారు మనకుండడం మన అదృష్టం. అందుకే ఆయన పాట రాసేవరకూ ఎంత కాలమైనా ఎదురు చూస్తాం’’ అని చెప్పారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ -‘‘నేను, శేఖర్ కమ్ముల, కీరవాణి కలిసి త్రివేణి సంగమంగా ఈ సినిమా వచ్చింది’’ అన్నారు. ఈ సినిమాకు పడినంత కష్టం ఎప్పుడూ పడలేదని యండమూరి వీరేంద్రనాథ్ చెప్పారు. శేఖర్‌తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందని వైభవ్ తెలిపారు. ఈ వేడుకలో ఎ. కోదండరామిరెడ్డి, నరేష్ తదితరులు మాట్లాడారు. -
అనామిక మూవీ మరియు వర్కింగ్ స్టిల్స్
-
'అనామిక' ఆడియో ఆవిష్కరణ
-
ముఖం చాటేసిన నయనతార!
దక్షిణాది తార నయనతార అనామిక ఆడియో కార్యక్రమానికి ముఖం చాటేసింది. చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి రావాలని చేసిన విజ్ఞప్తికి నయనతార నో చెప్పడంతో దర్శకుడు శేఖర్ కమ్ముల కొంత నిరుత్సాహానికి గురయ్యారు. గత చిత్రాల ఆడియో విడుదల కార్యక్రమాలకు నయనతార హాజరకాకపోవడం, ఇతర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై తెలుగు చిత్ర నిర్మాతలు, దర్శకులు కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో 'అనామిక' రాకపోవడంపై వేదికపైన శేఖర్ కమ్ముల కొంత నిరాశను వ్యక్తం చేశారు. నయనతార కారణంగానే 'అనామిక' షూటింగ్ పూర్తి చేసుకోవడంలో ఆలస్యమైందనే మీడియాలో కూడా మీడియాలో వచ్చింది. వాస్తవానికి ఏప్రిల్ 16 తేదిన 'అనామిక' ఆడియో కార్యక్రమం జరగాల్సి ఉంది. కాని నయనతార కారణంగా ఆడియో విడుదల కార్యక్రమం వాయిదా వేశారు. మే 1 తేదిన విడుదల కానున్న అనామిక చిత్ర ప్రమోషన్ కు నయనతార హాజరుకాకపోతే శేఖర్ కమ్ముల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. హిందీలో ఘనవిజయం సాధించిన కహానీ చిత్ర ఆధారంగా అనామిక రూపొందుతోంది. బాలీవుడ్ తార విద్యాబాలన్ నటించిన పాత్రను నయనతార పోషించింది. కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్దమైంది. -
అనామిక ప్రమోషనల్ సాంగ్ లో ప్రముఖ గాయిని సునీత
-
ఎన్నో కసరత్తులు...
ఊరు కాని ఊళ్లో... ఎవ్వరూ అండ లేకున్నా నానా కష్టాలు పడుతూ భర్త కోసం వెతుకులాడే ఓ భార్య కథలో హిందీలో రూపొందిన ‘కహానీ’ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. విద్యాబాలన్‌లోని ఉత్తమ నటిని మరోసారి ఆవిష్కరించిందా సినిమా. ఈ ‘కహానీ’ మన దర్శకుడు శేఖర్ కమ్ములను విపరీతంగా ఇన్‌స్పయిర్ చేసింది. ఇంతవరకూ తన సొంత కథలతోనే సినిమాలు చేసుకున్న శేఖర్ని తొలిసారి రీమేక్ చేయడానికి సిద్ధపడేలా చేసింది. అదే ‘అనామిక’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ని నయనతార పోషించారు. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన నయనకు తనలోని నటిని ఆవిష్కరించుకోవడానికి దొరికిన సువర్ణావకాశమిది. అందుకే ఈ పాత్ర పోషణ కోసం ఎన్నో కసరత్తులు చేశారు. తనకు ఇష్టమైన కొన్నింటిని వదిలేసి మరీ ఈ పాత్ర చేశానని నయన స్వయంగా చెప్పుకున్నారు. హర్షవర్థన్ రాణే, వైభవ్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని వయాకామ్18-ఐడెంటిటీ మోషన్ పిక్చర్స్ - లాగ్‌లైన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: విజయ్ సి.కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్. -
డూప్ అవసరం లేదు...నేనే చేస్తాను!
వ్యక్తిగత జీవితాన్ని నయనతార ఈజీగా తీసుకుంటారని కొందరు అంటుంటారు. ఆమెపై వచ్చిన వివాదాలు అది నిజమని చెప్పకనే చెబుతాయి. కానీ వృత్తిపర జీవితం విషయంలో మాత్రం నయన చాలా స్ట్రిక్ట్. పాత్ర నచ్చితే... దాని కోసం ఎంతటి స్ట్రగుల్ అయినా.. అనుభవించడానికి సిద్ధంగా ఉంటారామె. ‘శ్రీరామరాజ్యం’లోని సీత పాత్రే అందుకు ఓ ఉదాహరణ. ఇక క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ కోసమైతే... కష్టపడి తెలుగు నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు నయన. అందుకే వివాదాలతో ప్రమేయం లేకుండా ప్రేక్షకా దరణ పొందుతున్నారు తను. ప్రస్తుతం తెలుగులో నయనతార నటిస్తున్న చిత్రం ‘అనామిక’. బాలీవుడ్ ‘కహానీ’ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోని ప్రతి సన్నివేశాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చేస్తున్నారట నయనతార. కథ రీత్యా ఇందులో కొన్ని రిస్కీ షాట్స్ చేయాలి. కొన్ని స్టంట్స్ కూడా ఉన్నాయట. డూప్‌ని పెట్టి లాగించేద్దాం శేఖర్ అనుకున్నా, ఆ అవకాశం ఆయనకివ్వలేదట నయనతార. ‘డూప్ అవసరం లేదు. నేనే చేస్తాను’ అని అలవోకగా రిస్కీ షాట్స్ చేసేసి, యూనిట్ సభ్యులను ఆశ్చర్యపరిచారట. అంతేకాదు.. ఎంతో ముచ్చటగా పెంచుకున్న చేతి గోళ్లను సైతం కత్తిరించుకున్నారట. వాస్తవానికి గోళ్లు కనిపించకుండా ఆ సన్నివేశాలు తీద్దామనుకున్న శేఖర్...నయనతార నెయిల్స్ కట్ చేసు కోవడంతో రిలీఫ్ అయ్యారట. -
సినిమా పేరు మారింది
నయనతార నటిస్తున్న చిత్రం పేరు మారింది. ఈ సంచలన నటి నటిస్తున్న ఆసక్తికరమైన చిత్రాల్లో హిందీ రీమేక్ కహనీ ఒకటి. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విద్యాబాలన్ పాత్రను నయనతార పోషిస్తున్నారు. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై రెండు భాషల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. తప్పిపోయిన భర్తను వెతుకుతూ వెళ్లే భార్య ఇతివృత్తంగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో విద్యాబాలన్ పాత్రకు నయనతారనే సరిపోతారని దర్శకుడు శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. ఈ చిత్రానికి తెలుగులో అనామిక అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తమిళం లో ముందుగా అవళ్ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. తాజాగా నీ ఎం గే ఎన్ అన్బే అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్రా న్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గా లు తెలిపారు. అదే విధంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 14న నిర్వహించనున్నారట. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా కహానీ హీరోయిన్ విద్యాబాలన్ పాల్గొననున్నారన్నది తాజా సమాచారం. -
ఇప్పుడే కాదు...భవిష్యత్తులోనూ చేయను!
సునీత... అందంగా ఉంటారు! అందంగా పాడతారు... అందంగా డబ్బింగ్ చెబుతారు! ఇవన్నీ పాత విషయాలే... మరి కొత్త సంగతి ఏంటంటే... సునీత ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు! శేఖర్ కమ్ముల తీస్తున్న ‘అనామిక’ కోసం ఆమె మేకప్ వేసుకున్నారు... కంగ్రాట్స్... ఆర్టిస్ట్‌గా కొత్త అవతారం ఎత్తారుగా! సునీత: ఆగండాగండి. నేను జస్ట్ ‘అనామిక’ ప్రమోషనల్ సాంగ్‌లో యాక్ట్ చేశానంతే. క్యారెక్టర్ చేయలేదు! సాంగ్‌లో కనబడడం కూడా యాక్టింగే కదా? సునీత: కరెక్టే కానీ, ఇది జస్ట్ ప్రమోషనల్ సాంగ్. ఈ సాంగ్ మీతో చేయాలన్న ఆలోచన శేఖర్దేనా? సునీత: అవును... ఆయనదే. ‘అనామిక’ కోసం కీరవాణి స్వరసారథ్యంలో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన ‘ఎవ్వరితో చెప్పను... ఎక్కడని వెతకను’ పాట పాడాను. ఈ పాటనే వీడియోగా షూట్ చేస్తామని శేఖర్ నన్ను అడిగారు. వినూత్నమైన ఆలోచన కాబట్టి, వెంటనే అంగీకరించాను. ఇలాంటి మ్యూజిక్ వీడియోల ట్రెండ్ బాలీవుడ్లో ఎక్కువ. ఆయా సినిమాల ప్రచారానికి ఈ మ్యూజిక్ వీడియోలను అక్కడ బాగా ఉపయోగిస్తుంటారు. ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొదలవుతోంది. సరే... ఇంతకూ ఫస్ట్ డే షూటింగ్ ఎలా అనిపించింది? సునీత: కొంచెం నెర్వస్‌గానే అనిపించింది. బుల్లితెరపై అనేక మ్యూజిక్ షోస్ చేశాను. కానీ, సినిమా షూటింగ్ దానికి పూర్తి భిన్నం కదా! కెమెరాను చూస్తూ నటించగలగడం ఓ కొత్త అనుభవం. ఈ పాట కోసం రెండు రోజులు షూటింగ్లో పాల్గొన్నా. ఎలా కనిపిస్తానా అని కొంచెం టెన్షన్‌గానే ఉంది. ఫెంటాస్టిక్‌గా యాక్ట్ చేశానని చెప్పను కానీ, ఏదో చేసేశానులెండి. ఓసారి ఫ్యాష్‌బ్యాక్‌లోకి వెళ్దాం. అప్పట్లో ఎవరూ మిమ్మల్ని హీరోయిన్గా చేయమని అడగలేదా? సునీత: ఎస్వీ కృష్ణారెడ్డిగారు ఫస్ట్ అడిగారు. ఏ సినిమాకనేది తెలీదు. తర్వాత రామ్‌గోపాల్‌వర్మ కూడా అడిగారు. ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చాయి. హీరోయిన్ అనేకాదు. స్పెషల్ క్యారెక్టర్లూ చేయమని అడిగారు. మరి ఎందుకు చేయలేదు? సునీత: నాకు పాడటమే ఇష్టం. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పడం ఇష్టం. నాకు మానసిక సంతృప్తినిచ్చే ఈ రెండూ వదిలేసి, ఆర్టిస్ట్‌గా వెళ్లాలని ఏనాడూ అనుకోలేదు. కలలో కూడా ఆలోచించలేదు. మంచి యాక్టింగ్ ఆఫర్స్ వదిలేసుకున్నానని ఏనాడూ చింతించలేదు కూడా. యాక్ట్ చేస్తూ కూడా పాటలు పాడొచ్చుగా? సునీత: సినిమా పుట్టిన కొత్తల్లో ఆ ప్రక్రియే నడిచేది. ఈ ట్రెండ్‌లో అలా కష్టం. యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా పాడతానంటే ఎవరూ ఒప్పుకోరేమో! అయినా నటించాలనే ఆలోచనే లేనప్పుడు ఇదంతా ఎందుకు ఆలోచిస్తాను. భవిష్యత్తులో కూడా యాక్ట్ చేయరా? సునీత: ఏమోనండీ... ఇప్పుడే ఏం చెప్పగలం. అసలు మ్యూజిక్ వీడియోలో నటిస్తాననే అనుకోలేదు కదా. నా కెరీర్ మొదలై 18 ఏళ్లయింది. ఇప్పటికి 3000 పాటలు పాడాను,750 సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నేను చాలా చాలా హ్యాపీ. సంగీత దర్శకత్వం చేస్తారా? సునీత: అస్సలు చేయను. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా చేయను. మీ లక్ష్యం? సునీత: మొదటి నుంచీ నా గోల్ ఒకటే, జాతీయ అవార్డు అందుకోవాలి. అలాగే అన్ని భాషల్లోనూ పాటలు పాడాలని ఉంది. ఇప్పటికి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనే పాడాను. ఇక్కడ బిజీ కారణంగా మిగతా భాషలవైపు దృష్టి సారించలేకపోతున్నాను. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.