సోలో లైఫే సో బెటర్ | solo life so Better says Nayanthara | Sakshi
Sakshi News home page

సోలో లైఫే సో బెటర్

Published Wed, Jul 13 2016 2:26 AM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

సోలో లైఫే సో బెటర్

సోలో లైఫే సో బెటర్

 దక్షిణాదిలో ఏ కథానాయకికీ లేనంత క్రేజ్‌ను నటి నయనతార సొంతం చేసుకున్నారు. వ్యక్తిగతంగా గానీ, నటనా పరంగా గానీ ఆమె ఒక సంచలనం. ఎంట్రీ, రీఎంట్రీలకు అతీతం అనిపించుకుంటున్న స్టార్ హీరోయిన్ నయన్. ఒక పక్క హీరోలతో ప్రేమ, పాటలు అంటూ రొమాన్స్ చేస్తూనే మరో పక్క స్త్రీ ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తూ దేనికైనా రెడీ అని సవాల్ చేస్తున్నట్లుగా ఉన్నారు. నయనతార ఇంతకు ముందు అనామిక, మాయ తదితర హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలలో నటించారు.
 
  వాటిలో అనామిక నిరాశ పరచినా, మాయ నిర్మాతకు, బయ్యర్లకు యమ దుడ్డును అందించింది. కాగా ముచ్చటగా మూడోసారి సింగిల్ హ్యాండ్‌తో చిత్రాన్ని లాగడానికి సిద్ధం అవుతున్నారు. నయన్ నటిస్తున్న తాజా చిత్రం దోరా. హారర్, థ్రిల్లర్ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. విషయం ఏమిటంటే ఇంతకు ముందు నయనతార నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలలో చిన్న పాత్ర అయినా ఆమెకు జంటగా హీరో పాత్రలు ఉన్నాయి. అలాంటిది దోరా చిత్రంలో నయన్‌కు లవరే ఉండరట.
 
 అసలు రొమాన్స్ కూడా ఉండదట. ఇది హత్యా ఉదంతంతో ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగే కథా చిత్రం అని తెలిసింది. పోలీస్ అధికారి పాత్రలో హరీష్ ఉత్తమన్, విలన్‌గా బెంగళూర్‌కు చెందిన సులిలే నటిస్తున్నా దోరా చిత్రాన్ని నయన్ సోలోగానే భయపెట్టడానికి సిద్ధం అవుతున్నారన్న మాట. వివేక్-వెర్విన్‌ల ద్వయం సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి దాస్ రామసామి దర్శకత్వం వహిస్తున్నారు.దర్శకుడు సర్గుణం నిర్మిస్తున్న దోరా చిత్రం చెన్నై పరిసర ప్రాంతాలలోనే చిత్రీకరణ జరుపుకుంటోంది. సెప్టెంబర్ 20 కల్లా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement