నయన్ కాదంటే కథ మారింది
నయన్ కాదంటే కథ మారింది
Published Sun, Jan 5 2014 4:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
కథానాయకులను దృష్టిలో పెట్టుకుని కథలు తయారు చేయడమనేది సాధారణం. కథానాయికలు కాదంటే కథను మార్చడం అరుదు. అలాంటి సంఘటనకు తాజాగా ఆద్యురాలైంది నటి నయనతార. హీరోయిన్‌గా రెండవసారి రీచార్జ్ అయిన ఈ సుందరి కోలీవుడ్‌లో రాజారాణి, ఆరంభం, వరుస విజయాలతో బిజీగా మారింది. తాజాగా నటిస్తున్న చిత్రం అనామిక. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం బాలీవుడ్ హిట్ చిత్రం కహానీకి రీమేక్. హిందీలో విద్యాబాలన్ నటించిన పాత్రను దక్షిణాదిలో నయనతార పోషిస్తోంది. హిందీలో విద్యాబాలన్ నిండుగర్భిణిగా నటించారు.
ఆ కథను దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ ముద్దుగుమ్మకు చెప్పగా గర్భిణిగా తాను నటించనని ఖరాఖండిగా చెప్పిందట. దీంతో ఆమెను వదులుకోవడం ఇష్టంలేని దర్శకుడు కహాని కథనే మార్చేశారు. హిందీలో నిండుగర్భిణిగా ఉన్న హీరోయిన్ కనిపించకుండా పోయిన భర్తను వెతుక్కునే వెతలే కథ. ఆ కథను నయనతార కోసం పెళై్లన కొత్తలో కనిపించకుండా పోయిన భర్తను వెతుక్కునే భార్య కథగా దర్శకుడు మార్చేశారని సమాచారం. ఈ వ్యవహారం గురించి దర్శకుడు వివరణ ఇస్తూ హిందీ చిత్రం కహాని దేశవ్యాప్తంగా విడుదలైందన్నారు. ఆ చిత్రాన్ని అదే విధంగా పునర్ నిర్మిస్తే ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ లభించదని పేర్కొన్నారు. అందువల్లే కథను చేర్పులు, మార్పులు చేసి తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement