పిల్లల్ని కనే యంత్రాన్ని కాదు!
‘మీరు ఎప్పుడు అమ్మ కాబోతున్నారు?’ – పెళ్లయిన కథానాయికలకు తరచూ ఎదురయ్యే ప్రశ్నల్లో ఇదొకటి. వాళ్లు ఎప్పటికప్పుడు ఈ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెబుతుంటారు. కానీ, విద్యా బాలన్ రూటే సపరేటు కదా! ఆమెను ఈ ప్రశ్న అడగ్గా.. ‘‘నేనేమీ బేబీ మేకింగ్ మెషీన్ కాదు. ఎనీవే, ప్రపంచంలో రోజు రోజుకీ పాపులేషన్ పెరుగుతోంది. కొందరికి పిల్లలు లేనట్లయితే మంచిదే’’ అన్నారు. దీంతో పాటు పెళ్లి మండపంలో జరిగిన ఓ సంఘటనను విద్యాబాలన్ గుర్తు చేసుకున్నారు. ‘‘ఫ్యామిలీ ప్లానింగ్ అనేది నాకూ, మా ఆయనకూ సంబంధించినది. మిగతా వాళ్లకు దాంతో పని లేదనుకుంటున్నా.
కానీ, మన దేశంలో బంధువులు, ఇరుగు పొరుగువారు అనవసరమైన ప్రశ్నలు వేస్తారు. పెళ్లయిన కొన్ని నిమిషాలకు మా అంకుల్ ఒకరు మా (సిద్ధార్థ్, విద్యా బాలన్) దగ్గరకు వచ్చి, ‘మళ్లీ నేను మిమ్మల్ని చూసినప్పుడు ముగ్గురు కనిపించాలి’ అన్నారు. పెళ్లప్పుడే∙పిల్లల ప్రస్తావన తీసుకొచ్చారాయన. నేను నవ్వి ఊరు కున్నా. ఎందుకంటే అప్పటికి హనీ మూన్‌కి ఎక్కడికి వెళ్లాలనేది కూడా నిర్ణయించు కోలేదు’’ అన్నారు విద్యాబాలన్.