నిర్మాతలకు నయన షాక్ | nayanatara given shock to producers | Sakshi
Sakshi News home page

నిర్మాతలకు నయన షాక్

Published Sat, May 3 2014 12:21 AM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM

నిర్మాతలకు  నయన షాక్ - Sakshi

నిర్మాతలకు నయన షాక్

అనూహ్య సంఘటనలకు ఎవరైనా షాక్‌కు గురవుతారు. సంచలన నటి నయనతార కూడా చిత్ర దర్శక నిర్మాతలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మొన్నటి వరకు షూటింగ్‌లో ఇబ్బందులకు గురి చేసి ఆ తరువాత చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిర్మాతల ఆగ్రహానికి గురైన నయనతార తాజా ప్రవర్తన వారికి దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. నయనతార నటించిన తాజా చిత్రం నీ ఎంగే ఎన్ అన్భే. తెలుగులో అనామిక పేరుతో రూపొందిన ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈయనను నయనతార ఇబ్బందులకు గురి చేసింది ఈ చిత్రానికే. తమిళం, తెలుగులో జరిగిన ఏ ఒక్క ప్రచార కార్యక్రమంలోనూ నయనతార పాల్గొనలేదు. దీంతో చిత్ర దర్శక నిర్మాతలు ఆమెపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అయ్యారని సమాచారం.
 
ఆడియో ఆవిష్కరణ లాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనని హీరోయిన్లపై చర్యలు తీసుకుంటామని తమిళ నిర్మాతల మండలి ఇప్పటికే హెచ్చరించింది. దీంతో నయనతార నీ ఎంగే ఎన్ అన్భే చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఆకులు కాలిన తరువాత చేతులు పట్టుకున్నట్లు చిత్ర విడుదల సమయంలో ఆమె ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాననడంతో దర్శక నిర్మాతలు నిట్టూర్చారు. దీంతో నయనతార తానే చొరవ తీసుకుని మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలిస్తూ నీ ఎంగే ఎన్ అన్భే చిత్రానికి ప్రచారం చేస్తున్నారు. చిత్రం కోసం చాలా కష్టపడినట్లు, చిత్రం బాగా వచ్చినట్లు ప్రచారం ఊదరగొట్టడంతో చిత్ర దర్శక, నిర్మాతలు నిజంగానే షాక్ అవుతున్నారట. నయనతారా మజాకా? మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement