షాక్ ఇచ్చిన నయన | Nayanthara shock to cinema unit | Sakshi
Sakshi News home page

షాక్ ఇచ్చిన నయన

Published Fri, Apr 25 2014 9:02 AM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM

షాక్ ఇచ్చిన నయన - Sakshi

షాక్ ఇచ్చిన నయన

నీ ఎంగే ఎన్ అన్భే చిత్ర యూనిట్‌కు ఆ చిత్ర హీరోయిన్ షాక్ మీద షాక్ ఇవ్వడంతో యూనిట్ దిగ్భ్రాంతికి గురయ్యింది. హిందీలో విజయం సాధించిన కహాని చిత్రానికి రీమేక్ నీ ఎంగే ఎన్ అన్భే హిందీ చిత్రంలో విద్యాబాలన్ నటించిన పాత్రను నయనతార పోషించారు. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ చిత్ర యూనిట్ నయనతారపై ఆరోపణలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. తాము నటించిన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోయిన్లు ఇటీవల విధిగా పాల్గొంటున్నారు. అలాంటిది నయనతార మాత్రం ఈ విధానాన్ని పాటించడం లేదు.
 
 నీ ఎంగే ఎన్ అన్భే చిత్రం తెలుగులోను అనామిక పేరుతో తెరకెక్కింది. ఈ చిత్రం తమిళ వెర్షన్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆ మధ్య చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి నయనతారను ఆహ్వానించినా ఆమె హాజరుకాలేదు. అదే విధంగా చిత్ర తెలుగు వెర్షన్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి నయనతార దూరంగా ఉన్నారు. దీంతో చిత్ర యూనిట్ ఆమె తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  చిత్రం విడుదల పది రోజులుండగా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ నయనతార పాల్గొనకపోవడం చిత్ర యూనిట్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది.  
 
 ఈ చిత్రం విషయంలో నయనతార తొలి నుంచి ఇబ్బందులకు గురి చేశారని యూనిట్ వర్గాలంటున్నారుు. కహాని చిత్రంలో విద్యాబాలన్ గర్భిణీగా నటించారు. తమిళం, తెలుగు భాషల్లో నయనతార గర్భిణీగా నటించనని చెప్పడంతో ఆమె కోసం చిన్న చిన్న మార్పులు చేయక తప్పలేదని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నారుు. ఇలాంటివే మరికొన్ని సమస్యలను నయనతార సృష్టించారని యూనిట్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement