శేఖర్ కమ్ముల సినిమాలో యాక్టింగ్!
శేఖర్ కమ్ముల సినిమాలో యాక్టింగ్!
Published Sun, Feb 2 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, వ్యాఖ్యాతగా.. ఇలా అడుగుపెట్టిన ప్రతి శాఖలోనూ ప్రజ్ఞ కనపరిచిన సునీత... త్వరలో నటిగా కూడా వెండితెరపై కనిపించబోతున్నారు. గానం, అనువాద కళ, వ్యాఖ్యానం ఈ మూడూ నటనతో కూడుకున్నవే. ఆ ప్రకారంగా చూస్తే.. సునీతకు నటన కొత్తేం కాదు. అందుకని సునీత చేస్తున్నది పూర్తి స్థాయి పాత్ర అనుకుంటే, మీరు పప్పులో కాలేసినట్టే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్ర పోషించిన ‘అనామిక’ చిత్రం ప్రమోషనల్ సాంగ్‌లో సునీత నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల లాంటి మంచి దర్శకుని చిత్రం ద్వారా నటిగా సునీత తొలి అడుగు వేయనుండటం నిజంగా అదృష్టమే. ఎందుకంటే ఆయన పరిచయం చేసిన చాలామంది యాక్టర్స్ ఈ రోజున స్టార్స్‌గా వెలుగుతున్నారు. మరి.. సునీత అదృష్టం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ రోజు నుంచే (సోమవారం) సునీతపై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు శేఖర్ కమ్ముల.
Advertisement
Advertisement