ఇండియాలో స్కై–డైవింగ్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలిగా వార్తల్లో నిలిచింది 21 ఏళ్ల అనామిక శర్మ. ఇంజినీరింగ్ చదువుతున్న అనామిక ఈ యేడాది దుబాయ్ డ్రాప్ జోన్ నుండి ‘ఎ’ కేటగిరీ ప్రొఫెషనల్ యునైటెడ్ స్టేట్స్ పారాచూట్ అసోసియేషన్ నుంచి లైసెన్స్ పొందింది.
తొలిసారి పదివేల అడుగుల ఎత్తు నుంచి దూకినప్పుడు అనామిక వయసు కేవలం 11 ఏళ్లు. ఆ తర్వాత 42 జంప్‌లు సాధించిన ఘనత ఆమెది. పది రకాల పారాచూట్‌లు, ఆరు వేర్వేరు ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను సమర్ధవంతంగా నడపగలిగింది. ఈ యువ సాధకురాలు మాట్లాడుతూ – ‘గాలిలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉన్న అనుభూతి, నేలను తాకగానే ఆనందం, ఉల్లాసం కలుగుతుంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం చాలా కష్టం’ అని వివరిస్తుంది.
ఏకైక తండ్రీకూతుళ్లు
అనామిక తండ్రి కూడా ప్రొఫెషనల్ స్కై–డైవర్. దీంతో దేశంలోనే వృత్తిరీత్యా స్కై డైవర్స్‌గా నిలిచిన ఏకైక తండ్రీకూతుళ్లుగా వీరిద్దరూ వార్తలో నిలిచారు. శిక్షణ కోసం అనామిక 2021లో మాస్కోకు, ఈ యేడాది జనవరిలో దుబాయ్‌కి వెళ్లింది.
అతి పిన్న వయస్కురాలు..
ఇప్పటి వరకు దేశంలో నలుగురు మహిళా స్కై–డైవర్ లైసెన్స్‌ను పొందారు. బెంగళూరులో బీటెక్ చదువుతున్న అనామిక దేశంలో ఐదవ మహిళా ప్రొఫెషనల్ స్కై–డైవర్ లైసెన్స్ ఘనతను సాధించిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది.
ప్రభుత్వం త్వరలో జాతీయ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీని తీసుకురానుందనే విషయాన్ని చెబుతూ, సవాలుతో కూడిన ఈ రంగంలోకి అమ్మాయిలు రావడానికి ప్రేరణనూ, విదేశీయులకు గట్టి పోటీనీ ఇస్తోంది అనామిక.
చదవండి: ఎంత మంచి మనసమ్మా నీది.. తమ్ముడికి పెళ్లి చేసి.. తల్లి కోసం తను మాత్రం..
Comments
Please login to add a commentAdd a comment