Bandi Saroj Kumar Movie Parakramam Pre Teaser Released - Sakshi
Sakshi News home page

Parakramam Movie: గ్రామీణ యువకుడి నేపథ్యంలో తెరకెక్కుతోన్న 'పరాక్రమం'‘

Published Mon, Aug 21 2023 6:34 PM | Last Updated on Mon, Aug 21 2023 6:37 PM

Bandi Saroj Kumar Movie Parakramam Pre Teaser Released - Sakshi

బండి సరోజ్ కుమార్, అనామిక, కిరీటి, మోహన్ సేనాపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం  "పరాక్రమం".  బీఎస్‌కే మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  తాజాగా ఈ చిత్రం ప్రీ టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 

దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ... 'నేను ఒక నటుడిగా , దర్శకుడిగా మీలో కొంత మందికి తెలిసే ఉండొచ్చు. "కళ నాది. వెల మీది" అనే కాన్సెప్ట్‌తో ఓటీటీల్లో రిలీజ్ చేసిన "నిర్బంధం, మాంగల్యం" లాంటి సినిమాలతో ప్రేక్షకుల అభిమానం లభించింది.  వారి అభిమానంతో ఇప్పుడు నేను నా సొంత నిర్మాణ సంస్థ ద్వారా వెండితెరకు రాబోతున్నా. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పరాక్రమం చిత్రం  నిర్మించబోతున్నా. ' అని అన్నారు.  గోదావరి జిల్లాలోని "లంపకలోవ" గ్రామంలో పుట్టిన "లోవరాజు" అనే యువకుడి జీవితంలో ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సరోజ్ కుమార్ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement