డూప్ అవసరం లేదు...నేనే చేస్తాను! | Nayantara Shot A Risky Stunt For Anamika Sans Body Double: Sekhar | Sakshi
Sakshi News home page

డూప్ అవసరం లేదు...నేనే చేస్తాను!

Published Thu, Mar 6 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

Nayantara Shot A Risky Stunt For Anamika Sans Body Double: Sekhar

 వ్యక్తిగత జీవితాన్ని నయనతార ఈజీగా తీసుకుంటారని కొందరు అంటుంటారు. ఆమెపై వచ్చిన వివాదాలు అది నిజమని చెప్పకనే చెబుతాయి. కానీ వృత్తిపర జీవితం విషయంలో మాత్రం నయన చాలా స్ట్రిక్ట్. పాత్ర నచ్చితే... దాని కోసం ఎంతటి స్ట్రగుల్ అయినా.. అనుభవించడానికి సిద్ధంగా ఉంటారామె. ‘శ్రీరామరాజ్యం’లోని సీత పాత్రే అందుకు ఓ ఉదాహరణ.  ఇక క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ కోసమైతే... కష్టపడి తెలుగు నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు నయన. అందుకే వివాదాలతో ప్రమేయం లేకుండా ప్రేక్షకా దరణ పొందుతున్నారు తను. ప్రస్తుతం తెలుగులో నయనతార నటిస్తున్న చిత్రం ‘అనామిక’.
 
  బాలీవుడ్ ‘కహానీ’ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శేఖర్  కమ్ముల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోని ప్రతి  సన్నివేశాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చేస్తున్నారట నయనతార.  కథ  రీత్యా ఇందులో కొన్ని రిస్కీ షాట్స్ చేయాలి. కొన్ని స్టంట్స్  కూడా ఉన్నాయట. డూప్‌ని పెట్టి లాగించేద్దాం శేఖర్ అనుకున్నా, ఆ  అవకాశం ఆయనకివ్వలేదట నయనతార. ‘డూప్ అవసరం లేదు.  నేనే చేస్తాను’ అని అలవోకగా రిస్కీ షాట్స్ చేసేసి, యూనిట్  సభ్యులను ఆశ్చర్యపరిచారట. అంతేకాదు.. ఎంతో ముచ్చటగా  పెంచుకున్న చేతి గోళ్లను సైతం కత్తిరించుకున్నారట. వాస్తవానికి  గోళ్లు కనిపించకుండా ఆ సన్నివేశాలు తీద్దామనుకున్న  శేఖర్...నయనతార నెయిల్స్ కట్ చేసు కోవడంతో రిలీఫ్ అయ్యారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement