సినిమా పేరు మారింది | Nayantara's Anamika Becomes Nee Enge En Anbe In Tamil | Sakshi
Sakshi News home page

సినిమా పేరు మారింది

Published Tue, Feb 11 2014 4:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

సినిమా పేరు మారింది

సినిమా పేరు మారింది

నయనతార నటిస్తున్న చిత్రం పేరు మారింది. ఈ సంచలన నటి నటిస్తున్న ఆసక్తికరమైన చిత్రాల్లో హిందీ రీమేక్ కహనీ ఒకటి. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విద్యాబాలన్ పాత్రను నయనతార పోషిస్తున్నారు. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై రెండు భాషల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. తప్పిపోయిన భర్తను వెతుకుతూ వెళ్లే భార్య ఇతివృత్తంగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో విద్యాబాలన్ పాత్రకు నయనతారనే సరిపోతారని దర్శకుడు శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. 
 
 ఈ చిత్రానికి తెలుగులో అనామిక అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తమిళం లో ముందుగా అవళ్ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. తాజాగా నీ ఎం గే ఎన్ అన్బే అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్రా న్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గా లు తెలిపారు. అదే విధంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 14న నిర్వహించనున్నారట. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా కహానీ హీరోయిన్ విద్యాబాలన్ పాల్గొననున్నారన్నది తాజా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement