Kahaani
-
ఏక్ కహానీ!
కొన్ని కథలు ఎప్పటికీ గుర్తుంటాయ్.. కొందరి కథలు ఎప్పటికీ గుర్తుంటాయ్..ఏక్ కహానీ అని మొదలుపెట్టి చెప్పే గొప్ప కథలవి.విద్యా బాలన్.. బాలీవుడ్లో హీరోయిన్ అనే పాత్రను హైలైట్ చేస్తూ రాసిన ఓ కథ ఉంది. ఏక్ కహానీ.. చదవండి.. తమిళ మలయాళం! విద్యాబాలన్ బాగా చదువుకుంది. ఇంట్లో వాళ్లంతా బాగా చదువుకున్నవారే! పుట్టి పెరిగింది అంతా ముంబైలో! ఇంట్లోనేమో తమిళం, మలయాళం మాట్లాడతారు. చిన్నప్పట్నుంచే ఎన్నో భాషలు వచ్చు. ఏదడిగినా చెప్పేయగలదు. సినిమాలంటే పిచ్చి. దీంతో చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టేసింది. ముంబైలోనే ఉంటున్నా, బాలీవుడ్ స్టార్ అయినా, విద్యాబాలన్ ఇంట్లో ఇప్పటికీ తమిళ మలయాళాలే వినిపిస్తాయట!! ఐరన్ లెగ్.. చిన్న చిన్న షోస్ చేసిన తర్వాత విద్యాబాలన్ మెయిన్‌స్ట్రీమ్ సినిమాల్లో అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకో సినిమా అవకాశం వచ్చింది. షూట్ మొదలైన కొద్దిరోజులకే విద్యా బాలన్‌ను తప్పించారు. అలాగే ఇంకో సినిమా. ఇక దీంతో ఆమెకు ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర వేసేశారు. విద్యాబాలన్ హీరోయిన్గా ఎంపికైన సినిమాలు సెట్స్‌పైకి వెళ్లకముందే అనేక మలుపులు తిరుగుతున్నాయని, ఆమెను తీసుకుంటే బ్యాడ్‌లక్ అని ఎవ్వరూ అవకాశాలు కూడా ఇవ్వలేదు. దీంతో సౌత్ సినిమాలను వదిలేసి బాలీవుడ్ వెళ్లిపోయింది విద్యా! ఫీమేల్ హీరో! బాలీవుడ్‌కు వెళ్లిపోయాక విద్యాబాలన్ కెరీర్ మొదట్లో గొప్పగా ఏమీ లేదు. సినిమాలైతే వస్తున్నాయి. యాక్టింగ్ సూపర్ అంటున్నారు. కమర్షియల్ సక్సెస్ లేదు. కమర్షియల్ సక్సెస్ వచ్చినా క్రెడిట్ అంతా డైరెక్టర్, హీరోలకే వెళ్లిపోతోంది. అప్పుడే విద్యాబాలన్ కెరీర్లో ఓ టర్న్ తీసుకుంది. మామూలు టర్న్ కాదది. ‘ఫీమేల్ హీరో’ అనే ఒక బ్రాండ్‌ను తయారుచేసిన టర్న్. ‘పా’, ‘డర్టీ పిక్చర్’, ‘కహానీ’ లాంటి సినిమాలు వరుసపెట్టి చేసింది. అన్నీ సూపర్హిట్లే! హీరోయినే హీరో!! ఇటు యాక్టింగ్ పరంగా, అటు బాక్సాఫీస్ రిజల్ట్ పరంగా ఆమె సినిమాలు ఒక ఊపు ఊపుతున్నాయి. అవార్డులూ ఆమె అడ్రెస్ వెతుక్కొని మరీ ఆమెను వరించాయి. తాజాగా ‘తుమ్హారీ సులూ’తో తన బ్రాండ్‌ను మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది విద్యాబాలన్! కపుల్ గోల్స్.. విద్యాబాలన్, ఆమె భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ల జంట చూడముచ్చటగా ఉంటుంది. కపుల్గోల్స్గా చెప్పుకుంటారు వీళ్లిద్దరినీ. కెరీర్ పీక్స్‌లో ఉన్న రోజుల్లోనే విద్యా బాలన్ పెళ్లి చేసుకోవాలనుకుంది. పెళ్లయ్యాక తన కెరీర్‌కు అడ్డుచెప్పని వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంది. పరిస్థితులు అన్నీ ఎలా కుదిరాయో కానీ, విద్యా, సరిగ్గా అలాంటి ఆలోచనలున్న వ్యక్తి సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో ప్రేమలో పడిపోయింది. 2012లో వైభవంగా వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కూడా విద్యా బాలన్ నటనకు ఫుల్స్టాప్ పెట్టలేదు. ఇంకా చెప్పాలంటే ఈ ఐదేళ్లలో ఆమె తనను తాను మరింత కొత్తగా, ఫీమేల్ హీరోగా ఆవిష్కరించుకుంది. ‘ఎక్కడున్నారు ఇంకా?’ విద్యా బాలన్ నటనపై వచ్చిన విమర్శలు చాలా తక్కువ! ఆమె మీద వచ్చిన విమర్శలంటే అది బరువు పైనే!! ‘‘మీరు హీరోయిన్ ఓరియంటడ్ సినిమాలే చేస్తారా? బరువు తగ్గి గ్లామర్ పాత్రలు కూడా చేస్తారా?’’ అంటూ విద్యా బాలన్‌ను ఓ ప్రెస్మీట్లో మీడియా అడిగితే, ‘‘నేనిలాగే చాలా హ్యాపీగా ఉన్నా. హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలని ఎందుకనుకుంటారు? ఎక్కడున్నారు మీరింకా?’’ అంటూ సెటైర్ వేసింది. అదీ విద్యా బాలన్ స్టైల్.! హీరోయిన్‌కి బ్రాండ్‌ను తీసుకొచ్చిన స్టైల్!! -
కొత్త పాత్ర... సరికొత్త బాధ్యతలు
బాలీవుడ్ కథానాయిక విద్యాబాలన్ ఇప్పుడు బిజీ...బిజీ. ఇటీవలే శూజిత్ సర్కార్ దర్శకత్వంలో ‘తీన్’ చిత్రం షూటింగ్లో పాల్గొన్న విద్య తాజాగా సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో ‘కహానీ’ సీక్వెల్ ‘కహానీ-2’ సినిమాలో నటిస్తున్నారు. చేతిలో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న విద్య మూడో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ మూడో చిత్రంలో నటించడంతో పాటు నటీనటులను ఎంపిక చేసే బాధ్యతలో కూడా ఆమె పాలుపంచుకోవడం విశేషం. దాన్నిబట్టి ఈ చిత్రకథ విద్యాబాలన్ ఎంతగా నచ్చి ఉంటుందో ఊహించవచ్చు. బెంగాలీ చిత్రం ‘రాజ్ కాహినీ’కి ఇది రీమేక్. 1947లో జరిగిన బెంగాల్ విభజన నేపథ్యంలో 11 మంది మహిళల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. హిందీ రీమేక్‌కి ‘బేగమ్‌జాన్’ టైటిల్‌ను ఖరారు చేశారు. మాతృకను రూపొందించిన దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీయే హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తారు. మహేశ్‌భట్ ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో విద్య ఓ వ్యభిచార గృహ నిర్వాహకురాలిగా నటించనున్న సంగతి తెలిసిందే. బాగా నచ్చిన స్క్రిప్ట్ కావడంతో ఈ సినిమా నటీనటులను ఎంపిక చేసే విషయంలో సహకరిస్తానని దర్శక-నిర్మాతల దగ్గర విద్యా బాలన్ అన్నారట. సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో ఆమె చాలా తెలివిగా వ్యవహరిస్తారు. మరి.. తెలివితేటలున్న అమ్మాయి సహకరిస్తానంటే వద్దంటారా? ‘ఓ.. యస్’ అన్నారట. -
‘డెయిటీ’గా హాలీవుడ్‌కు ‘కహానీ’
న్యూఢిల్లీ: బాలీవుడ్లో విజయవంతమైన ‘కహానీ’ సినిమాను ‘డెయిటీ’ పేరుతో ఇంగ్లిష్‌లో రీమేక్ చేయనున్నట్లు సుప్రసిద్ధ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) శుక్రవారం ప్రకటించింది. కహానీ సినిమాలో విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషించగా, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. కాగా, దీన్ని ఇంగ్లిష్‌లో నీల్స్ ఆర్డెన్ ఓప్లెవ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు వైఆర్ఎఫ్ సన్నాహాలు చేస్తోంది. నీల్స్ ఇంతకుముందు‘ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. కాగా, ‘డైటీ’సినిమాలో ఒక అమెరికన్ యువతి తన భర్త కోసం ఇండియా వచ్చి కోల్‌కతాలో అన్వేషిస్తుంది. ఆమె నిజం తెలుసుకునేసరికి, తాను అపాయంలో చిక్కుకున్నట్లు అర్థమవుతుంది. ఆ పరిస్థితులనుంచి ఆమె ఎలా బయటపడింది.. అసలు ఆమె భర్త దొరికాడా.. లేదా అనే కథాంశంతో ఉత్కంఠభరితంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు వైఆర్ఎఫ్ వర్గాలు తెలిపాయి. 2015 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమా మొత్తం కోల్‌కతాలోనే షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఒప్లేవ్ మాట్లాడుతూ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. ఇందులోని ప్రతిపాత్రకు ప్రాధాన్యముంటుందన్నారు. దీనిలో భిన్న ధృవాలవంటి అమెరికన్ -ఇండియన్ సంస్కృతుల మధ్య వ్యత్యాసాన్ని, దాని వల్ల హీరోయిన్ ఎదుర్కొనే ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు తనదైన శైలిలో చూపించనున్నట్లు ఒప్లేవ్ వివరించారు. ఈ సినిమాలో కోల్‌కతా నగరాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ సీఈవో ఉదయ్ చోప్రా మాట్లాడుతూ..‘కహానీ’ చిత్రాన్ని ‘డెయిటీ’గా రీమేక్ చేయడానికి నీల్స్ మాత్రమే సమర్థుడని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా కోల్‌కతా నగరానికి ఈ సినిమాతో ఒక కొత్త గుర్తింపు తీసుకువచ్చేలా ఇప్పటివరకు ఎవరూ స్పృశించని ప్రాంతాల్లో నీల్స్ షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాడని చోప్రా తెలిపారు. తన సినిమా రీమేక్‌పై ఘోష్ మాట్లాడుతూ..‘కొంత కాలం కిందట ‘కహానీ’ని ఇంగ్లిష్‌లో రీమేక్ చేస్తానని ఉదయ్ చెబితే సరదాగా అంటున్నాడనుకున్నా కాని వాళ్లు ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నారని తెలిసి చాలా ఆనందించా.. నీల్స్ మంచి డెరైక్టర్. ప్రపంచ ప్రేక్షకులకు నచ్చేవిధంగా ‘కహానీ’ని మలిచే సామర్థ్యం అతడికి ఉంద..’ని కితాబు ఇచ్చాడు. -
డూప్ అవసరం లేదు...నేనే చేస్తాను!
వ్యక్తిగత జీవితాన్ని నయనతార ఈజీగా తీసుకుంటారని కొందరు అంటుంటారు. ఆమెపై వచ్చిన వివాదాలు అది నిజమని చెప్పకనే చెబుతాయి. కానీ వృత్తిపర జీవితం విషయంలో మాత్రం నయన చాలా స్ట్రిక్ట్. పాత్ర నచ్చితే... దాని కోసం ఎంతటి స్ట్రగుల్ అయినా.. అనుభవించడానికి సిద్ధంగా ఉంటారామె. ‘శ్రీరామరాజ్యం’లోని సీత పాత్రే అందుకు ఓ ఉదాహరణ. ఇక క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ కోసమైతే... కష్టపడి తెలుగు నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు నయన. అందుకే వివాదాలతో ప్రమేయం లేకుండా ప్రేక్షకా దరణ పొందుతున్నారు తను. ప్రస్తుతం తెలుగులో నయనతార నటిస్తున్న చిత్రం ‘అనామిక’. బాలీవుడ్ ‘కహానీ’ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోని ప్రతి సన్నివేశాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చేస్తున్నారట నయనతార. కథ రీత్యా ఇందులో కొన్ని రిస్కీ షాట్స్ చేయాలి. కొన్ని స్టంట్స్ కూడా ఉన్నాయట. డూప్‌ని పెట్టి లాగించేద్దాం శేఖర్ అనుకున్నా, ఆ అవకాశం ఆయనకివ్వలేదట నయనతార. ‘డూప్ అవసరం లేదు. నేనే చేస్తాను’ అని అలవోకగా రిస్కీ షాట్స్ చేసేసి, యూనిట్ సభ్యులను ఆశ్చర్యపరిచారట. అంతేకాదు.. ఎంతో ముచ్చటగా పెంచుకున్న చేతి గోళ్లను సైతం కత్తిరించుకున్నారట. వాస్తవానికి గోళ్లు కనిపించకుండా ఆ సన్నివేశాలు తీద్దామనుకున్న శేఖర్...నయనతార నెయిల్స్ కట్ చేసు కోవడంతో రిలీఫ్ అయ్యారట. -
విద్యా తల్లి కాబోతున్నారా?
అది ముంబయ్‌లోని అంధేరీలో గల ఓ ప్రముఖ ఆసుపత్రి. ఈ మధ్య అడపా దడపా విద్యాబాలన్ అక్కడకు వెళ్లడం పలువురి దృష్టిలో పడింది. ఆ మాత్రం చాలు ఊహాగానాలు చెయ్యడానికి. ఆస్పత్రికి సంబంధించిన షూటింగ్ చేస్తున్నారేమో అనుకోవడానికి లేదు. ఎందుకంటే, అక్కడ షూటింగ్ వాతావరణం ఏమీ లేదు. పైగా, విద్యా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ‘ఇక డౌటే లేదు.. విద్యా తల్లి కాబోతోంది’ అని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఒకవేళ ఆరోగ్యం బాగాలేక వెళ్లి ఉండొచ్చేమో అన్నది కొంతమంది అభిప్రాయం. కానీ, ఆమె తల్లి కాబోతున్నారనడానికి ఓ ఉదాహరణ చెబుతున్నారు కొంతమంది. 2012లో సిద్దార్ధ్‌రాయ్ కపూర్‌ని పెళ్లి చేసుకున్నారు విద్యా. ‘ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాను కాబట్టి.. మరో రెండేళ్ల తర్వాత, తమ కుటుంబంలోకి మూడో మెంబర్ని ఆహ్వానించాలనుకుంటున్నాను’ అని అప్పట్లో విద్యా తన సన్నిహితుల దగ్గర చెప్పారట. దాంతో, సిద్దార్ధ్, విద్యా తల్లిదండ్రులు కాబోతున్నారనే నిర్ధారణకు వచ్చారు. అది నిజమో కాదో గాసిప్పురాయుళ్లకు అవసరం లేదు కాబట్టి, అడగనివాళ్లకీ అడిగినవాళ్లకీ ఈ వార్తను చేరవేస్తున్నారు. కొంతమందైతే ఆస్పత్రిలో పనిచేసేవాళ్ల నుంచి విషయం రాబట్టడానికి ప్రయత్నాలు చేశారట. కానీ, విద్యా విజిట్ గురించి బయటకు చెప్పడానికి వీల్లేదనే హెచ్చరిక వారికి జారీ అయ్యిందని సమాచారం.ఆ మధ్య ‘కహానీ’ సినిమాలో విద్యాబాలన్ గర్భవతిగా నటించారు. ప్రస్తుతం నిజజీవితంలో ఆ పాత్రను జీవిస్తున్నారో లేదో విద్యా ప్రకటిస్తేనే తెలుస్తుంది. -
ఇవన్నీ నా ప్లస్ పాయింట్లే!
‘‘‘అనామిక’లో నటించడం నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి’’ అన్నారు అందాలతార నయనతార. నచ్చిన పాత్రలను ఎంచుకొని చేయడం వల్లే తన పనితీరులో నాణ్యత కనబడుతోందని ఆమె చెప్పారు. తమిళంలో ఆమె ‘రాజా-రాణి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడు కాంచిపురంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నయన అక్కడి మీడియాతో మాట్లాడుతూ -‘‘నలుగురిలో ఒకరిగా ఉండటం చిన్నప్పట్నుంచీ నాకు ఇష్టం ఉండేది కాదు. నాకంటూ ఓ గుర్తింపు కోసం ప్రయత్నించేదాన్ని. నన్ను ఈ రోజు ఈ స్థాయికి తెచ్చింది ఆ గుణమే. కథానాయికను అయ్యాక కూడా సాటి హీరోయిన్లకు భిన్నంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటా. అన్ని భాషల చిత్రాలూ చూస్తా. ఆయా సినిమాల్లో కథానాయికల నటనను పరిశీలిస్తా. వారికి భిన్నంగా నటించాలని తపిస్తా. ఇవన్నీ నాలోని ప్లస్ పాయింట్స్. నా కెరీర్లో కొన్ని ఊహించని పరిణామాలు ఎదురైనా... ఇప్పుడు మాత్రం నాకు నటన తప్ప వేరే ఆలోచన ఉండటం లేదు. అదే నాకు చక్కని ఫలితాన్నిస్తోంది. ప్రస్తుతం తెలుగులో ‘అనామిక’ చేస్తున్నాను. నటిగా నాకది ఛాలెంజింగ్ రోల్. నేను ‘కహాని’ సినిమా చూడలేదు. ఈ సినిమా ‘ఓకే’ చేశాక కూడా చూడలేదు. ‘అనామిక’ పూర్తయ్యే వరకూ చూడను కూడా. చూడకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఒకరి ప్రభావం నాపై పడటం నాకు ఇష్టం ఉండదు’’ అని చెప్పారు నయన.