విద్యాబాలన్
విద్యా తల్లి కాబోతున్నారా?
Published Thu, Feb 6 2014 12:12 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
అది ముంబయ్‌లోని అంధేరీలో గల ఓ ప్రముఖ ఆసుపత్రి. ఈ మధ్య అడపా దడపా విద్యాబాలన్ అక్కడకు వెళ్లడం పలువురి దృష్టిలో పడింది. ఆ మాత్రం చాలు ఊహాగానాలు చెయ్యడానికి. ఆస్పత్రికి సంబంధించిన షూటింగ్ చేస్తున్నారేమో అనుకోవడానికి లేదు. ఎందుకంటే, అక్కడ షూటింగ్ వాతావరణం ఏమీ లేదు. పైగా, విద్యా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ‘ఇక డౌటే లేదు.. విద్యా తల్లి కాబోతోంది’ అని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఒకవేళ ఆరోగ్యం బాగాలేక వెళ్లి ఉండొచ్చేమో అన్నది కొంతమంది అభిప్రాయం. కానీ, ఆమె తల్లి కాబోతున్నారనడానికి ఓ ఉదాహరణ చెబుతున్నారు కొంతమంది.
2012లో సిద్దార్ధ్‌రాయ్ కపూర్‌ని పెళ్లి చేసుకున్నారు విద్యా. ‘ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాను కాబట్టి.. మరో రెండేళ్ల తర్వాత, తమ కుటుంబంలోకి మూడో మెంబర్‌ని ఆహ్వానించాలనుకుంటున్నాను’ అని అప్పట్లో విద్యా తన సన్నిహితుల దగ్గర చెప్పారట. దాంతో, సిద్దార్ధ్, విద్యా తల్లిదండ్రులు కాబోతున్నారనే నిర్ధారణకు వచ్చారు. అది నిజమో కాదో గాసిప్పురాయుళ్లకు అవసరం లేదు కాబట్టి, అడగనివాళ్లకీ అడిగినవాళ్లకీ ఈ వార్తను చేరవేస్తున్నారు. కొంతమందైతే ఆస్పత్రిలో పనిచేసేవాళ్ల నుంచి విషయం రాబట్టడానికి ప్రయత్నాలు చేశారట. కానీ, విద్యా విజిట్ గురించి బయటకు చెప్పడానికి వీల్లేదనే హెచ్చరిక వారికి జారీ అయ్యిందని సమాచారం.ఆ మధ్య ‘కహానీ’ సినిమాలో విద్యాబాలన్ గర్భవతిగా నటించారు. ప్రస్తుతం నిజజీవితంలో ఆ పాత్రను జీవిస్తున్నారో లేదో విద్యా ప్రకటిస్తేనే తెలుస్తుంది.
Advertisement
Advertisement