అప్పుడే పిల్లల్ని కనాలనుకోవట్లేదు | Not starting a family right now, says Vidya Balan | Sakshi

అప్పుడే పిల్లల్ని కనాలనుకోవట్లేదు

Feb 15 2014 1:48 PM | Updated on Apr 3 2019 6:23 PM

అప్పుడే పిల్లల్ని కనాలనుకోవట్లేదు - Sakshi

అప్పుడే పిల్లల్ని కనాలనుకోవట్లేదు

ఇప్పటికప్పుడే పిల్లల్ని కనాలనే ఆలోచన తనకు ఏమాత్రం లేదని, ప్రస్తుతం తాను గర్భవతిని కూడా కానని బాలీవుడ్ నటి విద్యాబాలన్ స్పష్టం చేసింది.

ఇప్పటికప్పుడే పిల్లల్ని కనాలనే ఆలోచన తనకు ఏమాత్రం లేదని, ప్రస్తుతం తాను గర్భవతిని కూడా కానని బాలీవుడ్ నటి విద్యాబాలన్ స్పష్టం చేసింది. త్వరలో విడుదల కానున్న 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్' చిత్రం ప్రయోషన్ కోసం ఆమె ముంబై వచ్చింది. ఆ సందర్భంగా విలేకరులు ఆమెను పిల్లల గురించి అడిగారు. పిల్లల్ని ఎప్పుడు కనాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
 
''ఏదో ఒకరోజు తప్పకుండా మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతానేమో అనుకుంటున్నాను. కానీ ఇప్పటికప్పుడు మాత్రం నాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు'' అని విద్యాబాలన్ సమాధానం ఇచ్చింది. 2012 డిసెంబర్ నెలలో విద్యాబాలన్కు, యూటీవీ స్టూడియోస్ సీఈవో సిద్ధార్థ రాయ్ కపూర్కు పెళ్లయిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆమె గర్భవతి అయ్యిందన్న వదంతులు కూడా వ్యాపించాయి. అయితే అవన్నీ తప్పని తేలిపోయింది. ప్రస్తుతం అంతా ఆమె ఫర్హాన్ అక్తర్తో కలిసి నటించిన 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్' చిత్రం ప్రమోషన్ మీదనే దృష్టిపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement