కొత్త పాత్ర... సరికొత్త బాధ్యతలు | Vidya Balan to be involved in casting of Hindi remake of Bengali film | Sakshi
Sakshi News home page

కొత్త పాత్ర... సరికొత్త బాధ్యతలు

Published Wed, Mar 30 2016 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

కొత్త పాత్ర... సరికొత్త బాధ్యతలు

కొత్త పాత్ర... సరికొత్త బాధ్యతలు

 బాలీవుడ్ కథానాయిక విద్యాబాలన్  ఇప్పుడు బిజీ...బిజీ. ఇటీవలే శూజిత్ సర్కార్ దర్శకత్వంలో ‘తీన్’ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్న విద్య తాజాగా సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో ‘కహానీ’ సీక్వెల్ ‘కహానీ-2’ సినిమాలో నటిస్తున్నారు. చేతిలో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న విద్య మూడో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ మూడో చిత్రంలో నటించడంతో పాటు నటీనటులను ఎంపిక చేసే బాధ్యతలో కూడా ఆమె పాలుపంచుకోవడం విశేషం. దాన్నిబట్టి ఈ చిత్రకథ విద్యాబాలన్ ఎంతగా నచ్చి ఉంటుందో ఊహించవచ్చు.
 
  బెంగాలీ చిత్రం ‘రాజ్ కాహినీ’కి ఇది రీమేక్. 1947లో జరిగిన బెంగాల్ విభజన నేపథ్యంలో 11 మంది  మహిళల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. హిందీ రీమేక్‌కి ‘బేగమ్‌జాన్’ టైటిల్‌ను ఖరారు చేశారు. మాతృకను రూపొందించిన దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీయే హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తారు. మహేశ్‌భట్ ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో విద్య ఓ వ్యభిచార గృహ నిర్వాహకురాలిగా నటించనున్న సంగతి తెలిసిందే.
 
  బాగా నచ్చిన స్క్రిప్ట్ కావడంతో ఈ సినిమా నటీనటులను ఎంపిక  చేసే విషయంలో సహకరిస్తానని దర్శక-నిర్మాతల దగ్గర విద్యా బాలన్ అన్నారట. సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో ఆమె చాలా తెలివిగా వ్యవహరిస్తారు. మరి.. తెలివితేటలున్న అమ్మాయి సహకరిస్తానంటే వద్దంటారా? ‘ఓ.. యస్’ అన్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement