Sujoy Ghosh
-
ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చీఫ్ రాజీనామా
బాలీవుడ్ తెరపై మరో వివాదం మొదలైంది. ప్రస్తుతం ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ దర్శకుడు సుజోయ్ గోష్ తన పదవికి రాజీనామా చేశారు. ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించే సినిమాల ఎంపిక విషయంలో వచ్చిన బేధాభిప్రాయాల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 13 మంది సభ్యులతో కూడిన ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ ఎంపిక చేసిన సినిమాల జాభితా నుంచి మలయాళ సినిమా‘ఎస్ దుర్గ’, మరాఠి సినిమా ‘న్యూడ్’ లను సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ తొలగించింది. అందుకు నిరసనగా సుజోయ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ప్రదర్శనకు 5 మెయిన్‌స్ట్రీమ్ సినిమాలతో కలిపి మొత్తం 26 చిత్రాలను ఎంపిక చేశారు. -
8 ఏళ్ల నాటి మిస్టరీని తాత ఛేదిస్తాడా?
థ్రిల్లింగ్‌గా సాగిన 'తీన్' టీజర్ ఎనిమిదేళ్ల కిందట ఒకానొక రోజు తన మనవరాలు ఏంజెలా అదృశ్యమైంది. వృద్ధాప్యం మీద పడినా.. అంతుచిక్కని ఈ మిస్టరీని ఛేదించడానికి తాతా జాన్ బిశ్వాస్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. పోలీసు అధికారిణి, చర్చి ఫాదర్ ఆయనకు సహకరిస్తున్నారు. ఆ తాత ఈ మిస్టరీని ఛేదించాడా? ఈ మిస్టరీ తరహాలోనే తాజాగా వచ్చిపడిన సమస్య ఏమిటి? దీనిని ఈ ముగ్గురు ఎలా ఛేదించారు?.. స్థూలంగా ఇది 'తీన్' సినిమా ట్రైలర్.. అత్యంత గ్రిప్పింగ్‌గా, థ్రిల్లర్ మూవీ తరహాలో 'తీన్' సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రిబూ దాస్‌గుప్తా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రానికి నిర్మాత సుజయ్ ఘోష్. 'తీన్' సినిమాలో తాత పాత్రలో బిగ్ బీ, పోలీసు అధికారిణిగా విద్యా బాలన్, చర్చి ఫాదర్‌గా నవాజుద్దీన్ నటిస్తున్నారు. 2.23 నిమిషాల నిడివి ఉన్న 'తీన్' టీజర్.. క్రైమ్ థ్రిల్లర్ తరహాలో ఈ సినిమా ఉంటుందని చాటుతోంది. గతంలో విద్యాబాలన్, సుజయ్ ఘోష్ కలయికలో రూపొందిన 'కహానీ' ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. గ్రిప్పింగ్ టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన 'తీన్' సినిమా జూన్ 10న విడుదల కానుంది. -
కొత్త పాత్ర... సరికొత్త బాధ్యతలు
బాలీవుడ్ కథానాయిక విద్యాబాలన్ ఇప్పుడు బిజీ...బిజీ. ఇటీవలే శూజిత్ సర్కార్ దర్శకత్వంలో ‘తీన్’ చిత్రం షూటింగ్లో పాల్గొన్న విద్య తాజాగా సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో ‘కహానీ’ సీక్వెల్ ‘కహానీ-2’ సినిమాలో నటిస్తున్నారు. చేతిలో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న విద్య మూడో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ మూడో చిత్రంలో నటించడంతో పాటు నటీనటులను ఎంపిక చేసే బాధ్యతలో కూడా ఆమె పాలుపంచుకోవడం విశేషం. దాన్నిబట్టి ఈ చిత్రకథ విద్యాబాలన్ ఎంతగా నచ్చి ఉంటుందో ఊహించవచ్చు. బెంగాలీ చిత్రం ‘రాజ్ కాహినీ’కి ఇది రీమేక్. 1947లో జరిగిన బెంగాల్ విభజన నేపథ్యంలో 11 మంది మహిళల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. హిందీ రీమేక్‌కి ‘బేగమ్‌జాన్’ టైటిల్‌ను ఖరారు చేశారు. మాతృకను రూపొందించిన దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీయే హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తారు. మహేశ్‌భట్ ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో విద్య ఓ వ్యభిచార గృహ నిర్వాహకురాలిగా నటించనున్న సంగతి తెలిసిందే. బాగా నచ్చిన స్క్రిప్ట్ కావడంతో ఈ సినిమా నటీనటులను ఎంపిక చేసే విషయంలో సహకరిస్తానని దర్శక-నిర్మాతల దగ్గర విద్యా బాలన్ అన్నారట. సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో ఆమె చాలా తెలివిగా వ్యవహరిస్తారు. మరి.. తెలివితేటలున్న అమ్మాయి సహకరిస్తానంటే వద్దంటారా? ‘ఓ.. యస్’ అన్నారట. -
'అహల్య' అద్భుతం: అమితాబ్
దర్శకుడు సుజోయ్ ఘోష్ తీసిన 'అహల్య' షార్ట్ ఫిలింపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ షార్ట్ ఫిలింలో సౌమిత్ర చటర్జీ, రాధికా ఆప్టే నటించిన విషయం తెలిసిందే. 14 నిమిషాల 10 సెకండ్ల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిలిం.. పురాణాల్లోని అహల్య పాత్ర ఆధారంగా తీసినదే. 'షార్ట్ ఫిలింల మ్యాజిక్ అంటే ఇదే.. సుజోయ్ ఘోష్ అద్భుతం' అని అమితాబ్ ట్వీట్ చేశారు. దాంతోపాటు షార్ట్ ఫిలిం లింకు కూడా షేర్ చేశారు. దాంతో సంబరపడిపోయిన సుజోయ్ ఘోష్.. 'ఐ లవ్యూ సర్' అంటూ సమాధానం ఇచ్చాడు. T 1939 - https://t.co/Vf3X5ODTMW ... the magic of short films .. Sujoy Ghosh .. brilliant !! — Amitabh Bachchan (@SrBachchan) July 23, 2015 -
వేడెక్కించే... షార్ట్‌ఫిల్మ్‌లో రాధికా ఆప్టే
పోలీస్ ఆఫీసర్ ఏదో పని మీద ఓ ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఓ అందమైన అమ్మాయి తలుపు తీసింది. క్షణం పాటు అతనికి ప్రపంచం స్తంభించిపోయినట్టయింది. ఆ ఇంట్లో ఉన్న ఒక ముసలాయనతో మాట్లాడుతున్నాడు. అతను అక్కడ ఉన్నంతసేపు ఆమె తన చిలిపి చేష్టలతో కవ్విస్తూనే ఉంది. హఠాత్తుగా ఆ పోలీస్‌ను కౌగిలించుకోవడానికి సిద్ధపడుతోంది... ఈ దృశ్యాలన్నీ ‘అహల్య’ అనే బెంగాలీ లఘు చిత్రం ట్రైలర్లోవి. ఆ అందమైన యువతిగా నటించిన కథానాయిక - రాధికా ఆప్టే. ‘ధోని’,‘లెజెండ్’, ‘లయన్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రాధికా ఆప్టే ఇందులో చాలా సై్పసీగా నటించారు. విద్యాబాలన్‌తో ‘కహానీ’ చిత్రం తెరకెక్కించి అందరి ప్రశంసలూ అందుకున్న సుజయ్ ఘోష్ ఈ లఘు చిత్రానికి దర్శకుడు. మరి ఇలా విచిత్రంగా అంతుచిక్కని ప్రశ్నలా కనపడుతున్న ‘అహల్య’ ఎవరో ఏంటో... తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే! -
ఆ ఇద్దరు వదులుకున్న సినిమాలో కరీనా
ఇటీవలి కాలంలో హిందీ రంగంలో కథానాయిక ప్రాధాన్యంగా సాగే సినిమాలు ఎక్కువయ్యాయి. కహానీ, క్వీన్.. ఇలా ఈ మధ్య విడుదలైన లేడీ ఓరియంటెడ్ సినిమాలన్నీ ఘనవిజయాలు సాధించాయి. తాజాగా ‘కహానీ’ దర్శకుడు సుజయ్ ఘోష్ మరో కథానాయిక ప్రాధాన్యంగా సాగే సినిమా రూపొందించనున్నారు. పోలీసు అధికారి దుర్గా రాణీసింగ్ జీవితం ఆధారంగా ఆయన ఓ కథ తయారు చేశారు. ఈ సినిమాకి ఆమె పేరునే టైటిల్‌గా పెట్టారు. కాగా, తన ‘కహానీ’ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించిన విద్యాబాలన్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ కథ రాసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల విద్య ఈ చిత్రాన్ని తిరస్కరించారు. దాంతో ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో విజృంభిస్తున్న కంగనా రనౌత్‌ని అడిగారు సుజయ్. కంగనాకి కథ నచ్చింది కానీ, స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్‌లో చేరడానికి ముందే ప్లాన్ చేసుకోవడంవల్ల, ఆమె కూడా ఈ చిత్రాన్ని కాదనేశారు. ఆ తర్వాత సుజయ్ మనసులో మెదిలిన నాయిక కరీనాకపూర్. ఈ సినిమా కోసం ఆమెను సంప్రదించారట. ’కహనీ’ లాంటి మంచి చిత్రాన్ని అందించిన సుజయ్‌తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నా, ఇద్దరు నాయికలు వదులుకున్న సినిమాను తను అంగీకరించాలా? లేదా? అనే ఆలోచనలో పడ్డారట కరీనా. చివరికి ఇలాంటి మంచి సినిమాను వదులుకుంటే, భవిష్యత్తులో మళ్లీ అవకాశం రాదేమోనని భావించి ‘దుర్గా రాణీసింగ్’గా చేయడానికి పచ్చజెండా ఊపేశారు. -
టీనేజ్ గాళ్‌కు తల్లిగా...!
చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లి పాత్రలు చేయడానికి కథానాయికలు దాదాపు ఇష్టపడరు. కంగనా రనౌత్ కూడా నిన్న మొన్నటి వరకు ఈ తరహా పాత్రలకు ‘నో’ చెప్పారు. కానీ, ఇప్పుడు ఆమె మనసు మారింది. ఆర్టిస్ట్ అన్న తర్వాత ఎలాంటి పాత్రైనా చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే తల్లి పాత్రకు పచ్చజెండా ఊపేశారు. పైగా, టీనేజ్ గాళ్‌కి తల్లిగా. కంగన వయసు 27 ఏళ్లు. ఈ చిత్రంలో ఆమె 35 ఏళ్ల మహిళగా కనిపించనున్నారు. అదొక సవాల్ అయితే, టీనేజ్ కూతురికి తల్లిగా ఒదిగిపోవడం మరో సవాల్ అని చెప్పాలి. ‘కహానీ’ దర్శకుడు సుజోయ్ ఘోష్ నిర్దేశకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘కహనీ’లో అద్భుతంగా నటించిన విద్యాబాలన్‌నే ఈ సినిమాకూ తీసుకోవాలనుకున్నారు. అయితే, ఆమె గర్భవతి అన్న వార్త రావడం కారణంగానో ఏమో, కంగనను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి ‘దుర్గారాణీ సింగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవల విడుదలైన ‘క్వీన్’లో అద్భుతంగా నటించి, అందరి మన్ననలు పొందిన కంగన, ‘దుర్గా...’లో కూడా తన నట విశ్వరూపాన్ని చూపించాలనుకుంటున్నారట. త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.