టీనేజ్ గాళ్‌కు తల్లిగా...! | From Queen To Mother: Kangana Ranaut's Next | Sakshi
Sakshi News home page

టీనేజ్ గాళ్‌కు తల్లిగా...!

Published Mon, Mar 31 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM

టీనేజ్ గాళ్‌కు తల్లిగా...!

టీనేజ్ గాళ్‌కు తల్లిగా...!

చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లి పాత్రలు చేయడానికి కథానాయికలు దాదాపు ఇష్టపడరు. కంగనా రనౌత్ కూడా నిన్న మొన్నటి వరకు ఈ తరహా పాత్రలకు ‘నో’ చెప్పారు. కానీ, ఇప్పుడు ఆమె మనసు మారింది. ఆర్టిస్ట్ అన్న తర్వాత ఎలాంటి పాత్రైనా చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే తల్లి పాత్రకు పచ్చజెండా ఊపేశారు. పైగా, టీనేజ్ గాళ్‌కి తల్లిగా. కంగన వయసు 27 ఏళ్లు. ఈ చిత్రంలో ఆమె 35 ఏళ్ల మహిళగా కనిపించనున్నారు.
 
  అదొక సవాల్ అయితే, టీనేజ్ కూతురికి తల్లిగా ఒదిగిపోవడం మరో సవాల్ అని చెప్పాలి. ‘కహానీ’ దర్శకుడు సుజోయ్ ఘోష్ నిర్దేశకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘కహనీ’లో అద్భుతంగా నటించిన విద్యాబాలన్‌నే ఈ సినిమాకూ తీసుకోవాలనుకున్నారు. అయితే, ఆమె గర్భవతి అన్న వార్త రావడం కారణంగానో ఏమో, కంగనను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి ‘దుర్గారాణీ సింగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవల విడుదలైన ‘క్వీన్’లో అద్భుతంగా నటించి, అందరి మన్ననలు పొందిన కంగన, ‘దుర్గా...’లో కూడా తన నట విశ్వరూపాన్ని చూపించాలనుకుంటున్నారట. త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement