వేడెక్కించే... షార్ట్‌ఫిల్మ్‌లో రాధికా ఆప్టే | Sujoy Ghosh treats Radhika Apte to Bengali delicacies while shooting in Kolkata | Sakshi
Sakshi News home page

వేడెక్కించే... షార్ట్‌ఫిల్మ్‌లో రాధికా ఆప్టే

Published Tue, Jul 14 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM

వేడెక్కించే... షార్ట్‌ఫిల్మ్‌లో రాధికా ఆప్టే

వేడెక్కించే... షార్ట్‌ఫిల్మ్‌లో రాధికా ఆప్టే

పోలీస్ ఆఫీసర్ ఏదో పని మీద ఓ ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఓ అందమైన అమ్మాయి తలుపు తీసింది. క్షణం పాటు అతనికి ప్రపంచం స్తంభించిపోయినట్టయింది. ఆ ఇంట్లో ఉన్న ఒక ముసలాయనతో మాట్లాడుతున్నాడు. అతను అక్కడ ఉన్నంతసేపు ఆమె తన చిలిపి చేష్టలతో కవ్విస్తూనే ఉంది. హఠాత్తుగా ఆ పోలీస్‌ను కౌగిలించుకోవడానికి సిద్ధపడుతోంది... ఈ దృశ్యాలన్నీ ‘అహల్య’ అనే బెంగాలీ లఘు చిత్రం ట్రైలర్‌లోవి.

ఆ అందమైన యువతిగా నటించిన కథానాయిక - రాధికా ఆప్టే. ‘ధోని’,‘లెజెండ్’, ‘లయన్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రాధికా ఆప్టే ఇందులో చాలా సై్పసీగా నటించారు. విద్యాబాలన్‌తో ‘కహానీ’ చిత్రం తెరకెక్కించి అందరి ప్రశంసలూ అందుకున్న సుజయ్ ఘోష్ ఈ లఘు చిత్రానికి దర్శకుడు. మరి ఇలా విచిత్రంగా అంతుచిక్కని ప్రశ్నలా కనపడుతున్న ‘అహల్య’ ఎవరో ఏంటో... తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement