నీ అలవాటు గురించి నీకు తెలుసా.. సారీ! | Radhika Apte Directorial Debut Sleepwalkers Teaser Out | Sakshi
Sakshi News home page

డైరెక్టర్‌గా రాధికా ఆప్టే.. ‘స్లీప్‌వాకర్స్‌ ’ టీజర్‌!

Published Sat, Jun 6 2020 5:47 PM | Last Updated on Sat, Jun 6 2020 6:59 PM

Radhika Apte Directorial Debut Sleepwalkers Teaser Out - Sakshi

ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టు​కుంటూ బోల్డ్‌ నటిగా పేరు తెచ్చుకున్నారు రాధికా ఆప్టే. ప్రస్తుతం తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. స్టార్ట్‌.. కెమెరా... యాక్షన్‌ అంటూ ‘స్లీప్‌ వాకర్స్‌’ అనే షార్ట్‌ ఫిలిం కోసం దర్శకురాలి అవతారం ఎత్తారు. షహానా గోస్వామి, గుల్షన్‌ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిన్న సినిమా టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ‘‘ఇదిగో మా టీజర్‌ ట్రైలర్‌’’అంటూ రాధిక ఇన్‌స్టాలో వీడియోను షేర్‌ చేశారు.

గర్భవతి అయిన భార్య, భర్తల మధ్య జరిగే సంభాషణతో టీజర్‌ ఆసక్తికరంగా సాగింది. నిద్రలో నడిచే నీ అలవాటు గురించి నీకు తెలుసా అని గుల్షన్‌.. షహానాను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదంటూ ఆమె కొట్టిపారేస్తుంది. అయితే ప్రతిరోజూ.. రాత్రి కాగానే ఓ బాలిక వాళ్లింటికి రావడం.. ఆమెతో కలిసి షహానా బీచ్‌కు వెళ్లడం.. అక్కడి నుంచి ఆ బాలిక తనను సముద్రంలోకి తీసుకువెళ్లడం వంటి దృశ్యాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక టీజర్‌ చివరలో.. షహానా ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టి.. ‘‘ఐ యామ్‌ సారీ’’ అంటూ గుల్షన్‌ ఆమెను చిత్రహింసలకు గురిచేసే విజువల్‌ ఒకింత భయానకంగా ఉంది. కాగా టీజర్‌పై స్పందించిన నెటిజన్లు.. ‘‘మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం’’ అంటూ రాధికపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement