8 ఏళ్ల నాటి మిస్టరీని తాత ఛేదిస్తాడా? | The Gripping Trailer of Big B, Vidya Starrer TE3N | Sakshi
Sakshi News home page

8 ఏళ్ల నాటి మిస్టరీని తాత ఛేదిస్తాడా?

Published Thu, May 5 2016 5:23 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

The Gripping Trailer of Big B, Vidya Starrer TE3N

థ్రిల్లింగ్గా సాగిన 'తీన్' టీజర్‌

ఎనిమిదేళ్ల కిందట ఒకానొక రోజు తన మనవరాలు ఏంజెలా అదృశ్యమైంది. వృద్ధాప్యం మీద పడినా.. అంతుచిక్కని ఈ మిస్టరీని ఛేదించడానికి తాతా జాన్ బిశ్వాస్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. పోలీసు అధికారిణి, చర్చి ఫాదర్ ఆయనకు సహకరిస్తున్నారు. ఆ తాత ఈ మిస్టరీని ఛేదించాడా? ఈ మిస్టరీ తరహాలోనే తాజాగా వచ్చిపడిన సమస్య ఏమిటి? దీనిని ఈ ముగ్గురు ఎలా ఛేదించారు?.. స్థూలంగా ఇది 'తీన్‌' సినిమా ట్రైలర్‌.. అత్యంత గ్రిప్పింగ్‌గా, థ్రిల్లర్‌ మూవీ తరహాలో 'తీన్‌' సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్రయూనిట్‌ విడుదల చేసింది.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్‌, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రిబూ దాస్‌గుప్తా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రానికి నిర్మాత సుజయ్‌ ఘోష్‌. 'తీన్‌' సినిమాలో తాత పాత్రలో బిగ్‌ బీ, పోలీసు అధికారిణిగా విద్యా బాలన్, చర్చి ఫాదర్‌గా నవాజుద్దీన్‌ నటిస్తున్నారు. 2.23 నిమిషాల నిడివి ఉన్న 'తీన్‌' టీజర్‌.. క్రైమ్‌ థ్రిల్లర్ తరహాలో ఈ సినిమా ఉంటుందని చాటుతోంది. గతంలో విద్యాబాలన్‌, సుజయ్‌ ఘోష్ కలయికలో రూపొందిన 'కహానీ' ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. గ్రిప్పింగ్ టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన 'తీన్‌' సినిమా జూన్ 10న విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement