లవ్‌ స్టోరీ మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌కి అతిథిగా సుకుమార్‌? | Nag And Sukumar For Love Storys Magical Success meet in Hyderabad | Sakshi
Sakshi News home page

Love story Movie: లవ్‌ స్టోరీ మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌కి అతిథిగా సుకుమార్‌?

Published Tue, Sep 28 2021 1:20 PM | Last Updated on Tue, Sep 28 2021 1:41 PM

Nag And Sukumar For Love Storys Magical Success meet in Hyderabad - Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం విడుదలై మంచి విజయం సాధించింది ‘లవ్‌స్టోరీ’. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఈ చిత్రానికి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికాలో సైతం రికార్డులను తిరగరాస్తోంది.

అయితే ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. ఇందులో భాగంగా  మంగళవారం (సెప్టెంబర్‌ 28న) మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌లో జరిగే ఈ కార్య్రమానికి హీరో నాగార్జునతోపాటు స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారని తెలుస్తోంది. అయితే విడుదలకు ముందే ఎంతో బజ్‌ క్రియేట్‌ చేసుకున్న ఈ మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ భారీగానే జరిగింది. కాగా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ రూ. 50 కోట్ల మార్క్‌ దగ్గర ఉన్నట్లు సమాచారం. కాగా సుకుమార్‌, నాగచైతన్య కలిసి ‘100% లవ్‌’ మూవీ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.

చదవండి: చైతూకి గేమ్‌ చేంజర్‌..ఆమెకు ఎముకలు ఉన్నాయా'?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement