తెలంగాణ నేపథ్యంలో... | Bilalpur Police Station intriguing first look launched by Sekhar Kammula | Sakshi
Sakshi News home page

తెలంగాణ నేపథ్యంలో...

Published Mon, Jul 23 2018 1:02 AM | Last Updated on Mon, Jul 23 2018 1:02 AM

Bilalpur Police Station intriguing first look launched by Sekhar Kammula - Sakshi

శ్రీనివాసులు , శేఖర్‌ కమ్ముల, నాగ సాయి, శ్రీనాథ్‌

‘‘బిలాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌’ ఫస్ట్‌లుక్‌ చాలా కొత్తగా ఉంది. సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. పోస్టర్‌లో ఉన్న కొత్తదనం సినిమాలో కూడా ఉంటుందనుకుంటున్నా’’ అని దర్శకుడు శేఖర్‌ కమ్ముల అన్నారు. శ్రీనాథ్‌ మాగంటి, మేఘనా జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌’.

‘జగ్గిలొల్లి’ అన్నది ఉపశీర్షిక. ఎంఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై మహంకాళి శ్రీనివాసులు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను శేఖర్‌ కమ్ముల రిలీజ్‌ చేశారు. నిర్మాత శ్రీనివాసులు మాట్లాడుతూ– ‘‘తెలంగాణ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇదొక వినూత్న ప్రయత్నం. మా టీమ్‌ని శేఖర్‌ కమ్ములగారు అభినందించడం చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘వాస్తవ సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం. కథ, కథనాలు ఆకట్టుకునేలా ఉంటాయి. గాయకుడు గోరటి వెంకన్న ప్రధాన పాత్రలో కనిపిస్తారు’’ అన్నారు నాగసాయి. ఈ చిత్రానికి సంగీతం:  సాబూ వర్గీస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement