Srinath Maganti
-
ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు
‘‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ పోస్టర్, ట్రైలర్ బాగున్నాయి. ‘1 నేనొక్కడినే, 100%లవ్’ చిత్రాలకు కథ అందించిన హరి ప్రసాద్ ఈ సినిమాకు స్టోరీ అందించారంటే కథ ఎలా ఉంటుందో తెలుస్తోంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. సంజయ్ ఇదామ, శ్రీనాధ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ ముఖ్య తారలుగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని సుకుమార్ విడుదల చేశారు. బి.ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘మంచి సందేశం ఉన్న కథతో తీశాం. డబ్బు వస్తుందా? లేదా? అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశాననే సంతృప్తి ఉంది’’ అన్నారు. ‘‘ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని మా సినిమాలో చెప్పాం’’ అన్నారు కరుణ కుమార్. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్.కిషోర్, కెమెరా: సునీల్ కుమార్.ఎ¯Œ . -
తెలంగాణ నేపథ్యంలో...
‘‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్’ ఫస్ట్‌లుక్ చాలా కొత్తగా ఉంది. సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. పోస్టర్లో ఉన్న కొత్తదనం సినిమాలో కూడా ఉంటుందనుకుంటున్నా’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. శ్రీనాథ్ మాగంటి, మేఘనా జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్’. ‘జగ్గిలొల్లి’ అన్నది ఉపశీర్షిక. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాసులు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. నిర్మాత శ్రీనివాసులు మాట్లాడుతూ– ‘‘తెలంగాణ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇదొక వినూత్న ప్రయత్నం. మా టీమ్‌ని శేఖర్ కమ్ములగారు అభినందించడం చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘వాస్తవ సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం. కథ, కథనాలు ఆకట్టుకునేలా ఉంటాయి. గాయకుడు గోరటి వెంకన్న ప్రధాన పాత్రలో కనిపిస్తారు’’ అన్నారు నాగసాయి. ఈ చిత్రానికి సంగీతం: సాబూ వర్గీస్. -
హర్రర్ కామెడీగా 'ఇదేం దెయ్యం'
ఏ.వి రమణమూర్తి సమర్పణలో చిన్మయానంద ఫిల్మ్స్ పతాకంపై ఎస్. సరిత నిర్మిస్తోన్న చిత్రం 'ఇదేం దెయ్యం'. శ్రీనాధ్ మాగంటి హీరోగా పరిచయం అవుతున్నాడు. సాక్షి కక్కర్ , రచన స్మిత్, రుచి పాండే నాయికలు. రచ్చ రవి, కిరాక్ ఆర్.పి కీలక పాత్రధారులు. వి. రవివర్మ దర్శకత్వం వహించగా, బాలు స్వామి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ముఖ్య అతిధులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ సీడీలను ఆవిష్కరించి యూనిట్ సభ్యులకు అందజేశారు. ఇటీవల వెండితెర మీద సక్సెస్ ఫార్ములాగా పేరు తెచ్చుకున్న హర్రర్ కామెడీ జానర్ లోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు సాగర్, తుమ్మలపల్లి రామసత్యానారాయణ, సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.