బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘టైసన్ నాయుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమా నిర్మిస్తున్నారు. బుధవారం (జనవరి 3న) సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ‘టైసన్ నాయుడు’గా ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.
సాయి శ్రీనివాస్‌ను బాక్సింగ్ లెజెండ్ మైక్‌టైసన్ అభిమానిగా ఈ చిత్రం వీడియో గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యునిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘టైసన్ నాయుడు’. సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని మాస్, యాక్షన్ అవతార్‌లో చూపిస్తున్నారు సాగర్ కె. చంద్ర. హై బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ముఖేష్ జ్ఞానేష్, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: హరీష్ కట్టా.
Comments
Please login to add a commentAdd a comment