రజనీకాంత్‌ కళుగు? | Lokesh Kanagaraj and Rajinikanth In Conflict For Kazhugu | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ కళుగు?

Published Thu, Apr 4 2024 4:57 AM | Last Updated on Thu, Apr 4 2024 11:56 AM

Lokesh Kanagaraj and Rajinikanth In Conflict For Kazhugu - Sakshi

రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ను ఈ నెల 22న అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్‌. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌ ఇదేనంటూ పలు పేర్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాకు ‘కళుగు’ (తెలుగులో ‘గద్ద’ అని అర్థం) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. మరి... ఇదే టైటిల్‌ ఖరారు అవుతుందా? లేక మరో టైటిల్‌ ఫిక్స్‌ అవుతుందా అనేది తెలియాలంటే ఈ నెల 22 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌ చివర్లో లేదా జూలై మొదటి వారంలో ్ర΄ారంభం కానుందని తెలిసింది. గోల్డ్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement