రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ టీజర్‌ను ఏప్రిల్ 22న రిలీజ్ చేయన్నుట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జూన్‌లో చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు.
ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ సమాచారం. ఇక ప్రస్తుతం ‘వేట్టయాన్’ సినిమాతో బిజీగా ఉన్నారు రజనీకాంత్. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment