నిఖిల్‌ స్వయంభూ | Nikhil new film Swayambhu First Look Release | Sakshi
Sakshi News home page

నిఖిల్‌ స్వయంభూ

Published Fri, Jun 2 2023 12:15 AM | Last Updated on Fri, Jun 2 2023 5:29 AM

Nikhil new film Swayambhu First Look Release - Sakshi

నిఖిల్‌

నిఖిల్‌ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘స్వయంభూ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. గురువారం (జూన్‌ 1) నిఖిల్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ నిర్మించనున్నారు. ‘‘నిఖిల్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఆగస్టులో షూటింగ్‌ ఆరంభిస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

ఈ చిత్రానికి సహనిర్మాతలు: విజయ్‌ కామిశెట్టి, జీటీ ఆనంద్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్‌ పరమహంస.  ఇంకా.. నిఖిల్‌ బర్త్‌ డే సందర్భంగా వేరే చిత్రాల అప్‌డేట్స్‌ కూడా వచ్చాయి. నిఖిల్‌తో ‘స్వామి రారా’, ‘కేశవ’ చిత్రాల తర్వాత దర్శకుడు సుధీర్‌ వర్మ మరో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్నారు. అలాగే ‘ది ఇండియా హౌస్‌’ అనే మరో సినిమా కమిటయ్యారు నిఖిల్‌. ఇక నిఖిల్‌ హీరోగా నటించిన ‘స్పై’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement