ఫ్యాన్స్‌కు హీరో నిఖిల్ సర్‌ప్రైజ్‌.. ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి? | Tollywood Hero Nikhil Latest Movie Title Revealed | Sakshi
Sakshi News home page

Nikhil: స్వయంభూ కంటే ముందే వచ్చేస్తోన్న నిఖిల్.. షాక్‌లో ఫ్యాన్స్‌!

Published Sun, Oct 6 2024 1:58 PM | Last Updated on Mon, Oct 7 2024 4:56 PM

Tollywood Hero Nikhil Latest Movie Title Revealed

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి  భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

అయితే ఈ సినిమా లైన్‌లో ఉండగానే ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు హీరో నిఖిల్. ఈ దీపావళికి థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తున్నాడు. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న మూవీ టైటిల్‌ను మేకర్స్ రివీల్‌ చేశారు. ఎలాంటి ప్రకటన లేకుండానే డైరెక్ట్‌గా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైందంటూ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా దీపావళికి థియేటర్లలో అలరించేందుకు యంగ్ హీరో నిఖిల్‌ రానుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

(ఇది చదవండి: స్వయంభూ సెట్‌లో నిఖిల్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌..)

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‍శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement