ప్రభాస్-మారుతి క్రేజీ కాంబో.. టైటిల్‌ అదిరిపోయిందిగా! | Prabhas-Maruti Movie Title Revealed On The Occassion of Pongal - Sakshi

Prabhas -Maruti Movie : ప్రభాస్-మారుతి మూవీ.. ఎప్పుడు చూడని విధంగా ప్రభాస్ లుక్!

Jan 15 2024 7:48 AM | Updated on Jan 15 2024 12:52 PM

Prabhas Maruti Movie Title Revealed Today On This Pongal Occassion - Sakshi

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. క్రేజీ డైరెక్టర్‌ మారుతితో జతకడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే సలార్‌తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన రెబల్ స్టార్‌ మరో చిత్రానికి రెడీ అయిపోయారు. తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్‌ రివీల్‌ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. 

ప్రభాస్- మారుతి కొత్త చిత్రానికి 'ది రాజాసాబ్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. రెబల్ స్టార్ కొత్త లుక్‌లో కనిపించడంతో  ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో "రాజా సాబ్" సినిమాను  రూపొందిస్తుండటంతో అందరిలో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ప్రభాస్‌ మరోవైపు కల్కి అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. 

కాగా.. దర్శకుడు మారుతి గతంలో "భలే భలే మగాడివోయ్", "మహానుభావుడు", "ప్రతి రోజు పండగే" వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను కొత్తగా సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకం అందరిలో ఏర్పడుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్  ప్రభాస్‌ను ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో అలా "రాజా సాబ్" మూవీని మారుతి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ది "రాజా సాబ్" పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement