Prabhas New Look: ప్రభాస్ లేటేస్ట్‌ లుక్‌.. వీడియో చూశారా? | Rebel Star Prabhas Latest Look In The Sets Of Raja Saab Movie, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Prabhas Latest Look Viral: ప్రభాస్ లేటేస్ట్‌ లుక్‌ వైరల్.. వీడియో చూశారా?

Published Thu, Apr 18 2024 12:03 PM | Last Updated on Thu, Apr 18 2024 12:26 PM

Rebal Star Prabhas latest Look On The Raja Saab Movie Sets - Sakshi

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్‌ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారని చిత్రి యూనిట్‌ ఇప్పటికే ప్రకటించింది. కానీ పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌ కనిపిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. సి. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కావాల్సింది. ఆ సమయంలో ఎన్నికల కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ప్రభాస్ మరో చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో ది రాజాసాబ్‌ మూవీ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్‌కు ది రాజాసాబ్‌ సెట్స్‌లో అడుగుపెట్టారు. సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రభాస్ సరికొత్త హెయిర్‌ కట్ లుక్‌లో కనిపించారు. ఇది చూసిన అభిమానులు రెబల్‌ స్టార్‌పై క్రేజీ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రబాస్ మిర్చి సినిమాలో లాగా స్టైలిష్‌గా ఉన్నారంటూ పోస్టులు పెడుతున్నారు. లాంగ్ హెయిర్‌, గడ్డంతో సరికొత్త  వింటేజ్‌  లుక్‌లో ప్రభాస్ సందడి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement