హనుమాన్ హీరో కొత్త మూవీ.. గ్లింప్స్‌ చూస్తే గూస్‌బంప్సే! | Hanu Man Movie Fame Teja Sajja Latest Movie Mirai Movie Title Glimpse Video Trending On Social Media - Sakshi
Sakshi News home page

Teja Sajja Mirai Title Glimpse Video: హనుమాన్ హీరో క్రేజీ ప్రాజెక్ట్‌ .. గ్లింప్స్‌ చూశారా!

Published Thu, Apr 18 2024 12:41 PM | Last Updated on Thu, Apr 18 2024 1:26 PM

Hanu Man Movie Fame Teja Sajja Latest Movie Title Announced - Sakshi

హనుమాన్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా. ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్‌ దక్కించుకున్నారు. తేజ మరో హిస్టారికల్‌ మూవీ చేసేందుకు రెడీ అయిపోయారు.  తేజ సజ్జాకు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన రవితేజతో ఈగల్‌ మూవీని తెరకెక్కించారు.  తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు గ్లింప్స్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్ చేశారు. హైదరాబాగ్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో టైటిల్‌ రివీల్ చేశారు. 

తేజ సజ్జా తాజా చిత్రానికి మిరాయి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో తేజ సూపర్‌యోధ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్‌లో కనిపించారు.  బద్దలయ్యే అగ్నిపర్వతం పైన నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అశోకుని కాలంలో జరిగిన కళింగ యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్ల్‌ చూస్తే అర్థమవుతోంది. మిరాయి సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీతో పాటు చైనీస్ భాషల్లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న  విడుదల చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement