karthik ghattamaneni
-
హనుమాన్ హీరో యాక్షన్ అడ్వెంచర్.. రిలీజ్ డేట్ ఇదే!
హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న హీరో తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద రాణించింది. అయితే తేజ సజ్జా ప్రస్తుతం మరో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం మిరాయి. ఇవాళ తేజ బర్త్ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ఘట్టంనేని కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మిరాయి గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాగా.. ఈ మూవీని ఎనిమిది భాషల్లో ఏప్రిల్ 18, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి గౌరహరి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, రితికా నాయక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. Strap in for an adrenaline ride 😎The #SuperYodha is born 🥷⚡Team #MIRAI ⚔️ wishes the SUPER HERO, @tejasajja123 a very splendid birthday ❤️🔥Get ready to experience the Action-Adventure in cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥#HBDTejaSajja @HeroManoj1 @Karthik_gatta… pic.twitter.com/DXvScUy0DP— People Media Factory (@peoplemediafcy) August 23, 2024 -
హనుమాన్ హీరో కొత్త మూవీ.. గ్లింప్స్ చూస్తే గూస్‌బంప్సే!
హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా. ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్నారు. తేజ మరో హిస్టారికల్ మూవీ చేసేందుకు రెడీ అయిపోయారు. తేజ సజ్జాకు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన రవితేజతో ఈగల్ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. హైదరాబాగ్లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో టైటిల్ రివీల్ చేశారు. తేజ సజ్జా తాజా చిత్రానికి మిరాయి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో తేజ సూపర్‌యోధ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్‌లో కనిపించారు. బద్దలయ్యే అగ్నిపర్వతం పైన నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అశోకుని కాలంలో జరిగిన కళింగ యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్ల్ చూస్తే అర్థమవుతోంది. మిరాయి సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీతో పాటు చైనీస్ భాషల్లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. From the hush of ancient narratives📜 Comes a thrilling adventurous saga of a #SuperYodha 🥷⚔️#PMF36 x #TejaSajja6 Titled as #𝐌𝐈𝐑𝐀𝐈 ⚔️#MIRAITitleGlimpse out now💥 -- https://t.co/k4tycunRkA In Cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥 SuperHero @tejasajja123… pic.twitter.com/WN2MB2EPlE — People Media Factory (@peoplemediafcy) April 18, 2024 -
Teja Sajja: ‘సూపర్ యోధ’గా ‘హను-మాన్’ హీరో
‘హను–మాన్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో తేజ సజ్జా. తాజాగా ఆయన కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రకటించి, పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ‘హను–మాన్’ చిత్రంలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తేజ.. కొత్త పోస్టర్లో స్టైలిష్ మేకోవర్‌లో కనిపించారు. ‘‘సూపర్ యోధ సాహసోపేతమైన కథతో పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కనుంది. ‘ఈగల్’ తర్వాత కార్తీక్ ఘట్టమనేనితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఈ సినిమా పూర్తి వివరాలను ఈ నెల 18న ప్రకటిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్డ్యూసర్: కృతీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి. Wishing my Super Hero @TejaSajja123 Super talented @Karthik_gatta & Super passionate @vishwaprasadtg garu all the best for #PMF36 🤗 Title Announcement Glimpse on 𝗔𝗣𝗥𝗜𝗟 𝟭𝟴𝘁𝗵 #SuperYodha 🥷 pic.twitter.com/aOqpz1z08E — Prasanth Varma (@PrasanthVarma) April 15, 2024 -
ఈగల్ కథ వినగానే చేసేద్దాం అన్నారు
‘‘ఈగల్’ కాన్సెప్ట్‌లోనే విధ్వంసం ఉంది. అయితే హీరో చేసే విధ్వంసం సమాజం కోసమే. అది ఏంటి? అనేది ప్రేక్షకులకు ఇవాళ తెలిసిపోతుంది. ఈ సినిమాలో పత్తి రైతు పాత్ర చేశారు రవితేజగారు. అయితే ఆయన పోరాడే సమస్య అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. మనకి కూడా దగ్గరగా ఉంటుంది. ‘రాంబో, టెర్మినేటర్’ లాంటి హాలీవుడ్ సినిమాలని చాలా ఎంజాయ్ చేస్తాం. అలాంటి సినిమాలు తీసుకు రావాలనే ప్రయత్నమే ‘ఈగల్’. అద్భుతమైన యాక్షన్, డ్రామా, ఎంటర్టైన్మెంట్ ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని అన్నారు. రవితేజ హీరోగా, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ‘ఈగల్’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► దర్శకునిగా నా తొలి సినిమా నిఖిల్‌తో ‘సూర్య వర్సెస్ సూర్య’ చేశాను. ఆ తర్వాత మళ్లీ కెమెరామేన్‌గా బిజీ అయిపోవడంతో దర్శకునిగా వెంట వెంటనే సినిమాలు చేయలేకపోయాను. రవితేజగారి ‘ధమాకా’ సినిమాకి కెమెరామేన్‌గా చేశాను. ఆ సమయంలో ‘ఈగల్’ కథ ఆయనకి చెప్పాను. వినగానే.. ‘ఇది మంచి కమర్షియల్ సినిమా.. చేసేద్దాం’ అన్నారు రవితేజగారు. దర్శకునిగా ‘ఈగల్’ నా రెండో సినిమా. ముందు నుంచీ యాక్షన్ సినిమాలు చేయడం నాకు ఇష్టం. అయితే కెరీర్ బిగినింగ్‌లో కొన్ని పరిమితులుంటాయి. ఇప్పుడు ‘ఈగల్’తో పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ► రవితేజగారు అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. కానీ, కొన్నిసార్లు వాణిజ్య అంశాల కారణంగా ఒకే సినిమాలో కామెడీ, డ్యాన్స్, యాక్షన్.. ఇలా చాలా రకాలు చేయాల్సి వస్తుంది. ‘ఈగల్’లో మాత్రం ఆయన ఒక పాత్రగానే కనిపిస్తారు. ఆ తేడా సినిమా చూసే ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ఇంటెన్స్‌గా ఉంటూ కూల్‌గా ఉండటం ఆయనలో డిఫరెంట్ క్వాలిటీ. ‘ఈగల్’లో నన్ను నేను చూసుకునే పాత్ర చేశాను’ అని రవితేజగారు అనడం సంతోషం. చాలా క్రమశిక్షణ కలిగిన నటుడు. ఆయన ఆహారపు అలవాట్లు, నిద్రపోయే వేళలు పర్ఫెక్ట్గా ఉంటాయి.. సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ. చాలా ఆనందమైన జీవితం గడుపుతారు. ► పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోమ్ బ్యానర్‌లా అయిపోయింది. సినిమాకి కావాల్సిన ప్రతిదీ ఒక్క ఫోన్ కాల్‌తో సమకూర్చుతారు. విశ్వప్రసాద్, వివేక్గార్లకు కృతజ్ఞతలు. ఈ మూవీలో అనుపమ జర్నలిస్ట్ పాత్ర చేశారు. కావ్యా థాపర్, నవదీప్ పాత్రలకి చాలా ప్రాధాన్యత ఉంది. మరో చిన్న పాప పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఇక హిందీలో ‘ఈగల్’ పేరుతో ఓ సినిమా ఉంది. దీంతో ‘సహదేవ్ వర్మ’ టైటిల్‌తో అక్కడ రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. -
ఆ రోజు గోల గోల చేద్దాం
‘‘మీ అందరి (అభిమానులు) ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉంది. ‘ఈగల్’ వైవిధ్యమైన మాసీ ఫిలిం. వినోదం అద్భుతంగా ఉంటుంది. నాకు విపరీతంగా నచ్చింది.. మీ అందరికీ తెగ నచ్చుతుంది. జనవరి 13న అందరూ థియేటర్స్‌కి వచ్చేయండి.. గోల గోల చేద్దాం’’ అన్నారు హీరో రవితేజ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా జనవరి 13న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. దేవ్ జాంద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గల్లంతే..’ అంటూ సాగే రెండో పాటని సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, కపిల్ కపిలన్, లిన్ పాడారు. కావ్యా థాపర్ మాట్లాడుతూ – ‘‘గల్లంతే..’ పాట నాకు చాలా ప్రత్యేకం. రవితేజగారితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘రవితేజగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన సినిమాకి సంగీతం ఇవ్వడంతో నా కల నెరవేరినట్టు అయింది’’ అన్నారు దేవ్ జాంద్. ఈ వేడుకలో కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూఛిబొట్ల, నటుడు నవదీప్ తదితరులు పాల్గొన్నారు. కోటికి రవితేజ వాయిస్ తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలవుతోంది. ఈ సినిమాలో కోటి పాత్రలో నటించిన వానరానికి హీరో రవితేజ డబ్బింగ్ చె΄్పారు. ‘‘రవితేజగారి వాయిస్‌తో కోటి పాత్ర మరింత హ్యూమరస్, ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అని మేకర్స్ అన్నారు. -
ఈగల్లో నన్ను కొత్తగా చూస్తారు
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈగల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. అలాగే రవితేజ, శ్రీలీల జంటగా నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘ధమాకా’ విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ‘ఈగల్ x ధమాకా’ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘ధమాకా’ విడుదలై ఏడాది పూర్తయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. నిన్నో మొన్నో రిలీజైనట్లుగా అనిపిస్తోంది. ఈ సినిమాతో హీరోయిన్గా శ్రీలీల, మ్యూజిక్ డైరెక్టర్‌గా భీమ్స్కు మంచి పేరు వస్తుందని ముందే చెప్పాను. అది నిజమైంది. ‘ధమాకా’ యూనిట్ సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఇక ‘ఈగల్’ విషయానికొస్తే... ఈ చిత్రంలో కొత్త రవితేజను చూస్తారు. కార్తీక్ ఘట్టమనేనికి దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉందని నా నమ్మకం. నిర్మాత విశ్వగారితో నా జర్నీ కొనసాగుతుంది’’ అన్నారు. ‘‘అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న మంచి చిత్రం ‘ఈగల్’. థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు కార్తీక్ ఘట్టమనేని. ‘‘గత ఏడాదిని బ్లాక్‌బస్టర్‌తో ఎండ్ చేశాం. వచ్చే ఏడాదిని బ్లాక్‌బస్టర్‌తో ఆరంభిస్తాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. అవసరాల శ్రీనివాస్, హైపర్ ఆది తదితరులు మాట్లాడారు. -
సినిమా రివ్యూ - సూర్య వర్సెస్ సూర్య
కాన్సెప్ట్‌ను మింగేసిన కథన లోపాలు చిత్రం - సూర్య వర్సెస్ సూర్య, తారాగణం - నిఖిల్, త్రిధా చౌధరీ, మధుబాల, తనికెళ్ళ భరణి, మాటలు - చందు మొండేటి, సంగీతం - సత్య మహావీర, కూర్పు - గౌతమ్ నెరుసు, నిర్మాత - మల్కాపురం శివకుమార్, రచన - ఛాయాగ్రహణం, దర్శకత్వం - కార్తీక్ ఘట్టమనేని కొత్త రకం కథలు రావడం లేదనేది ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు చేసే ఫిర్యాదు. అయితే, ఎంచుకున్న ఇతివృత్తం, తీసుకున్న కథ కొత్తగా ఉంటే చాలా? వాటికి న్యాయం చేకూర్చేలా స్క్రిప్టును తీర్చిదిద్దుకొని, కథనాన్ని నడిపించకపోతే? అప్పుడూ మళ్ళీ నిరాశ తప్పదు. మరి, రొడ్డకొట్టుడు సినిమాలు ఎక్కువగా వస్తున్న సమయంలో ఆ మూసను బద్దలుకొట్టుకొని, ఒక చిన్న వెరైటీ పాయింట్‌తో వచ్చిన సినిమా - ‘సూర్య వర్సెస్ సూర్య’. సూర్యరశ్మి పడని ఒక యువకుడి చుట్టూ తిరుగుతుందీ చిత్రకథ. కథ ఏమిటంటే... అనగనగా ఓ యువకుడు. పేరు సూర్య (నిఖిల్). కానీ, అతనికో విచిత్రమైన జబ్బు. సూర్యరశ్మి కాసేపు తగిలినా అతని ఒళ్ళు కాలిపోతుంది. ప్రాణాంతకమవుతుంది. శాస్త్రీయంగా ఆ జబ్బు పేరు మాటెలా ఉన్నా, అతని చిన్నప్పుడే ఆ సంగతి డాక్టర్ (రావు రమేశ్) ద్వారా తెలుసుకుంటుంది ధనికురాలైన అతని తల్లి (మణిరత్నం ‘రోజా’ ఫేమ్ మధుబాల). అప్పటి నుంచి పగటి పూట అతణ్ణి బయటకు పంపకుండా, ఇంట్లోనే పెంచుతుంది. సూర్యుణ్ణి చూడకుండా పెరిగే సూర్య జీవితమంతా సాయంత్రం 6.30 గంటల నుంచి తెల్లవారే ముందు దాకానే! అలాంటి సూర్య కాస్తా చదువు కోసం ఒక రాత్రిపూట కళాశాలలో చేరతాడు. లేటు వయసులో చదువు కోసం కాలేజీలో చేరిన కిరాణాషాపు యజమాని ఎర్రిసామి అలియాస్ ఎర్శామ్ (తనికెళ్ళ భరణి), ఆటో డ్రైవర్ అరుణ్‌సాయి (సత్య అక్కల) అక్కడ హీరోకు పరిచయమవుతారు. వాళ్ళతో స్నేహం పెరిగిన హీరో, రెండేళ్ళుగా తాను ప్రేమిస్తున్న టీవీ యాంకర్ సంజన (త్రిధా చౌధరీ) ప్రేమ గెలుచుకోవడానికి వాళ్ళ సాయం తీసుకుంటాడు. తన జబ్బు సంగతి మిత్రుల ద్వారానే ఆమెకు తెలియజేస్తాడు. దాంతో, ఆమె, జర్నలిస్టయిన ఆమె తండ్రి (సాయాజీ షిండే) కోపగిస్తారు. హీరోను దూరం పెడతారు. ఆ పరిస్థితుల్లో ప్రేమను గెలుచుకోవడానికి సూర్య ఏం చేశాడు? ఏమైందన్నది మిగతా కథ. ఎలా చేశారంటే... గతంలో ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ లాంటి విజయవంతమైన చిత్రాల రూపకల్పనకు కలసి కృషి చేసిన యువ బృందం మరోసారి చేసిన ప్రయత్నం ఈ సినిమా. ఆ రెండు వరుస హిట్ల తరువాత ఇందులో సూర్య పాత్రలో నిఖిల్ ఎండ వేడిమికి తట్టుకోలేని వ్యాధి తాలూకు బాధను వ్యక్తం చేయడానికి ప్రయత్నించారు. తరచూ హుషారు పాత్రల్లోనే చూసే అతణ్ణి ఇలా చూడడం ప్రేక్షకులకు వెంటనే జీర్ణం కాదు. కథానాయికగా విభా నుంచి అందం, అభినయాలు ఆశించలేం. తల్లి పాత్రధారిణి మధుబాల మంచి నటి అయినా, అతిగా సన్నబడి, హీరో పాత్రకు కాదు... తల్లి పాత్రకే అనారోగ్యమేమో అనిపించేలా ఉండడం మైనస్. ఆ బలహీనతకు సన్నివేశాల్లోని బలహీనత తోడైంది. చాలాకాలం తరువాత తనికెళ్ళ భరణి ఒక పూర్తి నిడివి పాత్రలో సినిమా అంతా కనిపించారు. కొన్నిచోట్ల నటనలో తనదైన చమక్కులు చూపించారు. ఆటో డ్రైవర్ పాత్రధారి కూడా కాసేపు నవ్వించారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, ఛాయాగ్రహణం నుంచి దర్శకత్వానికి ఓ మెట్టు ఎదిగిన కార్తీక్ ఘట్టమనేని తన మునుపటి చిత్రాల కెమేరా వర్క్‌కు తక్కువ కాకుండా ఈ సినిమాను నడిపించారు. దృశ్యపరమైన అందం, లైటింగ్ తెలుస్తూ ఉంటాయి. అది సినిమాకు కొంత ప్లస్ పాయింట్. పాటలు, సంగీతం ఫరవాలేదనిపిస్తాయి. కాకపోతే, పదే పదే వినడానికీ, ప్రేక్షకులను రప్పించడానికీ దోహదపడతాయా అన్నది సందేహం. ఫస్టాఫ్‌లో వచ్చే ‘హృదయం పరిగెడుతోందే...’ అనే గజల్ తరహా గీతంలో హార్మోనియమ్ ముందేసుకొని, పాట పాడుతూ గీత రచయిత రామజోగయ్యశాస్త్రి క్షణకాలం తళుక్కుమంటారు. సన్నివేశాలు, సంభాషణల రచనలో లేని పదునును ఎడిటింగ్ దగ్గర ఆశించలేం. ఎలా ఉందంటే... నటీనటులు తక్కువే అయినా, నైట్ ఎఫెక్ట్‌ల మధ్య నిర్మాణ విలువలు బాగానే అనిపించే సినిమా ఇది. ఎటొచ్చీ స్క్రిప్టును అల్లుకున్న తీరులో, కథను నడిపించిన తీరులో తడబాట్లు ఉన్నాయి. దర్శకుడు కొత్తవాడు కావడమూ కొంత కారణమేమో అనిపిస్తుంది. నిజానికి, ఫస్టాఫ్ మొత్తం ఫ్లాష్‌బ్యాక్‌లో హీరో తన ప్రేమ, ఆ ప్రేమను పొందడానికి పడే తపనతో సరిపోతుంది. ఎండ ఉండగా బయటకు రాలేని హీరో, ఆ సంగతి బయటపెట్టకుండానే, కష్టంలో ఉన్న హీరోయిన్ను కాపాడే సీన్ దగ్గర ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఫస్టాఫ్ కాస్తంత అటూ ఇటూగా ఉన్నా, బలమైన ఇంటర్వెల్ ఘట్టం లాంటివి తోడై ఫరవాలేదనిపిస్తుంది. తీరా సెకండాఫ్‌లో హీరోయిన్‌కు ఆ విషయాన్ని ఎలా తెలియజేశాడు, వాళ్ళకు ఎలాంటి కష్టాలు వచ్చాయి లాంటివి ఏమైనా చూపిస్తారేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తాం. కానీ, కథ అక్కడ గాడి తప్పినట్లనిపిస్తుంది. మామూలు ప్రేమ కథలాగే కొనసాగుతుంది. హీరోయిన్, ఆమె తండ్రి కలసి హీరోను ఎందుకు కాదన్నారు, చివరకు ఎందుకు సరే అన్నారన్నదానికీ బలమైన కారణం కనిపించదు. జనం లేని దీవి లాంటి చోట హీరో కథ, అక్కడ పడవ దొరకడం, టీవీ చానల్లో హీరో బృందం ప్రత్యక్ష ప్రసారం లాంటివన్నీ కథను ముందుకు నడపడం కోసం సినిమాటిక్‌గా బలవంతాన అల్లుకున్నట్లనిపిస్తాయి. అలా కాకుండా, కథలో సహజమైన పురోగతి ఉండేలా చూసుకుంటే బాగుండేది. నిజానికి, తల్లీ కొడుకుల అనుబంధం, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు అతని జబ్బు అనుకోని ఇబ్బందులు తేవడం, పగటి వేళ తప్పనిసరైన బయటకు రావాల్సి వచ్చిన హీరో దాన్ని తెలివిగా తప్పించుకొనే వైనం - ఇలా ఎన్నెన్నో అంశాలతో ఈ కాన్సెప్ట్‌ను మరింత బలంగా తీర్చిదిద్దుకొనే అవకాశం ఉంది. కానీ, దర్శక, రచయిత ఎందుకనో బంగారం లాంటి ఆ అవకాశాన్ని వదులుకున్నారు. బలహీనమైన సన్నివేశాలు, అనాసక్తికరమైన స్క్రీన్‌ప్లేతోనే సినిమా అయిందనిపించారు. వెరసి ఈ సినిమా కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకున్న చిత్రంగా గుర్తున్నా... చివరకు మంచి కాన్సెప్ట్ వర్సెస్ బలహీనమైన కథాకథనంగానే మిగిలిపోతుంది. - రెంటాల జయదేవ -
సూర్యుడంటే పడదు...
ఆ యువకుడి పేరు సూర్య. కానీ అతనికి సూర్యుడంటే అస్సలు పడదు. పగలు బయట అడుగు పెట్టాడంటే అతను చనిపోవాల్సిందే. అందుకే రాత్రుళ్లే సంచరిస్తుంటాడు. మరి అతను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనేది తెలియాలంటే ‘సూర్య వెర్సెస్ సూర్య’ చూడాల్సిందే. సురక్ష్ ఎంటర్టైనమెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటడ్ పతాకంపై నిఖిల్, త్రిద జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని మార్చి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ -‘‘ప్రేమ కథా నేపథ్యంలో వచ్చే ఓ విభిన్న చిత్రమిది. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ చిత్రాలను మించి పెద్ద హిట్ అవుతుంది’’ అని తెలిపారు. సూర్యుడికి, సూర్యకి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రమని దర్శకుడు పేర్కొన్నారు. రచయిత చందు మొండేటి మాట్లాడుతూ -‘‘ప్రచార చిత్రాలకు, పాటలకు మంచి స్పందన వస్తోంది. నిఖిల్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రం అవుతుంది’’అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 700 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. -
సూర్య vs సూర్య మూవీ స్టిల్స్