Teja Sajja: ‘సూపర్‌ యోధ’గా ‘హను-మాన్‌’ హీరో | HanuMan Hero Teja Sajja Next Film With Karthik Ghattamaneni | Sakshi
Sakshi News home page

Teja Sajja: ‘సూపర్‌ యోధ’గా ‘హను-మాన్‌’ హీరో

Apr 16 2024 11:35 AM | Updated on Apr 16 2024 11:43 AM

Hanu Man Hero Teja Sajja Next Film With Karthik Ghattamaneni - Sakshi

‘హను–మాన్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో తేజ సజ్జా. తాజాగా ఆయన కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ‘ఈగల్‌’ ఫేమ్‌ కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రకటించి, పోస్టర్‌ రిలీజ్‌ చేసింది యూనిట్‌. ‘హను–మాన్‌’ చిత్రంలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తేజ..

కొత్త పోస్టర్‌లో స్టైలిష్‌ మేకోవర్‌లో కనిపించారు. ‘‘సూపర్‌ యోధ సాహసోపేతమైన కథతో పాన్‌ ఇండియా మూవీగా ఇది తెరకెక్కనుంది. ‘ఈగల్‌’ తర్వాత కార్తీక్‌ ఘట్టమనేనితో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఈ సినిమా పూర్తి వివరాలను ఈ నెల 18న ప్రకటిస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, క్రియేటివ్‌డ్యూసర్‌: కృతీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుజిత్‌ కుమార్‌ కొల్లి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement