గురి తప్పదు | Director Sekhar Kammula About Naga Shourya New Movie | Sakshi

గురి తప్పదు

Jul 28 2020 6:36 AM | Updated on Jul 28 2020 6:36 AM

 Director Sekhar Kammula About Naga Shourya New Movie - Sakshi

నాగశౌర్య

నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై నారాయణదాస్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహనరావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. నాగశౌర్య నటిస్తోన్న 20వ చిత్రమిది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని దర్శకుడు శేఖర్‌ కమ్ముల సోమవారం విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం నాగశౌర్య ఎంతో శ్రమించి సిక్స్‌ ప్యాక్‌లోకి మారడం చూసి ఆశ్చర్యమేసింది. ‘ఛలో, ఓ బేబి, అశ్వథ్థామ’ వంటి చిత్రాలతో అలరించిన శౌర్య ఇప్పుడు మరింత మాస్‌ లుక్‌లోకి మారడం శుభ పరిణామం. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. సిక్స్‌ ప్యాక్‌ దేహంతో గురి తప్పదనే నమ్మకంతో విల్లు ఎక్కుపెట్టిన నాగశౌర్య ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వస్తోందని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement